"నేనెవరిని ? ఈ జన్మకి గమ్యం ఏమిటి? Who am I ?
"నేనెవరిని ? ఈ జన్మకి గమ్యం ఏమిటి?
నేను శరీరం ,మనస్సు ,బుద్ది ,ప్రాణం ఇవేమీ కాదు .
మనస్సు మొట్ట మొదట నేను అనే ఆలోచన చేసింది. అదే అహం .
ఆ తర్వాత , ఎన్నో రకాల ఆలోచనల తో ఈ ప్రపంచాన్ని నిర్మిస్తుంది .
చింతలతో , ఆశా నిరాశల నడుమ ఊగిసలాడే మనస్సుతో ,కాసేపు సంతోషం ఆ వెంటే దుఖం ,ఇంతలోనే నిర్వేదం ,అంతలోనే ఉత్సాహం - ఈ ద్వందాలకు అంతమే లేదా?
కష్టాలొచ్చినపుడు ఇంకొకరిపై ఆధారపడి లేదా దేవుని పై భారం వేయటం
తాత్కాలిక వైరాగ్యపు ఆలోచనలతో సోమరితనంతో పలాయన వాదాలు చేయటం
సమస్యలను దాటవేసి 'నా కర్మ ' అని అనుకోవటం - మనందరికీ మామూలే !
నీ సమస్యలకు సమాధానం నువ్వే వెదుక్కోవాలని
కష్టాలు ,సుఖాలు మన మనస్సులోని కండిషనల్ ప్రోగ్రాంస్ అని
శక్తి వంచన ,ఆత్మ వంచన లేకుండా కష్ట పడాలని
ఎవరి పై ఆధారపడరాదని ,భావ దాస్యం చేయరాదని
తెలుసుకొని నమ్మి ఆచరించడమే - మన పని, మన గమ్యం.
మనిషి తను ఆనందపడుతూ వీలైతే తోటి వారిని ఆనందంగా ఉంచుతూ , జీవన ప్రయాణం చేయడమే గమ్యం .
శక్తి కొద్దీ సత్కర్మలు, స్వకర్మలు చేయాలి.
మనస్సుని ఉత్సాహంగా ,సంతోషంగా ఉంచుకోవాలి .
పూజ , అంటే అర్ధం ఏమిటి ?
దేవుని ,శక్తిని , ప్రక్రుతిని ఆరాధించి పూజించు.
కానీ పూజ అంటే ప్రేమతో కూడిన సేవ అని ,
సంతోషకరమైన త్యాగం అని అర్ధం చేసుకొని మసలుకోవాలి.
ఎందుకంటే , దేవుడన్నా ,ప్రక్రుతి అన్నా మనకు కనిపించే
తోటి మనుషులు ,ఇతర జీవాలు ,చెట్లు ,కొండలు, వాతావరణమే !
రోజూ ఇళ్ళల్లో ,గుళ్ళల్లో చేసేది సింబాలిక్ పూజ.
మాటలు, స్తోత్రాలు , పద్యాల భావం -పొగడటం , నివేదన, నైవేద్యం , అపరాధ క్షమార్పణ.
ఇవే పనులను మనం తోటి వారికి, ప్రక్రుతికి చేయడమే అసలైన నిజమైన పూజ .
మేము సంపూర్ణ శరణాగతితో భగవంతుని కొలుస్తాము
ఎలాంటి కష్టమొచ్చినా , ఎంత సంతోషమేసినా మేము ఒకేరకంగా నిర్వేదంగా ఉంటాము
చేతనైతే ఇతరులకు సాయం చేస్తాము, లేకుంటే భగవన్నామ సంకీర్తన చేస్తాం -ఇలా భక్తి యోగం
మా పనిని , వ్రుత్తిని ధర్మ బద్దంగా చేస్తాం
ఫలితం ఎలా ఉన్నా మా పనిని శక్తి వంచన లేకుండా చేసుకుపోతాం
సంఘానికి చేతనైనంత సాయం అందిస్తాం - ఇదీ కర్మ యోగం
రాగ ద్వేషాలకు అతీతంగా , మనస్సులో ఎలాంటి అనుభుతులూ లేకుండా
స్వధర్మాలను ఆచరిస్తాం - రాజ యోగం .
ప్రతి పనినీ, ప్రతి అనుభవాన్నీ ,అనుభూతినీ , ప్రతి ఫలితాన్నీ విచక్షణ చేస్తూ అర్ధాన్ని పరమార్ధాన్ని అవలోకిస్తాం -జ్ఞాన యోగం.
భగవంతుడనే శక్తికి నిమిత్త మాత్రంగా వాహకంగా ఉండటమే- భక్తి యోగం .
పనికి ,వ్రుత్తికి వాహకంగా ఉండటమే- కర్మ యోగం .
లోకాన్ని సాక్షిగా చూడటమే- రాజ యోగం .
లోకాన్ని సాక్షిగా చదవడమే -జ్ఞాన యోగం ..
ఈ దారులన్నీ కలగాపులగంగా అర్ధంచేసుకోకుండా ఎవరి మానసిక స్థితి , స్థాయి ని బట్టి ,ఏదో ఒక మార్గాన్ని అమలు చేసి మన గమ్య మైన మోక్షం అందు కోవాలి .
'Who am I?'
'Jnana is ''I'' and the nature of jnana is sat-chit-ananda'.
The nature of knowledge is sat-chit-ananda [being-consciousness-bliss].
So,we are the bliss...
Comments
Post a Comment