గీతా ప్రాశస్త్యం

సమస్త భూమండలం లో ఒ కే జాతి ,ఒకే మతము ,ఒకే భాష ఉన్న సనాతన కాలం లో యోగేశ్వర శ్రీ కృష్ణుడు మానవాళి కి ప్రసాదించిన జ్ఞాన ప్రసాదం శ్రీ మత్ భగవద్గీత .ఆ గ్రంధాన్ని నిత్య పారాయణ ,అనుస్మరణ ,అభ్యాసం , అనువర్తన  చేస్తూ ఉంటే ఎంత మార్పు కలుగుతుందో ఎవరికీ వారే అనుభవం లోకి తెచ్చు కోవాలి .

ఏ  గ్రంధం మనిషి ఎలా జీవించాలో మార్గ నిర్దేశం చేస్తుందో ,
ఏ  గ్రంధం మనిషి ఎలా నిర్భయం గా మరణాన్ని ఆహ్వానించాలో  తెలియ చేస్తుందో ,
ఏ  గ్రంధం అమాయకులను జ్ఞాన వంతు లుగా మార్చి వేస్తుందో ,
ఏ  గ్రంధం విద్యావంతులను వినయ శీలురు గా మార్చి వేస్తుందో ,
ఏ  గ్రంధం ధనవంతులను కారుణ్య మూర్తులుగా పరివర్తనం చేస్తుందో ,
ఏ  గ్రంధం పేదవారికి సౌఖ్యం ప్రసాదిస్తుందో ,
ఏ  గ్రంధం మనిషి తన కలలను నిజం చేసుకోవడానికి ఉపయోగించ వచ్చో ,
ఏ  గ్రంధం బలహీన మనస్కులను సంస్కరిస్తుం దో ,
ఏ  గ్రంధం గర్వపోతులకు హెచ్చరికగా పనిచేస్తుం దో ,
ఏ  గ్రంధం బాధాతప్త హృదయాలకు స్వాంతన కలిగిస్తుం దో ,
ఏ  గ్రంధం సామాన్యులను అసామాన్యులుగా తీర్చి దిద్దు తుందో ,
ఏ  గ్రంధం సందేహా స్పదులను నిశ్చల మనస్కులు గా మారుస్తుం దో ,
ఏ  గ్రంధం పాప దురాత్ములను పుణ్యవంతులుగా  పరివర్తనం చేస్తుందో - అలాంటి గ్రంథరాజం శ్రీ మత్ భగవద్గీత సాక్షాత్ భగవద్ స్వరూపమే !
ప్రతి మనిషి చదివి అన్వయించు కోవలసిన మహత్తర జీవన సూత్రాలవి . పిల్లలకి 5వ ఏట నుండే శ్లోకాలను కంటతా పట్టించాలి . 7వ ఏడు ముగియక మునుపే   సందర్భాను సారోచితమైన తాత్పర్యం చిన్న చిన్న కధల రూపములో
చెబుతూ నిత్య జేవితం లో వాటిని ఎలా అన్వయించు కోవాలో "రోల్ ప్లే " చేయించాలి .
మనిషి మెదడు ఎదుగు దల 7వ ఏటికి 90శాతమ్ పూర్తవుతుంది .
తల్లితండ్రులు ముఖ్యం గ నూతన దంపతులు ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకొని తమ పిల్లలను పార్ధుడి గా మారుస్తారని భరత మాత కోరు కొంటుంది .
అప్పుడే మన పిల్లలు మహర్షుల సంకల్పానికి నీరు పోసిన వారవుతారు .
సనాతన ధర్మానికి ఆయువు పట్టు గా మారుతారు .
స్వస్తి .



Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి