పిరికి మనిషి !


లోకంలో కులం ,మతం ,ప్రాంతం ,జాతి -ఇవన్నీ మనుషులు తమ బలం పెంచు   కోవడానికి వాడు  కునే
తురుపు ముక్కలు . వివిధ ప్రాంతాలలో ,భిన్న వర్ణాలతో ,భిన్న ఆకృతుల లో ఉన్న నరజాతి సమస్తం
నిరంతరం జీవిత సమరం లో  కొట్లాడుకుంటా నే ఉంటుంది . ఘర్షణ లేని బతుకు ఉండదు .
ఆ క్రమం లో జరిగే మారణ హోమాలు కన్నా విన్నా , మనిషి సర్వ మృగాల పెట్టు అని అనిపించక మానదు .
మానవుడు ద్విపాద జంతువు . క్రూర  మృగం కన్నా దారుణ మైన క్రియలు చేయడానికి తనకున్న బుద్ధిని , ఆలోచన శక్తిని ,ఉహా శక్తిని దుర్విని యోగం చేసు కొంటున్నాడు .
నే ల తల్లిని తూట్లు పొడవడ మే కాదు , నరజాతి యావత్తూ తుడిచి పెట్టుకొని పోయే తామసిక క్రియలతో భూమిని అతలా కుతలం చేస్తున్నాడు .
17  మరియు 18 వ శతాబ్దాలలో  మనదేశం లో వచ్చిన దారుణ మైన కరువు కి కారణం బ్రిటిష్ రాజ్యాన్ని తమ గుప్పిట్లో ఇరికించు కొన్న యూదు సంఘాలు మరియు వాటికి చెందినవ్యాపార సంస్థలు . ముఖ్యం గా ఈస్ట్ ఇండియా కంపెనీ యూదు సంస్థలకి చెందిన దే !
 ఆ కరువు కారణం గా కోట్ల మంది భారతీయులు ఆకలిదప్పులతో మలమలా శ లభాల లెక్క మాడిపోయారు .
అంతే కాదు మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్దాలలో భారతీయ సైనికులను పూర్తిగా ఫిరంగులకు అడ్డం
 పెట్టి ,వారిని బలిపశు వులు లెక్క  వాడుకొని , ఆ యుద్దాలు తామే గెలిచా మన్నట్లుగా చరిత్రలో తప్పుడు
 ప్రచారం చేసుకొన్నారు .
ఇంతే కాదు , యూరప్ అంతటిని ,అలాగే టర్కీ ,ఆర్మీనియా ,అజర్బైజాన్ దేశాలలోని ఆయిల్ నిక్షేపాలను తమ చిత్తం వచ్చిన రీతిలో తోడు కోవడానికి యూదు వ్యాపారులు ఆర్మీనియాలోని సుమారు ఒక మిలియన్ క్రైస్తవులను (genocide)ఊచ కోత కోశారు . పైగా ఆ మారణకాండ కి కారణం ముస్లింలే అని చరిత్రని వక్రీకరించి ప్రచారం చేశారు .
ఇదంతా వ్యాపారం కోసం చేశారు .
 స్వార్ధం ,దురాశ ,ధన దాహం ,అధికార లాలస ,కీర్తి పిపాస మనిషిని రాక్షసు ణి చేస్తున్నాయి .
భారతీయులని ఎంత మందిని చంపారో ,
ఎంతమంది భారతీయులను ఆకలితో మాడ్చారో ,
ఎన్నెన్ని గుళ్ళ ను లూటీ చేసి ఎన్ని టన్నుల బంగారాన్ని దోచు కెళ్ళారో ,
ఎన్ని గుళ్ళను ధ్వంసం చేసి తమ తమ మతాల ప్రార్ధనాలయాలుగా మార్చివేసారో ,
భారతీయుల సంస్కృతిని ఎంతగా కలుషితం చేశారో ,
భారతీయ యువత ఆలోచనలను ఎంతగా పెడదారి పట్టిమ్చారో ,
భారతీయ గ్రంధాలను వాటిలోని అర్ధాన్ని వక్రీక రిమ్చడానికి ,తద్వారా భారతీయ గ్రంధాలు వట్టి బూజుపట్టిన వెర్రి మొర్రి కాకమ్మ కదలే అని -ఎంతగా ప్రక్షేపాలతో నింపారో ,
భారతీయ ఆచారాలను ఆటవిక ఆచారాలుగా చిత్రీకరించి భారతీయ యువత మదిలో నిర్వేదం, బానిస మనస్తత్వం , కుంగుబాటు ,లజ్జ ఎంతగా పెచ్చరిల్ల చేశారో ,
భారతీయ చరిత్రని  తప్పుడు కధనాలతో ఎంతగా వక్రీక రింప చేశారో,
------ తలచు కొంటే బాధ ,కోపం ,జాలి ,వైరాగ్యం -ఇవన్నీ కలగా పులగమై మనస్సుని పిండి వేయక మానదు .

బతుకు -బతికించు ,
సుఖం గా ఉండు -శాంతి ని పెంచు ,
పక్క వాడి మెప్పుకోసం కాదు -పొరుగు వాడి సుఖ శాంతుల కోసం జీవించమని వేదం ఘోషిస్తుంది .
మనిషి  ఈ భూమి పైకి వచ్చిందే ,పంచుకోవడానికి !
ఇవ్వడం లో ఉన్న మధురిమ ని  ఆస్వాదించడాని కే  మనిషి కుటుంబం ,సంఘం, ప్రాంతం, దేశం ,ప్రపంచం
తన చుట్టూ నిర్మించు కున్నాడు .
తను వచ్చిన మరచి పోయి  ఆ మధురిమ ని ఎప్పుడైతే కోల్పోయాడో మనిషి దారితప్పి నట్లే !
మనిషి ఓ మిషన్( కర్మ కార్యం ) తో ఈ భూమిపై పుడుతున్నాడు .
 దానిని మరచి తీసుకోవడం ,పోగేసుకోవడం ,దాచుకోవడం ఎప్పుడైతే మొదలెట్టాడో ,అప్పుడే మనిషి ఒంటరి అయ్యాడు . అతని పతనానికి నాంది అదే !-ఇదే  భారతీయ సనాతన ధర్మ సూత్రం . ఇదీ మహర్షులు మనకిచ్చిన జ్ఞాన ధార .  మనిషి పంచ కోశాలను శుద్ధి చేసే  గంగా ప్రవాహం , ఆత్మని ఆవిష్కరించే సనాతన రుషి వాక్యం మనకు సదా పూజనీయం !
స్వర్గానికి రహదారి దయా దాక్షిణ్యం  ప్రేమ !
నరకానికి దగ్గరదారి అసూయ ,కార్పణ్యం ,స్వార్ధం !
ఈ లోకంలో 90 శాతం మంది నరకానికి దారులు ఏర్పరచు కొంటున్నారు . మరికొంతమంది ఆ దారుల్లో పడి కొట్టుకు పోతున్నారు . మరికొంత శాతం అలా చోద్యం చూస్తున్నారు .
మనందరం గుర్తుంచు కోవలసింది  ఒకే ఒక్కటి . "ఎవరికీ వారు తమకు తామే సాయం చేసుకోవాలి"-ఎవ్వరో వస్తారని వేచి చూడక్కర లేదు . మనిషి తన ఒంటరి తనాన్ని తనే అధిగ మించాలి .  స్వర్గానికి దారి ఏర్పరచు కోవాలి . ఆ దారిలో పదిమందిని నడపాలి .
సమాజం పట్ల బాధ్యత గా ఉండట మే మనిషి కర్తవ్యం . అదే ఆనందం !
స్వార్ధం ,కార్పణ్యాలతో  కరడు గట్టిన మనస్సు తో మూసుకు పోయిన మనిషి హృదయమే నరకం !
మనిషి ఈ భూమి ని స్వర్గం గా మార్చగలడు .
మనిషి భూమిపై నరకకూపాలను సృష్టించ గలడు .
ప్రక్రుతి నుండి విడివడిన  మనిషికి ఏదైనా సాధ్యమే !
చరిత్ర చూస్తే  మిరియాలు ,వక్కలు లాంటి సుగంధ ద్రవ్యాల కోసం ,బంగారం , వజ్రాల కోసం భారత దేశాన్ని చీల్చి చెండాడిన యూదు వ్యాపార సంస్థలు,  చమురు నిక్షేపాలకోసం  తూర్పు యూరప్ ప్రాంతాలను ,మధ్య ఆసియా ప్రాంతాలను ,ఆయా ప్రజలను మారణ హోమాలకు గురిచేశాయి .
జాతుల మధ్య యుద్ధం ఎంత అమానుష కాండకి  దారి తీస్తుందో  తెలుసు కోవా లంటే మధ్య యుగాల ప్రపంచ చరిత్ర ముఖ్యం గా యూరప్ చరిత్ర ని పరిశీలిస్తే వళ్ళు  గగుర్పొడుస్తుం ది .
జుడాయిజం , క్రిస్తియానిటీ ని ఎన్ని ముక్కలు చేసిందో ,దానికోసం ఎన్ని కుట్ర కుతంత్రాలు నడిపిం దో ,ఎన్నెన్ని రాజ్యాలను కూ ల దోసిం దో  తెలుసు కొంటే మనిషి లోని చీకటి కోణాలు ఎంతగా కార్పణ్యం తో నిండి ఉంటాయో  అని విభ్రాంతి కలుగు తుంది .

ఈ లొకంలొ భయం వలనే మనిషి ఎన్నొ ధుష్కర్మలు చెస్తున్నాడు .
అత్యధిక శాతం మంది భయం తో బతుకుతున్నారు.
రేపంటే భయం . పొరుగు వాడిని చూస్తే భయం. పనిచేయాలన్నా,మనుషులతొ మెసలాలన్నా భయం.
ఎవరు ఏమనుకొంటారో అనే భయం.
అప్రియమైన సంఘటనలు పునరావ్రుత్తం అవుతాయనే భయం.
దుఖ కారణమైన సంఘటనలంటె భయం.
అనుమానం, భయం ఇవే మనిషిని పిప్పి చేస్తున్నాయి.
భయతొనే మనిషి మారణ కాండకి తెర  తీస్తున్నాడు.
భయాన్ని అధిగ మించాలని వేదం చెబుతుంది.
అలాగే సర్వ అనర్ధాలకు కారణమైన అరిషడ్వర్గాలను అధిగ మించాలని రుషి వాక్యం.
అత్యధిక శాతం మనుషుల్లో, భయం హింసని ప్రేరేపిస్తుంది.
కేవలం సనాతన భారతీయ మార్గాన్ని పాటించే వారిలొ మాత్రం,భయం నిర్మాణాత్మక ఆలోచనా క్రియలను ఉత్తేజ పరుస్తుంది.భయాన్ని చూసి వెరవక ఎదుర్కోవడ మే దానిని అధిగ మించడం.
భయం, అనుమానం ,అసూయ మనిషి కున్న బలహీనతలు . వాటిని అధిగ మించ డమే  మనిషి కర్తవ్యం .
నిస్వార్ధం , నిర్భయం గా ఉన్న వారికే అహింస ,సత్య  వచన పాలన సాధ్య మవుతుంది .
భయ పడుతున్న వారి భయాలను పారద్రోల డమే -అభయం !
హింసలో కునారిల్లుతున్న వారిని రక్షించ డమే -అహింస !
అబద్దపు భావనలతో ఆత్మ వంచన ,పర వంచన చేస్తున్న వారిని సంస్కరించ డ మే - సత్య పాలన !

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి