శ్రీ కృష్ణ జన్మా ష్టమి

                                                            శ్రీ కృష్ణ జన్మా ష్టమి 

In remembrance to great guru of the cosmos  Bhagwan Shri Krishna '.

 
5250 years  ago! 
 భగవాన్ శ్రీ మహా విష్ణు భువిపై అవతరించిన కాలం  

   శ్రావణ మాసం,బుధవారం, అష్టమి తిధి, రోహిణి నక్షత్రం, అర్ధరాత్రి ( 18 th July,3228 B.C) మధుర భక్తికి పట్టుకొమ్మగా దేవకీ వసుదేవుల  పుణ్యఫలంగా  మధురానగరి లో అవతరించి , యశోదా నందుల ఇంట బలరామసోదర సహితంగా గోపీ గోపకుల మనో వల్లభుడిగా బృందావనం లో బృందగానం చేసి ఆలమందల తోపాటు బ్రహ్మేంద్రాది దేవతాగణాలను పులకింపచేసిన కొంటె కృష్ణుని లీలలు సదా  స్మర ణీయం.  తన  125 ఏళ్ల సంపూర్ణ జీవితాన్ని సమస్త మానవాళికి ఓ మహత్తర బోధగా  చూపించి , 18th February 3102BC నాడు తన అవతార మహా నిష్క్రమణ గావించి తరతరాలకు తరగని జ్ఞానము,ప్రేమ ఎలాఉంటుందో చవి చూపి,  ధర్మ స్థాపన,అధర్మ శిక్షణ ఎలా చేయాలో అనుసరణీయ ఆచరణీయ విధానంలో ప్రబోధించిన మహా జగద్గురువు ,మహా యోగీశ్వరుడు శ్రీకృష్ణునికి  హృదయాంజలి ఘటించని జీవి ఉంటుందా? . 

ద్వారకా ధీశుడిగా ,రన్ చోడ్ గా గుజరాత్ లో , శ్రీనాధుడిగా రాజస్థాన్లో , విఠోబా గా మహారాష్ట్రలో, జగన్నాధుడిగా ఒడిస్సాలో, శ్రీకృష్ణుడిగా కర్ణాటకలో, గురువాయూర్ అప్ప గా కేరళలో, కన్నయ్య గా ఉత్తరప్రదేశ్ ( మధుర )లో  భారతీయుల గుండెల్లో   నిత్యనూతన జ్ఞాన జ్యోతులు , మనస్సు ల్లో  మధురప్రేమ కాంతులు వెదజల్లుతూ  పంచకోశ భరితమైన మానవాళి కి ధర్మమార్గాన్ని అనుక్షణం గుర్తు చేస్తున్న మహా జ్ఞాన దీప్తి శ్రీకృష్ణుడు!



Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి