Ego ?

ఇహం లో అహం ఉండాలా ? పరానికి అహం నిరొధమా ? 
అహంకారం అంటే ఏమిటి?
"నేను,నాది,నేనే," అనే భావ మే అహంకారం . అహంకారాన్ని క్రమం గా తగ్గించు కోవాలి . 

అహం లేక పోతే మనిషి ఎలా పని చేస్తాడు ? అహం ఉంటే నే కదా పని చేయాలనే ఉత్సాహం ఉంటుంది . 
సంపాదనకి ,కార్య నిర్వహణ కు మనిషికి ప్రోత్సాహం, కోరిక ఎలా వస్తాయి ?

సంపాదన, దానితో వచ్చే కష్ట నష్టాలు ,సుఖ దుఖాలు  తద్వారా ఏర్పడే బంధాలు ,తరగని కోరికల ప్రవాహం ,దానితో కలిగే తృప్తి,నిరాశ ,ఇదంతా మనిషికి ఒక విష వలయం లా తయా రయి అందులో చిక్కుకు పోయి ఆవేదన,దుఖం ,విసుగు, కలిగి ప్రశాంతత లోపించి అప్పుడు శాంతి,ఆనందాల కోసం ఎదురు తెన్నులు చూస్తాడు. 
సంతోష మైనా ,దుఃఖ మైనా కొంత సమయానికి వాటి ప్రభావం కోల్పోతాయి . 

అంటే మనల్ని ఎవరైనా కొట్టినా,అవమాన పరిచినా, ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకున్నా ఊరుకోవాలా?

నేను - నాది -నాకే జరిగింది -నన్నే తిడ తావా -నన్ను కొడతావా -నా మాట లెక్క చేయరా - నన్ను లోపలికి రానివ్వరా - నన్ను కూడ డబ్బు అడుగుతారా - నా మీద చేయి వేస్తారా -ఇలా సాగుతుంది మనస్సులో మధనం . 

ఈ మధనం లో  "నేను " అనేది బాగా కనిపిస్తుంది . దానిని లేకుండా చేయ డమే  అహంకార రాహిత్యం . 

నీ పైన జరిగిన  చర్య (action)అనేది నీ స్థితికి, సంఘ నియ మాలకు విరుద్దం గా ఉన్నప్పుడు తప్పక అడ్డుకోవాలి.
నువ్వు  తీసుకొనే (ఎదిరించే) "ప్రతి చర్య "కర్త్రుత్వ భావన లేకుండా సంఘ నియమాలకు లోబడి ఉండాలి.                    ఆ  క్రమం లొ ఎక్కడా "నీ -నా" అనే బేధ భావం ఉండకూడదు . 
ప్రతి జీవి తన ఉనికిని చాటు కోవడానికి ప్రయత్నం చేస్తూ నే ఉంటుంది . 
 ఉనికి పోషణకి,రక్షణకి మాత్రమే తగు అహం ఉండాలి .  ఆ గీత దాటితే స్వార్ధం,దురాశ  వాటితో అరిషడ్వర్గాలు మనిషిని చుట్టే స్తాయి . 

అంతా  దైవ మే చూస్తుంది- అనే భావం ఆత్మ సాక్షాత్కారం ఉన్న యోగులకు తప్పితే మామూలు సాధకులకు నప్పదు . ఎందుకంటే,నీలో ,నాలో ఉన్న ఆత్మ, దైవ మే కదా . అలాంటప్పుడు నిన్ను ఈ భూలోకం లో మనిషిగా పుట్టించిన ఆ ఆత్మే మన గురువు , దైవం . 
శరీరం,బుద్ది - ఆత్మ కు పరికరాలు . అవి అనిత్యా లైనా  పరికరాలకు హాని కలుగుతుం టే మనం కాపాడు కోవల సిందే . అందుకే మానవ సేవ మాధవ సేవ అని అంటారు . 
కాబట్టి మన ఎరుక స్థాయిని బట్టి మన "ప్రతి చర్య" (reaction) ఉంటుంది. 

అదంతా చేసింది నేను - నా వలనే  అది జరిగింది -  నేనంటే అందరికీ ఇష్టం -నేను లేక పోతే ఆ పని పూర్తవ్వదు --- ఇలాంటి భావాలలో కూడా నేను" బాగా కనబడుతుంది . 
ఈ భావాలన్నింటినీ సాక్షీ పరం గా చూస్తే అహంకారం తగ్గినట్లే . 
సంతోషాన్ని  ఎప్పుడై తే సాక్షీ భావం తో చూశావో ,దుఃఖాన్ని కూడా అలాగే చూడటం నేర్చు కొంటాము . 


ముందు గా ప్రతి మనిషి తను ఆనందం గా ,ప్రశాంతం గా ఉండాలని కోరుకోవాలి . అలాగే మన చుట్టూ ఉన్న ప్రాణులు ,నిర్జీవ పదార్ధాలు కూడా మన ఆనందం లో పాలు పంచు కొనే అవకాశము  ఉండాలి . 
శరీరాన్ని ఆరోగ్యం గా ఉంచుకోవాలి . 
ప్రాణాన్ని తేలికగా సరఫరా అయ్యే టట్లు  చేసు కోవాలి . 
మనస్సు ప్రశాంతం గా ఉండాలి . 
ఇవన్నీ జరగా లంటే అవసరాలు,కోరికలు మితం గా ఉండాలి . ఆహార వ్యవహారాలూ నియమితం గా ఉండాలి . 
అందుబాటు లో  వనరులు అందరికీ సరిపడా ఉన్నాయా  ? అనే  ప్రశ్న వేసు కోవాలి .
బాధలు వచ్చిన ప్పుడు సమత్వం గా ఉండే విధం గా మనస్సుని నియంత్రించు కోవాలి .
ముఖ్యం గా మనిషి సంఘ జీవి . ఆ సంఘానికి తగినంత పోషణ , గౌరవం ఇవ్వాలి .
సంఘ పరిధిని దాటా లంటే దానికి కొన్ని సూత్రాలు పాటించాలి .
సంఘం ఎలా ఉంటే చక్కగా ఉంటదని నువ్వు కోరుకొంటున్నా వో ,
ఎలా మారితే ఎక్కువ మందికి ప్రయోజన కరం గా ఉంటుంది అని అనుకొంటు న్నావో -ముందు నువ్వు అలా మారి, ఆచరించి చూపాలి .

మనం ఎవర్నై తే అవతార పురుషులని పూజిస్తున్నా మో, వారు చేసింది అదే . ఆచరించి చూపారు .
మహాత్ముడు కుల వ్యవస్థని ప్రోత్సహించారని ఈ మధ్య కొందరు మేధావులు విమర్శిస్తున్నారు .
అప్పుడు మన దేశానికి స్వాతంత్రం ముఖ్యం . మనుషులను కలుపుకొని పోవాలి . కరడు గట్టిన ఆచారాలను విమర్సించు కొంటూ పోతే లక్ష్యం తప్పుతుంది . ముందు కావలసింది స్వాతంత్రం . తర్వాత సంఘ సంస్కరణ .
ఒక ఉద్యమం బలిష్ట మవ్వా లంటే ,సంఘం లో ఎవర్నీ వదులు కో కూడదు .
అగ్ర వర్ణాలు ,అణగారిన ప్రజలు అందర్నీ ఒకే తాటి పై సంఘ టితం చేయ గలిగాడు అంటే అణగారిన ప్రజలు
గాంధీని  పూర్తిగా విశ్వసించా రని అర్ధం . 

30% మనుషులు అవసరాలు తీరక , 63% మనుషులు విలాసాల వలలో ఇరుక్కుని ,మొత్తానికి 99% మంది చిన్న వో ,పెద్ద వో కోరికల గాలానికి చిక్కి అవి తీర్చు కొనే క్రమం లో మానవ జన్మ ని ఎ ల మార్చు తున్నారు .

కొంత మంది శారీరక ,ప్రాణ , మానసిక రుగ్మతలతో అల్లాడుతూ ఆర్తి తో ,ఆవేదన తో మాడి పోతున్నారు .
శరీరం మనస్సు ప్రాణం -ఇవన్నీ అనిత్యాలు , ఆత్మ నిత్యం .

 మనిషి ప్రస్తానం :
సో హమ్ .... అహం
ఇది నా శ రీరమ్. ఇది నా ప్రాణం . ఇది నా మనస్సు .
శరీరం 'నేను' కాదు .
"నేను" - ,మనస్సూ కాదు . అవయాలు కాదు.ఇంద్రియాలు  కాదు .
"నిజమైన నేను" -ఆత్మ .
ఒకే తత్వానికి ఒక చివర ఆత్మ -మరో చివర శరీరం .
నా ఆత్మ వేరు . మరొకరి ఆత్మ వేరు . ఇలా ఎన్నో ఆత్మలు ఉన్నాయి .
 నాది అని అనుకొన్న నా ఆత్మ పరమాత్మ లో భాగ మే . అలాగే అన్ని ఆత్మలు కూడా పరమాత్మ లో భాగ మే .
సర్వమూ పరమాత్మే . శరీరము,మనస్సు,ప్రాణము ,సంఘము,చరాచర ప్రక్రుతి,ఆత్మలు అన్నీ పర మాత్మే .
శక్తి -పరబ్రహ్మ;ప్రక్రుతి -పురుషుడు అంతా పరమాత్మ .
వ్యక్తమైన వన్నీ అవ్యక్త పరమాత్మ వివిధ విభూతు లే.
పర మాత్మే  నేను .
నేనే పర మాత్మ . ఇది సత్యం -ఇదే ఆనందం .
అహం బ్రహస్మి .
ఓం తత్సత్ .

సామాన్యుడికి కర్మ చక్రం ,సంసార బంధనం ,ఆత్మ అవగతం - ఈ పదా లన్నీ వింత గా తోస్తాయి .
అందుకే వారిని దైవ మార్గం లో నికి ఆకర్షించ డానికి ,
అలమటిస్తున్న మనస్సులకు కొంచ మైనా స్వాంతన కలగ చేయ డా నికి
వారి కోరికలు,మొక్కులు తీర్చడం , నామ రూప సంకీర్తనలు అలవాటు చేయ డం  చేస్తారు సద్గురువులు .
వీరిని ఆదుకోవడానికి ఎందరో మహానుభావులు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు . చేస్తున్నారు .
అందరికీ  స్వాంతన కలగా చేయ డానికి మటాలు ,గుళ్ళు ,తీర్దాలు ,స్వాములు ,రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు .
ఎప్పటికి  స్వాంతన కలుగుతుందో ,ఎప్పుడు ఆత్మ మార్గం లోకి పయ నిస్తారో కాల మే చెప్పాలి .

"The key is to live in the world, but not be attached to it.
Work hard, but not be attached. Our attachment should be with God.
It is not wealth and power that make people slaves, but it is clinging to wealth and power 
that makes enslaves people.”

Comments

Post a Comment