ఇదే మనిషి కధ
కోటానుకోట్ల జనం లో 99. 9% మామూలు నేలబారు మనుషులే . కనీస అవసరాల కోసం నిత్య పోరాటం, అరిషడ్ వ ర్గాలతో నిత్య పితలాటకం వారికిఉండనే ఉంటుంది .
వీరిని క్రమ శిక్షణ లో పెట్టవలసిన బాధ్యత అందరిదీ .
ముఖ్యం గా గురువులు,పాలకులది .
మానవ జాతి పరిణామం అలా జరిగిందే .
వేట ,నిప్పు ని రగిలించి ఉపయోగించడం ,జీవాల పెంపకం , వ్యవసాయం , రక్షణ కోసం కొండ గుహలలో నివాసం ,తర్వాత మట్టి ఇళ్ళు , ఆ తర్వాత గట్టి ఇళ్ళు ,రాతి ఆయుధాలు ,కంచు,ఇనప పనిముట్లు ,చక్రం, విల్లంబులు .. ఆ తర్వాత ఎప్పటికో తుపాకి,విద్యుత్ , .... అణుబాంబులు ....
వివిధ మానసిక బౌద్ధిక స్థాయిలలో ని ప్రజలందరూ తమలో తాము గొడవలు లేకుండా ,అదే సమయం లో ప్రకృతిని నాశనం చేయ కుండా, చేత నైతే ఎదుటి వాడికి, ప్రకృతికి తోడ్పాటు అందించగల ఏర్పాటు చేయాలని సామాజిక శాస్త్ర వేత్తలు ,సంఘ సంస్కర్తలు భావించారు .
తత్వ వేత్తలు సమాజం లో భౌతిక భావనల కన్నా ఆద్యాత్మిక భావనలు వెల్లి విరియాలని తలపోశారు .
మనిషి ఎక్కువ కష్ట పడకుండా సుఖాలు పొందాలని ,ఆరోగ్యం మెరుగ్గా ఉండాలని ,మనిషి ఉత్పాదకత పెంచి దేశం సుభిక్షం గా ఉండాలని ,కరువు కాటకాల నుండి ,ఈతి బాధల నుండి ,ప్రక్రుతి వైపరీత్యాల నుండి దేశం రక్షణ కోసం శాస్త్రజ్ఞులు నిరంతరం తపన పడ్డారు .
జంతు వాసనలు (animal instincts) పుష్కలం గా ఉన్న మనుషులు ఒక క్రమ శిక్షణ తో ఉండటానికి నీతినియమాలు ,కొన్ని చట్రాలు (rules) ఏర్పాటు చేయాలని పాలకులు భావించారు .
చావులు ఎక్కువ జననాలు తక్కువ ,అంటువ్యాధులు , యుద్దాల వల్ల ఉళ్ళకు ఊల్లు తుడిచి పెట్టుకు పోయే కాలం లో బహు భార్యత్వం ,బహు భర్త్రుత్వమ్ సామాన్యం అయింది .
మేధావులు , ఆధ్యాత్మిక వేత్తలు , గురువులు కూర్చొని , ఈ భావాలన్నింటి నీ క్రోడీకరించి మానవ సమూహాలకు కొన్ని పద్దతులను నేర్పారు . అవే అలవాట్లుగా , ఆచారాలుగా మారి సంప్రదాయ మైంది .
మనిషిలో పాపము ,పుణ్యము అనే భావనలు ప్రవేశ పెట్టారు . పాప భీతికి,అనేక రకాల భయాలకు విరుగుడు గా మంత్ర తంత్రాలు ,పూజలు అలవాటు చేశారు .
తనకు దక్కింది పదిమందికీ అలాగే ప్రకృతికి పంచి ఇచ్చే అలవాటు చేసు కొన్నాడు .
మరి కొంత మంది , స్వార్ధ లోభాలతో సంపద పోగేసు కొంటారు .
కొందరు మద మాత్సర్యాలతో కక్షా కార్పణ్యాలతో ఎదుటి వాళ్ళను చంపుతున్నారు .
భూమి పై ఉన్న మేరిడియన్స్(శక్తి రేఖలు) ,అలాగే మనిషి కి ఉన్న నాడీ చక్రాలు , కొన్ని సమయాలలో ఆకాశంలోని గ్రహ నక్షత్రాల అమరిక , అలాగే నదులు,పర్వతాలు,సముద్రాలలో కొన్ని వేళలలో కలిగే శక్తి సంచయాలు --- వీటన్నింటినీ బేరీజు వేసు కొని ఆయా శక్తి ఉత్సర్గం మనిషి లో స్పందనలను ముఖ్యం గా చిత్తం లోని సంచిత కర్మలను నిస్పందనం(భస్మం ) చేసి, చిత్త శుద్దికి దారితీసి ఆధ్యాత్మిక ఉన్నతి కలుగ చేస్తుందని గాడం గా నమ్మారు .
దేవాలయ నిర్మాణ ఆగమ శాస్త్రం ,తీర్దాల ఏర్పాటు ,స్వయంభూ క్షేత్రాలు ,శుభ నక్షత్ర ఉదయించి నప్పుడు ఉపవాస దీక్షలు , నామ సంకీర్తనలు , పూజలు,అభిషేకాలు , జాగరణలు అన్నీ ఇలా ఏర్పాటు ఐనవే .
అలాగే బాహ్య జగత్తు లో ఉన్న గ్రహ నక్షత్రాల గమ నాన్ని ,భూమి సూర్యుని చుట్టూ కొద్ది వంపుతో చేసే ప్రదక్షిణ వల్ల కలిగే ఋతువులను , వాతావరణ లో కలిగే మార్పులను , సూర్యుని వేడి ,చంద్రుని చల్ల దనం ,ఓషధుల అందుబాటు , పంట దిగుబళ్ళు , అంటువ్యాధుల వ్యాప్తి , కాలమానం ఏర్పాటు , ఎప్పుడు ఎలాంటి పంట వేయాలి ? అనే విజ్ఞానం ,వర్షాలు ఎలా ఎప్పుడు ఎక్కడ పడే అవకాసం ఉంది ? ఏయే పనులకు ఏ కాలం మంచిది ? మనిషి పుట్టుకకు ఆయా సమయాలలో ఉండే నక్షత్ర , గ్రహ ఏర్పాటుకి ఏదైనా సంబంధం ఉందా ? -ఇలాంటి ప్రశ్నలకు పంచాంగం ,జ్యోతిష్యం తయారు చేశారు .
లిపి లేని కాలం లో భావ వ్యక్తీకరణకు కేవలం నోటి మాటే ఆధారం . ఆ తర్వాత కొన్ని చిహ్నాలు వ్యాప్తిలోకి తెచ్చారు . ఆ తర్వాత లిపి అభివృద్ధి చెంది విజ్ఞానం బాగా వ్యాప్తి చెందింది .
వేదాలు , వాటిని అర్ధం చేసుకోవడానికి వేదాంగాలు ,వేద సారాన్ని జన బాహుళ్యం లోకి తీసుకు వెళ్ళడానికి ముఖ్యం గా , తార్కిక జ్ఞానం తక్కువ ఉన్నవారికి ఇతిహాస ,పురాణ,ఆగమాలు ;
తార్కిక జ్ఞానం ఎక్కువ ఉన్న పండితులకు దర్శనాలు , మళ్ళీ వాటికి భాష్యాలు ;
తరాలు,యుగాలు ,మన్వంతరాలు,మారుతున్నాయ్ . ఐనా మనిషి మార లేదు .
99.99% మంది ఇలా జనన మరణ చక్రం లో భ్రమిస్తూ ఉంటే , కొంత మంది మాత్రం - "నేను ఎవరిని ? మనిషి జన్మకి గమ్యం ఏమిటి ?" అని అన్వేషిస్తున్నారు .
అందులో కొంత మంది కుతూహలం తో ,మరికొంత మంది పట్టుదల గా నిజమైన అన్వేషణ చేస్తూ
సాధన తో సాధకులు గా,
యోగ మార్గం లో యోగులుగా పయ నిస్తూ ఆత్మ సాక్షాత్కారం పొంది
ద్వైత స్థితికి లేదా అద్వైత స్థితికి చేరి సిద్ది పొందుతున్నారు .

- చేసే వ్రుత్తి ప్రవ్రుత్తి రీత్యా వర్ణాశ్రమ పద్దతుల ఏర్పాటు ,
- జీవితాన్ని 4 దశలుగా( -బాల్య, బ్రహ్మచర్య, గృహస్తు, వాన ప్రస్తా) - విభజించి బాధ్యతలు ఏర్పరచడం ,
- మనిషికి ధర్మార్ధ కామ మోక్షాలనే అత్యవసర నియమాలు బోధించడం,
- చిత్త శాంతికోసం , భావ శుద్ది కోసం, సమాజ సమతుల్యత కోసం - విగ్రహారాధన ,పంచోప చార పూజలు ,ఆలయ నిర్మాణం ,ప్రార్ధనలు ,హోమాలు ,తపస్సు,దానం అలవాటు చేశారు .
- అహంకార నిర్మూలనకు సంపూర్ణ శరణాగతి సౌలభ్యం గా ఉంటుందని భక్తి మార్గం అలవాటు చేశారు .
- కృతజ్ఞత , త్యాగం అనేవి ప్రధాన బాధ్యతలుగా మనిషికి నేర్పారు. అందుకే పండుగలు ,అలంకరణలు ,జాతరలు , ముగ్గులు , తోరణాలు , సంతలు , వినోదాలు -ఇవన్నీ ఇందులో భాగమే. వీటన్నింటిలో ఆరోగ్యమ్ ,మానసిక ఉల్లాసం ,పరిసరాల శుభ్రత , విజ్ఞానం ముందు తరాలకు అందించా లనే తపన , చిత్త శుద్ది , ఆధ్యాత్మిక పురోగతి ఉండేవి .
తనకు దక్కింది పదిమందికీ అలాగే ప్రకృతికి పంచి ఇచ్చే అలవాటు చేసు కొన్నాడు .
మరి కొంత మంది , స్వార్ధ లోభాలతో సంపద పోగేసు కొంటారు .
కొందరు మద మాత్సర్యాలతో కక్షా కార్పణ్యాలతో ఎదుటి వాళ్ళను చంపుతున్నారు .
భూమి పై ఉన్న మేరిడియన్స్(శక్తి రేఖలు) ,అలాగే మనిషి కి ఉన్న నాడీ చక్రాలు , కొన్ని సమయాలలో ఆకాశంలోని గ్రహ నక్షత్రాల అమరిక , అలాగే నదులు,పర్వతాలు,సముద్రాలలో కొన్ని వేళలలో కలిగే శక్తి సంచయాలు --- వీటన్నింటినీ బేరీజు వేసు కొని ఆయా శక్తి ఉత్సర్గం మనిషి లో స్పందనలను ముఖ్యం గా చిత్తం లోని సంచిత కర్మలను నిస్పందనం(భస్మం ) చేసి, చిత్త శుద్దికి దారితీసి ఆధ్యాత్మిక ఉన్నతి కలుగ చేస్తుందని గాడం గా నమ్మారు .
దేవాలయ నిర్మాణ ఆగమ శాస్త్రం ,తీర్దాల ఏర్పాటు ,స్వయంభూ క్షేత్రాలు ,శుభ నక్షత్ర ఉదయించి నప్పుడు ఉపవాస దీక్షలు , నామ సంకీర్తనలు , పూజలు,అభిషేకాలు , జాగరణలు అన్నీ ఇలా ఏర్పాటు ఐనవే .
అలాగే బాహ్య జగత్తు లో ఉన్న గ్రహ నక్షత్రాల గమ నాన్ని ,భూమి సూర్యుని చుట్టూ కొద్ది వంపుతో చేసే ప్రదక్షిణ వల్ల కలిగే ఋతువులను , వాతావరణ లో కలిగే మార్పులను , సూర్యుని వేడి ,చంద్రుని చల్ల దనం ,ఓషధుల అందుబాటు , పంట దిగుబళ్ళు , అంటువ్యాధుల వ్యాప్తి , కాలమానం ఏర్పాటు , ఎప్పుడు ఎలాంటి పంట వేయాలి ? అనే విజ్ఞానం ,వర్షాలు ఎలా ఎప్పుడు ఎక్కడ పడే అవకాసం ఉంది ? ఏయే పనులకు ఏ కాలం మంచిది ? మనిషి పుట్టుకకు ఆయా సమయాలలో ఉండే నక్షత్ర , గ్రహ ఏర్పాటుకి ఏదైనా సంబంధం ఉందా ? -ఇలాంటి ప్రశ్నలకు పంచాంగం ,జ్యోతిష్యం తయారు చేశారు .
లిపి లేని కాలం లో భావ వ్యక్తీకరణకు కేవలం నోటి మాటే ఆధారం . ఆ తర్వాత కొన్ని చిహ్నాలు వ్యాప్తిలోకి తెచ్చారు . ఆ తర్వాత లిపి అభివృద్ధి చెంది విజ్ఞానం బాగా వ్యాప్తి చెందింది .
వేదాలు , వాటిని అర్ధం చేసుకోవడానికి వేదాంగాలు ,వేద సారాన్ని జన బాహుళ్యం లోకి తీసుకు వెళ్ళడానికి ముఖ్యం గా , తార్కిక జ్ఞానం తక్కువ ఉన్నవారికి ఇతిహాస ,పురాణ,ఆగమాలు ;
తార్కిక జ్ఞానం ఎక్కువ ఉన్న పండితులకు దర్శనాలు , మళ్ళీ వాటికి భాష్యాలు ;
తరాలు,యుగాలు ,మన్వంతరాలు,మారుతున్నాయ్ . ఐనా మనిషి మార లేదు .
99.99% మంది ఇలా జనన మరణ చక్రం లో భ్రమిస్తూ ఉంటే , కొంత మంది మాత్రం - "నేను ఎవరిని ? మనిషి జన్మకి గమ్యం ఏమిటి ?" అని అన్వేషిస్తున్నారు .
అందులో కొంత మంది కుతూహలం తో ,మరికొంత మంది పట్టుదల గా నిజమైన అన్వేషణ చేస్తూ
సాధన తో సాధకులు గా,
యోగ మార్గం లో యోగులుగా పయ నిస్తూ ఆత్మ సాక్షాత్కారం పొంది
ద్వైత స్థితికి లేదా అద్వైత స్థితికి చేరి సిద్ది పొందుతున్నారు .
plz write regularly sir thanks
ReplyDelete