భారత జాతి పై దాడి
1757 లో అది జరిగింది.
ప్లాసీ యుద్ధం లో సిరాజ్ ఉద్దవ్లా ఓటమితో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ ని ఆక్రమించు కొన్నాడు .
భారత జాతి పై సంపూర్ణ ఆధిపత్యం, ఈస్ట్ ఇండియా కంపనీ ద్వారా ఇంగ్లీష్ రాణి చేతిలోకి ,ఆ పై క్రిస్టియన్ మిష నరీ ల మత మౌడ్య జాత్యహంకార కోరల్లోకి చిక్కింది .
1757 తర్వాత సుమారు 70 ఏళ్ళు సంస్కృతం లో ప్రావీణ్యం పొంది న వివిధ ఇంగ్లీష్ , జర్మన్ తత్వ వేత్తలు (చార్లస్ విల్కిన్స్ , విలియం జోన్స్ ,థామస్ కోల్ బ్రోక్,రుడాల్ఫ్ రోత్ , స్లీగల్ సోదరులు , ఆర్ధర్ షోపెన్ హెయిర్)- భగవద్గీత ,ఉపనిషత్ లు ,వేదాలు , కావ్యాలపై వ్రాసిన వాఖ్యానం చదివిన పాశ్చాత్యులు , భారతీయుల జ్ఞాన సంపద ,ఆయా భావజాలం యొక్క ఉత్క్రుష్టత చూసి ఆశ్చర్య పోయారు .
యూరప్ లో ఆవిధం గా మంచి ప్రాచుర్యం పొందుతున్న సనాతన భావ జాలం ని చూసి జ్యూస్ , ఇంగ్లీష్ క్రిస్టియన్ మిష నరీ లు కంగారు పడి, ఏ విధం గా నైనా సంస్కృత భాషని బ్రష్టు పట్టించి భారత సంప్రదాయాల పై అసహ్య భావం కలుగ చేసి ప్రపంచ ప్రజలలో నే కాదు భారత యువతలో కూడా భారత సంస్కృతీ పై హేళన ,ఎగతాళి , నిర్లిప్తత కలగ చేయడానికి ఓ పెద్ద కుట్ర పన్నారు . దానికి ఆజ్యం పోసి ప్రజ్వరిల్ల చేసిన వారు మెకాలే ,మాక్స్ ముల్లర్.
ప్రాంతీయ భాషల్లో కాకుండా కేవలం ఇంగ్లీష్ మాధ్యమం ద్వారా నే అన్ని క్లాస్సులు నడిచే విధం గా మెకాలే తీసుకున్న నిర్ణయం భారతీయ జాతిని పూర్తిగా నిర్వీర్యం చేసింది .
ఆర్యులు వస్తుత భారతీయులు కాదని ,మధ్య ఆసియా నుండి వలస వచ్చిన జిప్సీలని;
వారికి ,అప్పటికే భారత దేశం లో ఉన్న ద్రావిడులకి యుద్దాలు జరిగాయని ,
ద్రావిడులను వింధ్య కి దక్షిణం గా తరిమి కొట్టారని -- ఈవిదం గా ఉత్తర దక్షిణ భారతీయుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేశారు .
వ్రుత్తి రీత్యా , ప్రవ్రుత్తి రీత్యా నాలుగు శాఖలుగా ఉన్న సమాజాన్ని తప్పుడు భావ జాలం వ్యాప్తి చేసి సమాజ హోదా రీత్యా విభజన చేయ బడే విధం గా కుల వర్గీకరణ లను ప్రోత్సహించి భారతీయ సమాజాన్ని చీలికలు పేలికలు చేసి అంతర్యుద్దం దిశగా, దేశం బ్రష్టు పట్టే విధం గా సంస్కృతీ -సంప్రదాయా లపై దాడి చేశారు .
మెకాలే తన తండ్రికి గర్వం గా ఈ విధం గా ఉత్తరం వ్రాశాడు --- "No Hindu who has received English education, ever remains sincerely attached to his religion. We are destroying the indian knowledge & tradition,without any interference with religious liberty of hindus. I as the architect of the educational policy of India, Old traditional values and ancient scriptures were systematically omitted, deliberately distorted and willfully obscured. We have planned to produce Indian boys and girls who should be Indian in blood and complexion but English in thought and deed. they became more English than the English themselves." We (Macaulay & Maxmuller & others) are disguised and dubed the indians. we feigned, professed and pretended to be a friend of India.
మాక్స్ ముల్లర్ వివేకానందుడిని కూడా బురిడీ కొట్టించాడు . వీరి కుట్రలు తెలియక , వివేకా నందుడు మాక్స్ ముల్లర్ ని బాగా మెచ్చు కొనే వాడు .
మెకాలే, క్రిస్టియన్ మిష నరీ లలో చదివి మరే మతాన్ని సహించ లేని కరడు కట్టిన క్రూ ర చాందస వాది .
మెకాలే ఆజ్ఞతో జీతం రాళ్ళ కోసం అమ్ముడుపోయి తన విద్వత్తుని ,ఆత్మని తాకట్టు పెట్టి , సంస్కృత గ్రంధాలకు తప్పుడు అర్ధాలు వ్రాసి వ్యాప్తి చేసిన వాడు మాక్స్ ముల్లర్.
చరిత్ర ని తప్పుదారి పట్టించడం ,సంస్కృత కావ్యాలు,పురాణాలు,వేదాలు,ఉపనిషత్ లకు తప్పుడు వ్యాఖ్యానాలు చేసి వ్యాప్తి చేయడం ,భారతీయుల సంప్రదాయాలు,ఆచారాలు,కట్టుబాట్లను యువ భారతీయులే ఈసడించు కొనేలా చేయడం , విలువైన గ్రంధాలను తస్కరించి యూరప్ దేశాలకు తరలించడం , భారత జాతికి ఉన్న విజ్ఞాన సంపదను హేళన చేసి అది ఒక మూర్ఖపు మూడ నమ్మకాల కుప్ప అని ప్రపంచం అంతటా చాటి భార తీయుల కే దానిపై విశ్వాసం సడలిపోయి వేరే ఏదో ఒక మతం వైపు ఆకర్షింప బడేలా మానసిక సాంస్కృతిక దాడి చేశారు .
ఆక్సఫర్డ్ విద్యాలయం కూడా తక్కువ తినలేదు . కేవలం సంస్కృత భాషకి తప్పుడు అర్ధాలు చెప్పి భారతీయులను మత మార్పిడి చేయడానికి "బోడెన్ సంస్కృత పీటం "స్థాపించారు . ఆ పీటాధి పతులుగా విల్సన్ ,విలియమ్స్ -వేదాలకు తప్పుడు భాష్యాలు వ్యాప్తి చేశారు .
పాశ్చాత్యులు ఏది చెప్పినా తల ఊపి తాన తందానా అనే కుహనా భారతీయ మేధావులు , సంస్కృతం లో పరిపూర్ణత లేని రచయితలు ,వారంతట వారు సంస్కృత సాహిత్యం లో పరిశోధన చేయ లేని సోమరులు - వీరందరూ చివరికి బాల గంగాధర్ తిలక్ లాంటి నిజాయితీ గల రాజకీయ సామాజిక కార్యకర్తలు;
మున్షి ,సంపూర్ణానంద లాంటి మంచి రచయితలు కూడా పాశాత్య అనువాదాల ప్రభావానికి లోబడి మన సాహిత్యానికి తప్పుడు భాష్యాలు చెప్పి సంఘాన్ని తప్పుదారి పట్టించారు .
చివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన ప్రభుత్వాలు , సిలబస్ లలో ఆ తప్పుడు వ్రాతలను పాట్యాం శాలుగా పెట్టారంటే మన భావ దాస్యం ,మానసిక బానిసత్వం ఎంత ఘోరమో తెలుస్తుంది .
అలెక్జాందర్ మొదలుకొని హూణులు,శకులు ,స్లావులు,తురుష్కులు ,పర్షియన్ లు ,ఆఫ్ఘన్ లు , మొగలాయులు మన భరత వర్షం పై దండ యాత్రలు చేశారు . వారి వారి భావ జాలాన్ని మన పైన రుద్దడానికి సామ దాన భేద దండో పాయాలు చేశారు . వీరందరూ భారతీయులను శారీరకం గా బలహీనులను చేశారు . రాజ్యాలను విచ్చిన్నం చేశారు .
మన పాలకుల మధ్యన తంపులు పెట్టి ,పదులలో ఉండే జన పదాలను వందల్లోకి తునాతునకలు చేశారు .
కానీ ఇంగ్లీష్ వాళ్ళు చేసినంత కీడు వేరెవరు చేయ లేదు . రక్తం చిందించ కుండా ఒక జాతిని ఎలా నిర్వీర్యం చేయ వచ్చో, చేసి చూపించారు . మన వేదాలకు ,వేదాంత సాహిత్యానికి తప్పుడు భాష్యాలు వ్రాయించి హిందూ ధర్మానికి విపరీతార్ధాలు చేసి ,హిందూ జాతి ఒక అనాగరిక మూడ నమ్మకాల పుట్ట అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు .
మన సనాతన ధర్మ చింతన గురించి చెప్పే సంస్కృత గ్రంధాలను మనమే నిర్లక్ష్యం చేసుకొంటూ , మన సొంత విద్యాలయాల లో కూడా వాటిని చెప్పు కోలేక పోతున్నా మంటే మన భావ దాస్యం ఎంత పరాకాష్ట కి చేరిందో అర్ధం చేసు కోవచ్చు .
మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది గానీ , సాంస్కృతిక - మానసిక బానిసత్వం పోలేదు .
ప్రక్రుతి ఉత్పాతాల వలన కొంత , మధ్య యుగాల లో అనాగరిక చీకటి మూకల దండ యాత్రల వలన కొంత మన సంస్కృత సాహిత్యం మట్టి కొట్టుకు పోయింది .
ఐనా , షిర్డీ సాయిబాబా వంటి ఎందరో సద్గురువులు, కబీర్,నానక్,తుకారాం,జ్ఞానేశ్వర్ లాంటి భక్తి యోగులు , దయానంద్ సరస్వతి , అరబిందో, స్వామి వివేకానంద ,ఇంకా అనేక మంది మహనీయులు చేసిన అవిరళ కృషి వల్ల మన సంస్కృత భాష , మన వేద సాహిత్యం ,మన సంస్కృతీ దినదినం ప్రవర్ధిల్లుతు న్నాయి .
ఇప్పుడు ఆ పని చేయ వలసిన బాధ్యత మనందరి పైనా ముఖ్యం గా మానవ వనరుల శాఖ పై ఉంది .

nice sir
ReplyDelete