సర్వం పరబ్రహ్మం

భగవంతుని (ఆత్మ ) విభూతి :

బుద్ధిర్‌జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః |
సుఖం దుఃఖం భవో௨భావో భయం చాభయమేవ చ || 4

అహింసా సమతా తుష్టిః తపో దానం యశో௨యశః |
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః || 5


వివిధ ప్రాణులలో వాటి వాటి చైతన్య స్థాయిని బట్టి ,వాటి వాటి సంచిత కర్మలను అనుసరించి వివిధ వికారాలు - బుద్ధి, జ్ఞానం, మోహం లేకపోవడం, సహనం, సత్యం, బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం, సుఖం, దుఃఖం, జననం, మరణం, భయం, నిర్భయం, అహింస, సమదృష్టి, సంతుష్టి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి వంటి వివిధ భావాలు - వాటి వాటి అంతరంగం లో కలుగుతున్నాయి . 
ప్రాణులు - అధిభూతములు అంటే ఏవి ? 
సమస్త స్థావర జంగములు ,అనగా చెట్లు,కీటకములు ,జంతువులు  మొదలైన అన్నిరకముల ప్రాణులు . వీటిలో  కలిగే సమస్త  వికారముల కు(భావములకు ) కారణం దైవ చైతన్యం( మత్తః - ఏవ  ) .
 ఆయా వికారములు వి విధ ప్రాణులలో వివిధ రకాలుగా( పృథగ్విధాః )ఉంటాయి . ఇంత  వైవిధ్య మైన వైరుధ్యాలకు కారణం వాటి వాటి సంచిత కర్మలే . 
ఈ కర్మ చక్రాన్ని దానివె నక ఉన్న సూత్రాన్ని  నియమితం చేసేది దైవ చైతన్య శక్తి . 
సత్వ రజొ తామస గుణాల నిష్పత్తి అన్ని ప్రాణులలో ఒకే రకం గా ఉండదు . ఆయా గుణముల నిష్పత్తి పై ఆధార పడే ప్రాణులలో భావములు -రాగ ద్వేషములు  పొటమరిస్తాయి . 
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు . సకల చరాచర సృష్టి అవతరణ -పోషణ -లయీకరణ కు మూల కారణ భూత మైన దైవ చైతన్య మే ప్రాణుల చైతన్యాని కీ కారణ మవ్వడం లో సందేహం ఏముంది ? 
బుద్ధి కర్మాను   సారిణి .
భావం   కర్మాను   సారిణి .
కర్మ చక్ర సూత్ర నిర్దేశ కుడు భగవంతుడు . 
సకల సృష్టి ఈ కర్మ సూత్ర మునకు బద్ధ మై ఉండాలి . భగవద్ చైతన్యం మాత్రం ఈ సూత్రాలకు అతీతం . ఎందుకంటే అవ్యక్త స్థితికి కట్టుబాట్లు ,ఫార్ములాలు ఉండవు . 

నిశ్చల భక్తి ప్రపత్తులు తద్వారా శరణాగతి భక్తులలో కలగాలీ అంటే ,దైవం పై ,దైవ శక్తి పై అంతటి విశ్వాసం 
ఉండాలి . 
నమ్మకం ,విశ్వాసం ,శరణాగతి ,శ్రద్ద ,ఓర్పు  ఇవన్నీ మెట్టు మెట్టు గా సాధించు కొనే లక్షణాలు . ఆ తర్వాత ఆ దైవాన్ని పొందాలని ,ఆత్మానుభూతి పొంది ఆత్మ స్థితిలో నే ఉండాలనే ప్రగాడ మైన సంకల్పం కలగాలి . వివేక విచక్షణలు ,వైరాగ్యం మనస్సుకి ,ఇంద్రియాలకు ,చిత్తానికి అలవాటు చేయాలి . బుద్ధి ని సూక్ష్మ తరం చేయడానికి  ఏకాగ్రత ఆ తర్వాత  ధారణ ,ఆ తర్వాత ధ్యాన సాధన అభ్యాసం చేస్తూ ఉండాలి . వీటన్నింటికీ చోదక  శక్తి  ఎక్కడి నుండి రావాలి ? మన ఆత్మ నుండే గదా ! ఆత్మ శక్తి ప్రసారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసు కోవడ మే సాధనలో అత్యంత కీలకం . దివ్యాత్మ లే దీనికి సాయపడాలి . అలాంటి దివ్యాత్మ సంజాతులే సద్గురువులు .
 భక్తులనండి ,యోగులనండి , ఎవరైనా అభ్యాసం ,శరణాగతి ద్వారా  సద్గురు పర్య వేక్షణ లో నిరంతర సాధన చేస్తూ ఉంటే "ఆత్మ యోగం" లభ్యం కాక మానదు . 


Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి