జ్ఞానం అవసర మా ?

జంబూ ద్వీప భరత వర్ష భారత దేశ  విజ్ఞానం సనాతనం .- 
The Eternal ultimate ultra truth.

దేశం ,సంఘం , శరీరం,మనస్సు,ఆత్మ  - ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా సఖ్యత లో ఉండాలని ,
కష్ట నష్టాలు ,సుఖ దుఖాలు కలిసి పంచు కోవాలని ,
ఆహారం ,మంచి  నీరు అందరికీ సమానం గా అందా లని ,
సకాలం లో వర్షాలు కురిసి పాడి పంట బాగుండా లని ,
ఈతి బాధలు ,అంటువ్యాధులు రాకుండా ఉండాలని --- భారతీయులు ప్రకృతిని, దైవా న్ని ప్రార్ధించే వారు .
అప్పుడే కాదు ఇప్పటికీ , ఎప్పటికీ  "లోకా సమస్తా సుఖినో భవంతు " అనే హృద్య మైన భావన భారతీయుల
మదిలో ఉంటుంది . దీనికి కారణం ఇది వేద భూమి . వేద నాదం ప్రతిఫలించిన గడ్డ .
వేదార్ధం తెలియక పోయినా ఆ వేద నాదానికి మంత్ర ముగ్డులవ్వని బిడ్డ ఉండని గడ్డ ఇది .
ప్రతి వేద సూక్తానికి మంత్ర ద్రష్ట , ఛందస్సు ,మంత్ర అది దేవత లుంటారు .
వేద నాదం నాడీ మండల ప్రశాంతత నిస్తుందని శాస్త్రజ్ఞులు నిరూ పించారు .
వేద మంత్రాలు ఆధ్యాత్మిక ,అధి భౌతిక ,అధి దైవిక శాంతి నిస్తాయి .

ఐక మత్యం గా ఉండి సంఘాన్ని ,దేశాన్ని బలవత్తరం చేయా లని కోరుకొన్నారు .
ప్రక్రుతి ప్రసాదించిన వనరులకు , గో సంపదకు సంతోష పడిపోయారు .
 శత్రువులనుండి ,దొంగల నుండి ,క్రూర జంతువుల బారి నుండి కాపాడ బడి నందుకు కృతజ్ఞత గా --- మిత్రావరుణులు ,ఆదిత్యుడు ,ఇంద్రుడు , నారాయణుడు ,
రుద్రుడు ,గణపతి ,శక్తి మాత  లను కొలిచి ప్రార్ధించే వారు .
దేవతలకు అగ్ని ద్వారా హవిస్సు సమర్పణ చేసే వారు .
ఎందు కంటే వారు తినే ఆహారాన్ని అగ్ని పైనే పక్వం చేసే వారు .
అందుకే దేవతల కిచ్చే ఆహారాన్ని కూడా అగ్ని ద్వారా నే సమర్పించే వారు .
పంచ భూతాల లో  అగ్ని,ఆకాశం మాత్రమే ఎలాంటి కలుషితం కాకుండా ఉంటాయి .
అందులో మనకి అందుబాటులో ఉండేది ఒక్క అగ్నే .

ఎన్నో ఏళ్లుగా, సుమారు 30000 ఏళ్ల క్రితం నుండి జన బాహుళ్యం నోళ్ళలో ముఖ్యం గా గురు శిష్య పరంపర లో  నలుగుతున్న ప్రక్రుతి జ్ఞానాన్ని ,అంతరిక్ష విజ్ఞానాన్ని , సమాజ న్యాయ విధానాన్ని , జ్ఞాన సూత్రాలను,
క్రోడీక రించి ఒక క్రమ పద్దతిలో వాటిని కూర్చిన వాడు మహనీయుడు వ్యాసుడు .

సుమారు 2000 ప్రాధమిక గ్రంధాలు , వీటిని వివరించ డానికి 10000 భాష్య గ్రంధాలు , మళ్ళీ వీటిని కూడా బా గా
అర్ధం చేసుకోవా డానికి , రకరకాల వ్యాఖ్యాతలు  వారి వారి వాఖ్యానాల తో  -- ఇలా సుమారు 1 లక్ష గ్రంధాలు మన భరత ఖండం లో ఉండేవి .

స్థూలం గా చెప్పు కోవా లంటే ఋగ్వేదం జ్ఞాన కాండ ,యజుర్వేదం అంతా  కర్మ కాండ ,
సామ వేదం సంగీత కాండ ,అధర్వ వేదం అంతా  మానవ శరీర ఆరోగ్య సంక్షేమ మరియు 
యుద్ద విద్య , సాంకేతిక శాస్త్ర కాండ . 
వేదాలు, గ్రాంధిక సంస్కృతం భాష లో వచనం లో(prosedy),పద్యాల రూపం లో నూ(poetry) ఉంటాయి .

భౌతిక ,ఆధ్యాత్మిక జ్ఞాన సూక్తులను  -ముఖ్యం గా మానవాళి మొత్తానికి రక్షణ ,పోషణ , ఐకమత్యత ,కలగాలని కోరుకొంటూ చేసిన సూక్తులు ,దేవతలను ప్రసన్నం చేసు కొనే ప్రార్ధనలు(సంహితలు) , క్రతువులు(బ్రాహ్మణములు) ;మనిషి భౌతికం గానే కాక ఆధ్యాత్మికం గా కూడా ఎదగ డానికి అవసర మైన సూచనలు -ఉపాసనా విధానాలు(ఆరణ్యకములు) , అలాగే ఆత్మ విద్య (ఉపనిషత్ లు )- శ్రుతులు గా , అపౌరు షేయం  గా ఉన్న జ్ఞానాన్ని అక్షరీక రించి  గ్రంధస్తం చేశారు .

వేద వృ క్షానికి 1180 శాఖలు ఉండేవి . కాల గమనం లో కేవలం 7 మాత్ర మే మిగిలాయి .
లిపి ,భాష పూర్తిగా అభివృద్ధి చెందని  కాలం లో వేద జ్ఞానాన్ని కాపాడు కోవడానికి, వేద జ్ఞానం అజరామరం గా ఉండే విధం గా  ఆ నాటి మేధావులు ,మహర్షులు  ఒక అద్భుత మైన ప్రక్రియ చేపట్టారు .
అదే పటనం (కంట తా పట్టడం )  మరియు పాటనం (భో ధించ డం) .

సుమారు  1180 శాఖలు అనగా పీటాలు (schools or గురుకులం )ఏర్పాటు చేసి ఆయా పీటాలకు  కొందరు గురు వులను వారసత్వ పరంపరగా నియమించి ,  ముందు తరాల వారికి వేద జ్ఞానం అందించే  బాధ్యతలను అప్పగించారు .
అలా ఋగ్వేదానికి 21 పీటాలు ,యజుర్వేదానికి 109 పీటాలు ,సామవేదానికి 1000 పీటాలు ,అధర్వ వేదానికి 50 పీ టాలు ఏర్పాటు చేసినా యుద్దాల వలన ,ఈతి బాధల వలన ,క్షామం, ప్రక్రుతి వైపరీత్యాల వలన ఎంతో  మంది గురువులు, పీటాలు నాశనం అయిపోయి కేవలం 7 పీటాలు మిగిలాయి .
ఉపనిషత్(108) లు ,బ్రహ్మ సూత్రాలు ,భగవద్గీత అనే ప్రస్తాన త్రయాలు మిగిలి మనకు అందుబాటు లో ఉండటం మన అదృష్టం . శ్రీమద్ భాగవతం చతుర్ధ ప్రస్తాన ము గా, ముఖ్యం గా అనన్య భక్తి  ని  మధుర కలియుగ భవతారిణి గా వినుతి కెక్కింది .

ఈ అంతరిక్ష యుగం లో , విజ్ఞానం అణు బాంబుల వరకు ఎదిగిన కాలం లో
నేటి మాన వాళికి పురాతన సనాతన జ్ఞానం అవసర మా ? 

- మనిషిని అదుపులో పెట్ట డానికి చట్టాలున్నాయ్ . సంపాదన కి డి గ్రీలున్నాయ్ .
కాల క్షేపానికి రక రకాల వినోదా లున్నాయ్ .
అందానికి , ఆరోగ్యానికి ఎన్నో మందు లున్నాయ్ .
సుఖ లాలసలు తీర్చు కోవడానికి ఎన్నో మార్గా లున్నాయ్ .
మతాలకోసం .సంప ద  కోసం , ఆయిలు - ఆయుధాల వ్యాపారం కోసం దురద తీర్చే యుద్దా లున్నాయ్ .
కరువులు,కాటకాలు,సునామీలు ,టైఫూన్ లు ,అత్యాచారాలు , అనాచారాలు ,
అంతర్యుద్ధాలు , సంకుచిత్వాలు , ఉగ్రవాదాలు , మారణ కాండలు - ఇన్ని ఉన్న మనకు
సనాతన జ్ఞానం అవసర మేనా ?!?

Comments

Post a Comment

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి