చందమామ రావే.. కధలు చెప్పి పోవే !

 

చందమామ కథలు పలు భారతీయ భాషల్లో ప్రచురితమైన ‘చందమామ’ పాత తరంలో ఇంటింటా ప్రతిహృదయంతోనూ పెనవేసుకుపోయింది. ఇది కొత్త తరాలకూ వారసత్వంగా పాకింది. రాజుల సాహసకథలు, ఏడేడు సముద్రాలు, రెక్కల గుర్రాలు, మంత్ర తంత్రాలు, మర్రిచెట్టు తొర్రలు, బేతాళ కథలు, దేవుళ్ళు, దెయ్యాలు, అపూర్వ శక్తులు...అబ్బో! ఎన్నెన్ని కథలో. ఎన్ని శక్తులున్నా మానవశక్తే గొప్పదని నిరూపిస్తాయి ఇవన్నీ. 

అప్పట్లో ఎంతోమంది పిల్లలు కూడా ఎంతో స్ఫూర్తితో ఈ కథల్ని ఉత్సాహంగా రాసేవారు.....


ఎవరో మహానుభావుడు 1947 జనవరి నుండి 2012 డిసెంబర్ వరకూ విడుదల అయిన అన్ని చందమామ పుస్తకాలను PDF రూపంలో తన వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు. వీటిని ఎవ్వరమైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వీటిని మనం పిల్లలచే చదివించవచ్చు, లేదా మనమే చదివి వినిపించవచ్చు. దీనివలన పిల్లలకు తెలుగు చదవడం వస్తుంది, అలానే భాషపై పట్టు కూడా పెరుగుతుంది. 

మనం చంపేసిన ఎన్నో తెలుగు పదాలు ఈ కథలలో ఉంటాయి. కథల రూపంలో నేర్పడం కనుక, ఇది కొంత తెలికగానే ఉంటుంది.

*అవకాశం ఉన్నవారు, మీ పిల్లలు చదువుకునే బడిలో తెలుగు బోధించే వారికి కూడా వీటిని పంపండి.*

ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి. ఎంచక్కా కథల లోకంలోకి *లింక్:-* granthanidhi.blogspot.com/2020/04/candam


Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి