భారత జాతి పై దాడి -2 వ భాగం .


మనిషి తనవి కాని వాటిని ఇష్ట పడటమో ,ద్వేషించడ మో చేస్తాడు .
అలాగే అందరూ తనదారిలో నడవాలని , తన భావా లనే నమ్మాలని , తాను  ఏదైతే చేస్తాడో దానిని అందరూ మెచ్చు కోవాలని గాడం  గా కోరుకొంటాడు .
మతం ,సంప్రదాయం ,ఆచారాలు ,జీవన విధానం , వ్రుత్తి -ప్రవృత్తులు ,జ్ఞాన సముపార్జన -- - జన సమూహాలకు ఇవన్నీ ఒకే స్థాయిలో లేదా ఒకే తరహాలో  ఉండవు .
ఎప్పుడైతే భిన్న సమూహాలు ఎదురుపడతాయో  అప్పుడే ఘర్షణ ఆరంభ మవుతుంది .
శారీరక దండయాత్ర లు ,మానసిక దాడులు ,భావ దాడులు ,సాంస్కృతిక దాడులు , జ్ఞాన దాడులు -ఇలా ఎన్నో రకాలుగా మానవ సమూహాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకొంటూ నే ఉంటారు .
పరవస్తు చిన్నయ సూరి పంచతంత్ర కధల ద్వారా గుర్తు చేసిన సామ దాన భేద దండో పాయాలు మీ రు విన్నారు గదా .  వాటన్నింటి నీ మనుషులు ప్రయోగిస్తూ ఉంటారు .

ఒక మనిషిని తుద ముట్టించ దానికి ఒక కత్తి  లేదా కర్ర లేదా తుపాకీ సరి పోతుంది . అదే ఓ గ్రామాన్ని సమూలం గా నాశనం చేయడానికి ఓ పెద్ద గాంగ్ ,అదే ఒక ప్రాంతాన్ని ,ప్రజలను తుడిచి వేయడానికి  సైన్యం కావాలి .
కానీ ఒక జాతిని ,ఆ జాతిలో ఉన్న ప్రస్తుత ప్రజానీకాన్ని , అలాగే రాబోయే తరతరాల వారిని నిర్వీర్యం చేసి తద్వారా ఆ జాతిని రూపుమాపడానికి కావలసింది ఆయుధం ,సైన్యం ,మారి మహామ్మారులు కాదు .
ఆ జాతి విజ్ఞాన సంపదను , జ్ఞాన ధార ని ఎండ గడితే చాలు .
ఆ జాతి ఆచార సంప్రదాయాల పై ఏహ్యత ,హేళన కలిగే విధం గా ఆ జాతి పూజించే గ్రంథాలకు వక్రభాష్యాలు రచింప చేసి దుష్ప్రచారం చేస్తే చాలు . ఆ జాతి ఆచార అలవాట్లను ఓ పిచ్చి మూర్ఖపు చేష్టలుగా చిత్రీకరింప చేసి ఆ జాతి యువత మనస్సుల్లో విష బీజాలు నాట బడే విధం గా రచనలు ,చిత్రాలు ,గీతాలు చివరికి పూజనీయమైన గ్రంధాలలో నీచమైన అబద్దమైన శ్లోకాలను ప్రక్షేపింప చేస్తే చాలు . అంతే ! ఆ జాతి క్రమం గా రూపు మాసే అవకాశం ఉంది . లేదా ఆ జాతి లోని జనాలు క్రమం గా ఇంకో జాతిలో కలిసి పోవలసిన అగత్యం పడుతుంది . తమ చిరకాలపు సత్ సంప్ర దాయా లను వదిలేసి మరో సంప్ర దాయాన్ని ,ఇతరుల ఆచారాలను పాటించ వలసిన దుష్కర్మ పడుతుంది .
గ్రీకులు  ,హూణులు ,తదితర విదేశీ తండాలు సింధు నాగరికతా ప్రాంతపు వారైన భారత ప్రజలను ,సంప్రదాయాలను నాశనం చేయలేదు . వారు కేవలం రాజులను ఓడించి భౌతిక సంపదను మాత్రమే దోచుకెళ్ళారు . పై పెచ్చు సింధు సంప్రదాయాలను ,విజ్ఞాన సంపదను వారు పుణికి పుచ్చు కొని తామూ బాగు పడ్డారు .
ఆ తర్వాత  వచ్చిన ముస్లిం ,ఆఫ్ఘన్ తండాలు ,పర్షియా మూకలు సింధు ప్రజలను ,వారి ప్రార్ధనా లయాలను ,రాజ్యాలను ,రాణులను దుర్భర మారణ కాండకు గురిచేయ డ మే కాక , వారి మతా చారాలను ప్రతి ఒక్కరూ పాటించాలని నిర్బంధించారు . భారత దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా 50 ముక్కలు చేసారు .
తురుష్క ముష్కరులు ,ఆఫ్ఘన్ ,పర్షియన్ సైనికులు శారీరకం గా ,మానసికం గా హింసించారు .
మన జన్మ భూమిపై ఉన్న సకల గ్రంధాలను తగల బెట్టడ మో ,పట్టు కెళ్ళడ మో చేశారు .
వర్ణ సంకరం యదేచ్చగా జరిగింది .

ఇప్పటి వరకు కండ బలం ,దండ బలం తో సింధు ప్రజలను నాశనం చేసారు .
కానీ అసలు కధ ఆ తర్వాత జరిగింది . యూరో పియన్ లు , ముఖ్యం గా బ్రిటిష్ రాజ్యాధి పతులు ,క్రిస్టియన్ మత పెద్దలు ,యూదు సంఘాల వారు ఒక క్రమ పద్దతిలో భారత దేశానికి చెందిన ప్రతి గ్రంధాన్ని, ప్రతి ఆచారాన్ని , సంప్రదాయాన్ని ఓ మూర్ఖపు మూడ నమ్మకాల లెక్క గట్టి , విగ్రహారాధనను , బహు విధాల రూపాలలో ఉన్న దేవతా మూర్తులను కిమ్చ పరిచే విధం గా పుస్తకాలు వ్రాయించారు .
ఇతిహాసాలు ,పురాణాలు ,ఉపనిషత్ లు ,వేదాలు ...  వీటన్నిం టికీ వక్ర భాష్యాలు వ్రాయించారు .
వాటిల్లోనే తప్పుడు అర్ధాలతో కొత్త కొత్త శ్లోకాలను చొప్పింప చేశారు . వక్ర భాష్యాలు గ్రంధస్తం చేయించారు .
  తెల్లతోలు -నల్ల తోలు పేరు తో ఆర్య -ద్రావిడ బేధాన్ని వ్యాపింప చేశారు .
 భయం తో ,దురాశతో,ప్రాణం కోసం ,ధనం కోసం   ఇవన్నీ చేసింది మిడి మిడి సంస్కృత  పాండిత్యమున్న  భారత దేశ రచయితలే .బాపన పండితులను బెదిరించో ,ఆశ చూపో గ్రంధాలను వక్రీకరిమ్చారు .  
చేయించింది బ్రిటిష్ మరియు యూదు  మత పెద్దలే .
శివలింగానికి,పానవట్టానికి  వికృత మైన అర్ధాన్ని ;
బహు విధ రూపం లో ఉన్న దేవతా మూర్తుల కు పెడర్ధాలను ,
యజ్ఞ యాగాలలో జంతు బలులు , నరబలులు ఇచ్చేవారని వేదాలలో వ్రాసిఉందనే  దుష్ప్ర చారం ,
వేదాలంటే - ఆటవిక జిప్సీ తెగలు భయం తో భక్తితో చేసే స్త్రోత్రాలు , మూర్ఖపు దురాచారపు క్రియలనే విపరీత ప్రచారం ,
--------   ఇలా ప్రతి ఆచారాన్ని ,ప్రార్ధనా గ్రంధాలను ,జ్ఞాన తత్వ శాస్త్రాలను తప్పుడు ప్రక్షేపా లతో
కలుషితం చేశారు . ఇది మారణ కాండ కన్నా దారుణ మైన సాంస్కృతిక ఉగ్ర వాదం ! యుద్దాలతో ,దమన కాండ తో మనుషుల మాన ప్రాణాలు మాత్ర మే హరించి వేస్తారు . కానీ ఈ విధమైన జ్ఞాన చౌర్యం , జ్ఞాన వక్రీకరణ ద్వారా సింధు(హిందూ ) ప్రాంత ప్రజల ఆత్మ నే క్షోభ పెట్టారు వాళ్ళు !
ఆర్యులు ఓల్గా తీరం నుండి ్‌ఇమాలయాల ఉత్తర ప్రాంతం నుండి గంగా -సింధు -సరస్వతీ తీరాలకు వచ్చి ఇక్కడే స్థిర పడ్డారని ,అప్పటికే అక్కడ అభివృద్ధిలో సాగుతున్న ద్రావిడులను నాశనం చేసి ఉత్తర ప్రాంతం నుండి దక్షిణాదికి తరిమి వేశారని అబద్ధాలు ప్రచారం చేయించి భారతీయులలో ప్రాంతీయ పోరుకి ఆజ్యం పోశారు .
ఇదొక్కటే కాదు ,ప్రతి ఆచారాన్ని , అవకాశాన్ని ,భాషని , చర్మపు రంగుని వారికనుగుణం గా మార్చు కొని ఇలా ప్రజలను విడగొట్టి భారతీయులను బలహీనులను చేశారు .
 ఎన్నో కారణాల వలన సాంఘికం గా అట్టడుగున ఉన్న దళితుల ను రెచ్చగొట్టి మీ దౌర్భాగ్యానికి కేవలం బాపన సమాజమే కారణమని నూరిపోసి ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టి ,మన దేశంలో కుల వ్యవస్థ శాస్వతం గా ఉండే టట్లు కుట్ర కుతంత్రాలు చేశారు .
 సమాజం లో అగ్ర భాగాన ఉన్న వారికి ,అట్టడుగున ఉన్నవారికి ఎప్పుడూ  నిశబ్ద సమరం సాగుతూ నే ఉంటుంది .
కానీ బాపన సమాజం పై ఉన్న అక్కసుతో భారత దేశ జీవ నాది ఐన సంస్కృత గ్రంథాలను ,ఆచార సంప్రదాయాలను హేళన చేసి వాటిలో వ్రాసిన విషయాలు అనాగరిక తండాలు పాటించే మూడా చారాల లెక్క చిత్రీక రింప చేసి ,భారతీయ యువతలో సనాతన సంప్రదాయాలపై నిరపేక్ష ,త్రుణీ కరణ భావాలను   పెంచారు .
పండిత వర్గానికి , నిరక్షర ప్రజానీకానికి మధ్య అగాధాన్ని తవ్వారు . స్కూళ్ళలో విద్యా విధానాన్ని వారి గుప్పిట్లో పెట్టుకొని పిల్లలకు చిన్నతనం నుండి అబద్దాలు నూరి పోశారు . ఇప్పటికీ అదే సిలబస్ ,కరిక్యులం ని మన రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి .
బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు . స్వాతంత్రం వచ్చిన నాటి నుండి మన రాజకీయ పార్టీలు ,వారు నడిపే ప్రభుత్వాలు కుహనా మత సహనం , నకిలీ మత సామరస్యం అనే పదాల చాటున ఓటు బాంకు రాజకీయాలు నడపడం లో  పోటీ పడుతున్నాయి .
అత్యధిక శాతం ప్రజల మనోభావాలకు ఏమైనా ఫర్వాలేదు , కేవలం కొద్ది శాతం ఉన్న ఇతర వర్గాల వారి ఓట్లు గంప గుత్త గా కొట్టే య వచ్చనే దురాశ తో భిన్న రాజ్యాంగ నియమాలు ,భిన్న న్యాయ సూత్రాలు ,భిన్న కుటుంబ నియమాలు ఏర్పరచి  వర్గ వైషమ్యాలు మరీ మరీ పెచ్చ రిల్లే టట్లు  చేస్తున్నారు .
మనిషిని కులాల వారిగా ,మతాల వారీగా చీల్చి  చెండాడు తున్నారు .
మతం యొక్క శ్రేష్టత కులాల పైన లేదా ఆచారాల పైన ఆధారపడి అంచనా వేయరాదు .
ఆచారాలు   మన దైనందిన జీవితంలో శరీర ,మానసిక ,సామాజిక ప్రశాంతత కోసం పెద్దలు నిర్ణయం చేసిన అలవాట్లు .అటు  ఆరోగ్యము ,ఇటు సంతృప్తి కలిగే విధం గా ఏర్పాటు చేసిన ఆచారాలు భారతీయ జీవ నాడికి ప్రాణప్రదం .
ప్రభుత్వాలు ,కొడిగంటు తుతున్న సనాతన ధర్మానికి చేదోడు అవ్వడానికి సమాయత్తమైన సంస్థలు గానీ చెయ్యవలసిన పనులు కొన్ని ఉన్నాయి .
వేదాలు ,ఉపనిషత్ ,పురాణ ,ఇతిహాస గ్రంధాలను సంపూర్ణం గా శోధన చేసి ఏవి ప్రక్షేపాలు ? ఏవి నిజమైన సనాతన శ్లోకాలు  అనే నిజాన్ని నిగ్గుదీయాలి .
నిజమైన పరమత సహనం ,మత  సామరస్యం ,అన్ని మతాలవారికి ఒకే విధమైన రాజ్యాంగ నియమావళి , కులాలవారీగా ,మతాల వారీగా ఇస్తున్న చేయూత ని ఆర్ధిక బలహీనులందరికీ అందే ఏర్పాటు ,మనిషిని వర్గాలుగా చీ ల్చుతున్న  అన్ని నియమాలను రద్దు చేయడం  -ఇవన్నీ చేసిన నాడు మనిషి మనిషి గా మిగిలి ఉంటాడు .
స్వస్తి .

Comments