అప్రాచ్యులు
గత 1000 ఏళ్లలో , పరమత సిద్దాంత దోపిడీ పాలక ముటాల చేతిలో , సనాతన భారతీయ సిద్దాంతాలను పాటించే భారతీయులు సుమారు 10కోట్ల మంది దుర్భర పరిస్థితులలో ప్రాణాలు విడిచారు . సుమారు 500 చిన్న చిన్న రాజ్యాలుగా విడగొట్టి దేశాన్ని ,జాతి వారసత్వాన్ని ,జాతి సంపదను ,జాతి నమ్మకాలను కాలరాచి ,కేవలం తమ అంతపురము,తమ రాచరికం,తమ జమీందారీ లు బాగుందా లనే స్వార్ధపు కార్పణ్యాలతో బలహీనపడి ,సరిహద్దులు దాటి వచ్చిన తురుష్క ముష్కరులకు సలాం కొడుతూ సొంత జాతిని, మాతృభూమిని ఫణం గా పెట్టిన దౌర్భాగ్యులు ఎందఱో ! సంస్కృత భాషను, వేద సాహిత్యాన్ని అపాత్రులకు అందకూడ దనే వాదనతో తమ పొత్రాలలొ పాతరవేసుకొని ,అసలైన మతాన్ని , సనాతన ధర్మ సిద్దాంతాలను పక్కనపెట్టి కేవలం క్రతువుల పేరుతో జాతిని బలహీన పరిచిన ఒక వర్గపు కుటిల చాదస్తపు మూర్ఖత్వానికి బలైన భరత జాతి మళ్ళీ పుంజు కొంటుం దా ? ప్రజాస్వామ్యం ,పరమత సహనం అనే వంకతో మెజారిటీ వర్గీయుల కు స్వేచ్చ లేకుండా ,మైనారిటీ ప్రజా రక్షణ అనే సాకుతో ఆటవిక ధర్మాలు, మూర్ఖపు వాదనలు, ఉగ్రపంధాలను చూసీ చూడక వదిలేస్తూ ,వారు గంప గుట్టగా కుమ్మరించే ఓట్ల కోసం అర్రులు సాచని రా...
Comments
Post a Comment