మన కర్తవ్యం .
మనిషి లో ఎందుకు ఇంత ఆక్రోశం ,కాటిన్యం ,క్రౌర్యం ,ఏహ్యం పెరిగి పెచ్చరిల్లి సమాజాన్ని అతలా కుతలం చేస్తున్నాయి ? మనం ఏం చేయాలి ?
కావలసింది దొరకక పోవటం , దొరికింది తృప్తిని ఇవ్వకపోవటం ,
అది మిగతా వారికి దక్కి సమాజ అసమానత కు దారి తీయటం ,
వ్యసనాలకు వివేక విచక్షణలు నశించి విశ్రుంఖలత కు దారి తీయటం ,
ధన ,మాన ,ప్రాణాల మీద అమితమైన ఆసక్తి ,
కాంతా కనకాల పై విపరీత అనురక్తి , ---- ఇలా మానసిక
అసమ తుల్యత మనుషులను
పూర్తిగా మృగ స్థాయికి దిగ జార్చు తుంది .
నిస్సహాయులపై , స్త్రీ లపై దాడి , మాన భంగాలు మితి మీరి సమాజం
ఆటవిక నికృష్ట త కు ఆలవాలమై పోతుంటే ,ప్రభుత్వం ,
యువత చేతులు కట్టుకొని చూస్తుంది .
ధర్మ ,న్యాయ దృక్పధం ఉన్న నాయకులు కరవై ,
యువత మత్తు పదార్ధాలకు ,సోమరి తనానికి బానిసై ,
సమాజం లో ధనిక ,పేదల తేడా పదింతలై ,
దేశం అవినీతి కూపం లో కునారిల్లు తుంటే
ఎవరో వస్తారని ఎదురు చూడ టం పిచ్చితనం .
ఎదురు తిరిగి పోరాడటం మనిష న్న వాడి కర్తవ్యం .

Comments
Post a Comment