అంతా చేసింది నువ్వే ...
ఈ సృష్టి భగవంతుని రచనా ? లేక యాదృచ్చికం గా జరిగిందా ?
అసలు దైవం అనే శక్తి ఉందా ? లేక మనం భ్రమల్లో ఉన్నామా ?
ఏదో పుట్టాం . పెరిగాం . సుఖదు ఖాలు చూశాం . చిరాకు -పరాకు ,అసూయ -అపనమ్మకం ,కోపతాపాలు,అవమానం -ఆక్రోశం ...ఇంకా ఎవేవో అనుభవాలు - అన్ని ప్రాణుల మాదిరిగా నే
అనుభూతి స్తున్నాం . కాబోతే తెలివి,ఊహ ,తార్కిక బుద్ది ఉంది కాబట్టి కొంచెం
ఎక్కువగా నే అనుభ విస్తున్నాము .
ఏది ఎలా ఉన్నా , మనిషి సుఖం గా బతకడానికి జ్ఞానం కావాలి .
ఆ జ్ఞానం, సుఖం తో పాటు ప్రశాంతత నివ్వాలి గానీ,ఆందోళన ,ఆవేదన ఇవ్వకూడదు అని వేదం గట్టిగా చెప్పింది .
మనిషి గమ్యం ఆనందం .
మనిషి కర్తవ్యమ్ కుటుంబ ,దేశ ప్రశాంతత .
పాపం,పుణ్యం ,స్వర్గం,నరకం అని చెప్పి ప్రజలకు భయ భక్తులు నేర్ప వలసిన అగత్యం వేద కాలం లో లేదు .
ఎందు కంటే ఎక్కువ శాతం ప్రజలు ఆర్ధికం గా హార్ధికం గా సమతుల్యతలో ఉండే వారు .
అసమానతలస్సలేమీ ఉండేవి కావు .
ఎప్పుడై తే అసమానతలు ఎక్కువ అయ్యాయో అప్పుడే ఘర్షణలు మొదలయ్యాయి . ఆ గొడవలను నియంత్రించి సమాజం శాం తం గా ఉంచటానికి కర్మ ,విధి ,పాపం,పుణ్యం ,స్వర్గం,నరకం అనే సిద్దాంతాలు వ్యాప్తి చేయ వలసిన అవసరం కలిగింది . .
సనాతన శాస్త్ర జ్ఞానం శరీరానికి,మనస్సుకి,ఆత్మ కి సమాన హోదా ఇచ్చింది.
"నేను ,నాది" అనే కాక ,- "మనం,మేము" అనే ద్రుక్పధాన్ని ప్రచారం చేసి,
మనిషిలో ఇంకే టట్లు చేయ డమే నాగరికత కి అర్ధం .
అంతరిక్షం,ఆకాశం ,భూమి పై జరిగే సంఘటనలు - మనిషి శరీరం ,ప్రాణం , మనస్సు లను ప్రభావితం చేస్తాయని
మహర్షులు చెప్పారు . ఎందు కంటే అన్నింటి లో అంతర్లీనం గా చైతన్యం ఉందని ,
దానిని తెలుసుకోవడ మే పర మార్ద మని ఋషి వాక్యం .
జ్ఞానం అనేది రెండు రకాలని,ఒకటి అపరా విద్య(dual and lower knowledge) ,
రెండోది పరా విద్య (unified or transcendental and higher knowledge)అని వేదవాక్యం .
పిండాండం లొ ఏముందో బ్రహ్మాండం లో కూడా అదే ఉంటుందనే ప్రగాడ నమ్మకం తో మనిషి తన్ను తాను పరిశీలించు కొన్నాడు .
అంతర్యానం (యోగ , ధ్యానం ,అంతర్ముఖం ,నివ్రుత్తి),నిత్యాఅనిత్య విచక్షణ అనే విధానాలు మహర్షులు కని పెట్టి,అవి ఫలించా లంటే చిత్త శుద్ది,అహంకార రాహిత్యం ఉండాలని ,వీటిని పొందడానికి వివేక వైరాగ్యాలు అభ్యాసం చేయా లని ,కోరికలను మితం గా ఉంచు కోవాలని, అదే సమయం లో ప్రక్రుతికి,సమాజానికి ఎలాంటి హానీ తల పెట్ట రాదని,అలాగే వర్ణాశ్రమ విధులు,నిత్య నైమిత్తిక కర్మలు కర్త్రుత్వ భావన -కర్మఫలాపేక్ష లేకుండా చేయాలని ఉద్బోధించారు.
మనకు పంచ కోశాలు ఉన్నాయని , అవి పూర్తిగా ఎలాంటి కర్మావ శేషం లేకుండా శుద్దమ్ కావా లని ,దానికి ధ్యాన సాధన చేయాలని తద్వారా ఎరుక ని శరీర స్థాయి నుండి క్రమం గా ప్రాణ స్థాయి ,మానసిక స్థాయి,
కారణ శరీర స్థాయి,చివరికి ఆత్మ స్థాయి కి విస్తరించు కోవచ్చని కూడా చెప్పారు .
ఆసన ముద్రలు,యమ నియమాలు శరీరాన్ని ,
ప్రాణాయామం ప్రాణ వాయువులను ,
ప్రత్యాహారం ,ధారణ ,ధ్యానం మనస్సుని ,
సమాధి స్థితి కారణ శరీరాన్ని --- పరిశు ద్దం చేసి ,ఎరుక ఆత్మ స్థితి కి ఎదగడానికి శరీర వ్యవస్థలను సమాయత్తం చేస్తాయని మహర్షులు కను గొన్నారు .
కానీ ఈ సాధనకి అత్యంత ముఖ్యమైన ది, పునాది వంటిది - ఆత్మ స్థితికి చేరుకోవా లనే
గాడ మైన కోరిక ,వివేక వైరాగ్య అభ్యాసం , శ్రద్ద - ఓర్పు.
మానవ జాతి ఈ భూమి పై అవతరించి 1.5 లక్షల ఏళ్ళు ఐనా,పాశాత్య చరిత్ర కారులు కేవలం 5000 ఏళ్ళ చరిత్ర చెబుతూ ,అంతా యూ రోపియన్స్ కనిపెట్టిన శాస్త్ర మే తప్ప మిగతా వారికి చరిత్ర,నాగరికత,శాస్త్ర జ్ఞానం లేనట్లు గా పుస్తకాలు ముద్రిస్తున్నారు .
అవే తప్పుడు విషయాలను మన దేశ సిలబస్ లొ పెట్టుకొని పిల్లలను తప్పు దారి పట్టించడ మే కాక,మన జాతికి,మన చరిత్రకి,మన మహర్షులకు ఘోర అవమానం,అన్యాయం చేసిన వార మవుతు న్నాము .
సున్నాని ,పూర్ణాన్ని , డెసిమల్ ని , పైథాగరస్ సిద్దాంతం గా చెప్పుకొంటున్న సమీకరణాన్ని,
త్రికోణమితి ని (trogonometry ),భాషలో ని వ్యాకరణ ,శబ్ద రహస్యాలను ,అంతరిక్ష విజ్ఞానం,గణితం,
నక్షత్ర,గ్రహ గమనం,కోణీయ వేగాన్ని (angular velocity) , చతుర్భుజ సూత్రాలను (quadrangular equations) -ఇలా చెప్పు కొంటూ పోతే అంతు లేని జ్ఞానం, వేద ప్రజల సొంతం .
40000 ఏళ్ల క్రితం ప్రజలు వారి భావాలను గుహలలో చిత్రాలు గా రాతి బిళ్ళ లపై గుర్తులుగా వ్యక్తీ క రించే వారు .
వేదాలు సుమారు 10000ఏళ్ల క్రితం అక్షర బద్ద మైనట్లు గా పరిశోధకులు గుర్తించారు .
సింధు సరస్వతీ నదుల మధ్య ఉన్న డెల్టా ప్రాంతం, గంగా నదీ తీర మైదానాలు వేద నాగరికతకు పట్టుగొమ్మ .
సుమారు క్ర్రీ.పూ. 2000 లో ఖండ చలనాల వలన సరస్వతీ నది భూమిలోకి ఇంకి పోయింది .
మనిషి ముందుగా తన మానుష్య ధర్మం శక్తి వంచన లేకుండా నిర్వర్తించిన నాడు ఎవరికీ భయ పడ నక్కర లేదు.
అసురీ సంపత్తు పెంచు కొంటే పరిణామం లో పతన మైతాడు .
దైవీ సంపత్తు తో దైవ మార్గం లో అప్రతిహతం గా సాగుతాడు .
మానసిక స్థాయిని బట్టి మనిషి స్థుతి ,ప్రార్ధన ,ఉపాసన చేయాలి .
అనగా దైవానికి ఏయే లక్షణా లున్నాయని నమ్ముతున్నామో వాటిని మనిషి అలవర్చు కోవడ మే దైవ సేవ .
ఇలా చేసిన వారు ఎప్పటికీ నిరాశ పడరు .
భౌతికం గా ,ఆధ్యాత్మికం గా ముందుకు పురోగ మిస్తూ సత్యానంద స్థితికి దగ్గ రవుతారు .
స్వస్తి . శుభం భూయాత్

so nice plz do continue
ReplyDelete