కార్తీక దీపం

దీపం జ్ఞాన స్వరూపం .
భౌతిక పరం గా చూస్తే ,  ఇంధనాన్ని మండిస్తూ వెలిగే దీపం  కాంతి ని , ఆవిరిని విర చిమ్మే అగ్ని శిఖ .
పంచ భూతాలలో అగ్ని మాత్రమే  గురుత్వ ఆకర్షణ ను అధిగమించి ,ని ట్ట నిలువుగా ప్రజ్వలిస్తూ  ఉంటుంది .
ఎలాంటి మాలిన్యాన్ని ఐనా భస్మము  చేసి శుద్ధి చేయగల శక్తి దీపానిది .
బాహ్య దీపం మనలోని అంతర  జ్యోతికి ప్రతి బింబం. 
అంతర జ్యోతిని వెలిగించు కొనే సంకల్పం  ఆధ్యాత్మిక సాధనకు తొలి మెట్టు . సంకల్ప సాధనకు అత్యంత అనుకూల మైన సమయం కార్తీకం . అంతర జ్యోతి ప్రజ్వలన  పంచ కోశాలలో ని దుష్కర్మలు భస్మం అవ్వడానికి ఆరంభం .
దీనికి ప్రతీకగా బాహ్య జ్యోతుల జ్వలనం ఒక ఉత్సవం లాగ జరుపుకొంటాం .
సాధకుడి ని  భగవంతుడికి అనుసంధానం చేసే శక్తి దీపానిదే .
యాంత్రికం గా దీపం వెలిగించడం వలన  చీకటిని మాత్రమే పార ద్రోల గలం గానీ , ఆధ్యాత్మిక శుద్ధి జరగదు .
దీపం పరబ్రహ్మ స్వరూపమని , ఆ ఆత్మ దీపం అహంకార నిర్మూలన  చేసి అంతకరణ శుద్ధి చేస్తుందని, దీపం అజ్ఞానాన్ని పోగొడుతుం దనే  భావన చాలా ముఖ్యం .
ప్రజ్ఞ ,ప్రతిభ ,మేధ --- ఈ మూడు రకాల ఆత్మ జ్ఞానం మెట్టు మెట్టు గా సాధన చేసి సాధించు కోవడానికి సాధనా పధం లేదా దక్షిణా యనం మంచి సమయం . అనగా ,పంచ కోశాలను శుద్ధి చేసుకొని ఆ తర్వాత ఉత్తరాయణ కాలం లో కైవల్య పధం పట్టడం సాధకుల నియమం .
కార్తీకం లో ఎక్కువగా దీపాలు వెలిగించడం  ... అదీ నువ్వుల నూనె లేదా ఆవు నేతి తో వెలిగించిన దీపాలు అటు తిమిరం నుండి  ఇటు సూక్ష్మ జీవుల నుండి రక్షణ ను ఇవ్వడమే గాక , దీపం పరబ్రహ్మ స్వరూప మనే భావన మన మదిలో నిల దొక్కు కొని కైవల్య మార్గ శీర్ష మైన మార్గ శిర మాసం లోకి అడుగు వేయడం జరుగుతుంది .

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి