దారి మరిచిన మనిషి

మా దారి రహదారి అని అహం తో విర్రవీగే మానవాళికి - అది సరే ,దానితో పాటు ఈ రహదారి -'దైవం దారి' ని కూడా గుర్తు పెట్టుకొని పయ నిం చండి ' అని చెప్పేవి వేదాలు . సరిగ్గా  శ్వాస పీల్చడం కూడా  రాని మనిషి ని శ్వాసాయామం తద్వారా ప్రాణాయామం చేయమని , ఇడా  పింగళ నాడుల ద్వారా నడిచే శ్వాస ను సుషమ్నా నాడి ద్వారా నడిపించా లని చెబుతారు యోగులు .

సగటు మనిషి కి తన ఎరుకలో లేని విషయా లైన ఆత్మ ,అంతఃకరణ ,నాడీ శోధన , చిత్త శుద్ది -వీటి గురించి ఎంత చెప్పినా ఇష్ట పడరు . వారికి కనీస అవసరాలు తీరాలి . ఉదృతం గా వస్తున్న  కోరికలు తీరాలి . ఎప్పటి కప్పుడు మారే  కోరికల హోమాగ్ని లో    ఇంద్రియాల ద్వారా సమాచారం వేస్తూ ఉండాలి .
ప్రస్తుతం ప్రతి మనిషీ ,  కంటికి కనిపిస్తున్న వాస్తవాన్ని  ఆధారం చేసుకొని బతుకు తున్నాడు .
 అది వాస్తవం కాదు ,అసంపూర్ణ సత్యమే (మిధ్య ) అని తత్వ వేత్తలు ,మహర్షులు ఎంతగా చెప్పినా వినే సమయం ,అవసరం ,ఓపిక లేవు .
ఈ బతుకు ఒక కల లాంటిదని ఎంత మొత్తుకొన్నా , ఆకలి,దాహం ,సుఖ లాలస ని ఎవరూ కాదన లేరు . 
నిజం చెప్పా లంటే ,స్పందనలు లేని స్థిర చైతన్యానికి(దైవమని అనుకొందాం ) సృష్టి చేయా లనే సంకల్పం కలిగి  విశ్వం నడుస్తున్న వ్యవహారం  చూస్తే , మన ప్రపంచం కూడా దైవ లీలలో ఒక ముఖ్యమైన భాగమని తేలుతుంది . అందుకే మహర్షులు కూడా ఇహ లోకాన్ని నిర్లక్ష్యం చేయ లేదు . దీనికి ఎంతో ప్రాముఖ్యత ని చ్చారు .
 కానీ వారు చెప్పింది ఒక్కటే - జీవి(దేహి లేదా ఆత్మ) చేసే మహా ప్రయాణం లో ఇహ లోకపు బతుకు చాలా చిన్న విషయం .  నిద్రలో వచ్చే కల కి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తాం ? ఆత్మ చేసే మహా ప్రస్తానం లో ఇహలోకపు బతుకు కూడా అలాంటిదే అని ఋషుల అనుభవం . కానీ ఈ 'క్షణిక' మాత్రపు ఇహలోకపు బతుకు కి కూడా ఒక అర్ధం , పరమార్ధం ,ఒక అవసరం , ఒక నియమం ,ఒక సువర్ణ అవకాశం ఉన్నాయని కూడా ఋషులు చెప్పారు .

ఆత్మ మహా పయనం త్వరగా ముగిసి మోక్షం పొందా లంటే  మనిషి  బతుకు ఒక గొప్ప అవకాశం .
ఈ బతుకు బతికే విధానం ఆత్మ ప్రస్థానాన్ని ప్రభావితం చేస్తుంది .

చావు -పుట్టుక లనే సంసార చక్రం లో నే ఉండిపోయి , మనిషి మానవుడిగా మిగిలి పోవా లంటే మానవత్వం తో ఉండటమే మనిషి కనీస కర్తవ్యం .
  •  తను,తన కుటుంబం తో పాటు చుట్టూ ఉన్న ప్రక్రుతి -స్థావర జంగమాల ను పోషణ చేయాలి .
  • తనకి ఏ పను లైతే   కష్ట  నష్టాలు కలగ చేస్తాయో వాటిని పరులకు చేయకూడదు . 
  • ప్రతిఫలం ఆశించి చేసే   ప్రేమ , సేవ ,కర్మ - ఇవన్నీ మనిషి కనీస బాధ్యతలు -మానవత్వపు గుర్తులు .
కానీ ఈ కనీసపు బాధ్యతను కూడా మనిషి మరిచి పోయి చాలా యుగా లైంది .

Comments

Post a Comment

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి