సత్యాన్వేషణ లో సనాతన - క్వాంటం తత్వాల జుగల్ బందీ (Who are We?)
నిజానికి మన మెవ్వరం ? అన్నింటికీ మూల కారణమైన సత్యం ఏమిటి ?
ఈ ప్రక్రుతి ,ఈ చరా చర ప్రపంచం , స్థావర జంగమాలు ఎలా పుట్టాయి ?
సప్త ధాతువులు ,దశ వాయువులు , 14 తత్వాలతో ఉన్న మనం ఎలా ఎక్కడి నుండి వచ్చాం ? మన ప్రయాణం ఎలా చేయాలి? మనకి గమ్యం ఉందా ? లేదా?
అణువు నుండి కణాలు,శరీర వ్యవస్థలు ,వీటన్నింటి అజమాయిషీకి మెదడు ,దానిని కూడా నియంత్రించే చైతన్యం - ఇదంతా ఒక క్రమబద్దమైన రచనా ? లేక అనుకోకుండా జరిగిన సంఘటనా ?
కనబడే దృశ్య జగత్తు (4%),కనబడని అవ్యక్త సత్యం గురించి సనాతన తత్త్వం చేసి న అన్వేష ణే ఇప్పుడు క్వాంటం శాస్త్రజ్ఞులు చేస్తున్నారు .
( అవ్యక్తా న్ని వేదాంతం చైతన్యం అంటుంది . క్వాంటం శాస్త్ర ప్రకారం ,అవ్యక్తం 70% కృష్ణ శక్తి ,26%కృష్ణ పదార్ధం)
నేటి భౌతిక శాస్త్రం ఈ మధ్య నే(19th.century) పరమాణు సైజుని (0.5nanometer)కనిపెట్టింది .
సనాతన జ్ఞా నా నికి మహర్షి పరంపర ఉన్నట్లే ,క్వాంటం జ్ఞా నా నికి కూడా మహర్షులున్నారు .
వారే - బోర్,హీసేన్ బర్గ్ ,ప్లాంక్ ,ఐన్ స్టీన్ ,డిబ్రోగ్లి ,శ్రొదింగర్ ,పౌలి ,డిరాక్ లు.
వేదాలు,ఉపనిషత్ లు ,దర్శనాల ద్వారా చెప్పిన మన సనాతన ధర్మ జ్ఞానాన్ని , క్వాంటం శాస్త్ర జ్ఞానం తో పోల్చి బేరీజు వేస్తే , "సత్యం ఎప్పుడూ మారదు" -అనే అవగాహన ఇంకా గట్టిగా బల పడుతుంది .
పైకి వివిధ రూపాలలో ఉన్న ఈ ప్రక్రుతి ని చీల్చి చూస్తే కనబడే ఎలక్ట్రాన్ లు అన్నీ ఒకే రకం గా,ఒకే విధమైన శక్తి తో ,ఒకే విధమైన బరువు తో ఉంటాయి. ఎలక్ట్రాన్ ఏ గ్రహం నుండి వచ్చినా ఒకే రకం గా ఉంటుంది . కాబట్టి ఈ విశ్వం లో ని గ్రహ నక్షత్రాలు , వాటి పై ఉండే జీవాలు అన్నింటికీ మూలం ఒక్కటే . అదే పరమాణువు(atom) . కానీ క్వాంటం శాస్త్రజ్ఞులు పరమాణువుని కూడా చీల్చి పరమాణువు కి మూలం పర-పరమాణు వులు(sub atomic particles) అనీ,వాటికి మూలం ---- "కాంతి" (light) అని తేల్చారు .
కనిపించే ప్రతిదీ కాంతి తో తయారయిందే .(we are the people of light. the entire cosmos & nature is the product of light. thats why,we the mankind named as 'bharat' in sanskrit).
కాంతి ఘనీభవించి(lesser vibrations) పదార్ధం గా మారా లంటే (వ్యక్త మవ్వా లంటే )ఒక ఆలోచన ఉండాలి.
విశ్వ చైతన్యం లో ఒక సంకల్పం కలిగి మొట్ట మొదట కాంతి ఏర్పడింది అని కొంచెం అటూ ఇటూ గా సనాతన తత్త్వం ,వేదాలు ,క్వాంటం శాస్త్రం చెబుతున్నాయి .
అలా ఆలోచించింది ఎవరు ?
అనగా, "సంకల్పం - ఆలోచన -సాక్షి" లేకపోతే కాంతి పదార్ధం గా వ్యక్త మవ్వదు . ఈ విషయం క్వాంటం శాస్త్రజ్ఞులు నిరూపిం చిందే .
పరిశీలకుడు , పరిశీలించ బడే వస్తువు , పరిశీలింప బడటం అనే 3 కూడా ఒక్క టే అని ,ఒక దానిని ఒకటి ప్రభావితం చేసుకొంటా యని క్వాంటం శాస్త్రం ,వేదాలు చెబుతున్నాయి .
శుద్ద కాంతి(pure energy) ప్రాధమిక మని(fundamental aspect) ,దానికి చైతన్యం(cosmic consciousness) తోడై నప్పుడు అది పదార్ధం (matter)గా వ్యక్త మవుతుందని(manifest) క్వాంటం శాస్త్రం చెబుతుంటే ,
చైతన్యం ప్రాధమిక మని దానిలో సంకల్పం కలిగినప్పుడు కాంతి , ఆ తర్వాత పదార్ధం వ్యక్త మవు తాయని వేదాంతం చెబుతుంది .
వేదాంత పరిభాషలో చైతన్యాన్ని పరబ్రహ్మ లేదా పురుష అని, కాంతి అనగా శుద్ద శక్తిని అమ్మ లేదా ప్రక్రుతి అని అంటారు .
కాస్మిక్ చైతన్యం ను ఓం అనే ధ్వనితో సూచిస్తారు . ఇదే విశ్వ నాదం . ఇదే జీవన వేదం . యోగుల మదిలో మెదిలే అనాహత నాదం ఇదే . నాదం అంటే మన చెవి గ్రహించే ధ్వని కాదు . అది సూక్ష్మ మైన ధ్వని శక్తి . అది ఒక శబ్దం గా మారి నప్పుడే మన చెవి గ్రహిస్తుంది .
ఓం = కాస్మిక్ చైతన్యం + కాంతి = హిగ్స్ క్షేత్రం.(హిరణ్య క్షేత్రం లేదా హిరణ్య గర్భుడు ). ఇది క్వాంటం ప్రతిపాదన .
కాస్మిక్ చైతన్యం లోని ఒక వంతు నుండి ప్రకాశం (కాంతి),ఆ ప్రకాశం నుండి ప్రక్రుతి పరిణామం చెందాయని వేదం చెబుతుందీ.
యోగ సాధనలో కూటస్త స్థితిలో అవగత మయ్యే ప్రకాశ మే(జ్యోతి ) అది .
క్వాంటం శాస్త్ర జ్ఞులు ఏ ప్రకాశాన్ని(pure light) ఉహించి చెబుతున్నారో ,దానిని యోగి చూస్తున్నాడు .
కాంతి పదార్ధం గా ఎలా మారుతుంది ?
హిగ్స్ క్షేత్రం లో ఫర్మియాన్ లు కాంతి వేగం తో అటు ఇటూ గెంతు లేస్తూ క్రమం గా వేగం కోల్పోయి ,క్వార్క్ లు మరియు లేప్టాన్ లు గా ,ఆ తర్వాత పదార్ధం గా మారుతాయి .
హిగ్స్ క్షేత్రం + ఫర్మియాన్ లు = క్వార్క్ లు + లేప్టాన్ లు = పదార్ధం (matter).
మూడేసి క్వార్క్ లు గ్లుయాన్ లతొ బంధింపబడి న్యుట్రాన్,ప్రొటాన్ లు గా మారతాయి.
లేప్టాన్ లు ఎలక్ట్రాన్ లు గా మారతాయి .
ఈ సృష్టి కి లక్ష్యం ఏమైనా ఉందా ?
చైతన్యం కాంతి గా , కాంతి పదార్ధం గా , ఆ పదార్ధం మళ్ళీ కాంతి గా మారడం అనేది సృష్టి చక్రం . ఈ మార్పులన్నీ విశ్వ మానసం నుండి మొదలై మళ్ళీ అందులోకే కరిగిపోతాయి .
ఈ సంఘటన లన్నీ విశ్వ చైతన్య లీలలు .
విశ్వ చైతన్యం నిర్జీవ పదార్ధాలను , గ్రహ నక్షత్రాలను ,ప్రాణులను ఎలా ప్రభావితం చేస్తుంది ?
సమాచారం విశ్వ మానసం నుండి బయల్దేరి , కాంతి ద్వారా ప్రయాణించి రకరకాల విధాలుగా తరంగా దైర్ఘ్యం మార్చు కొంటూ చివరకు జీవుల మానసానికి చేరు తుంది . తద్వారా ఆయా జీవుల జీవనం సాగుతుంది .
సాధకుడు ఆత్మ స్థితి చేరినప్పుడు దేశ కాలాలను అధి గమిం చే శక్తిని పొందు తాడు .
కాంతి ధర్మం ఏమిటి ?
(సనాతన ధర్మం = కాంతి ధర్మం = quantum property )
సూక్ష్మ స్థాయిలో పరిశీలిస్తే ,కాంతి అలల రూపం లో కాకుండా చుక్కలు చుక్కలు గా(photons) ఉంటుందని తేల్చారు క్వాంటం పరిశోధకులు .
మూల ప్రక్రుతి కి కారణ మైన కాంతి అవిచ్చిన్నమైన కిరణ రేఖ లా కాక,బొట్లు బొట్లు గా ఉంటుందని ,దాని శక్తి దాని యొక్క పౌన పున్యం (frequency)పై ఆధార పడి ఉంటుందని,దానికి ద్రవ్య రాశి(mass) లేకున్నా దాని చలనం(momentum), తరంగ దైర్ఘ్యం(wave length) పై ఆధార పడి ఉంటుందని క్వాంటం శాస్త్రజ్ఞులు కనిపెట్టారు.
మరోసారి అవలోకనం చేయండి.
తొలుత ఎలాంటి స్పందన లేని చైతన్యం.
దానిలొ ఓ సంకల్పం,స్పందన,కదలిక ఎర్పడింది.దానితొ వచ్చిందే ప్రకాశం -అనగా కాంతి.
ఆ కాంతి ఎలా ఉంది?
ఆ కాంతి కి గమనం ఉంది.శక్తీ ఉంది. కాంతికి అనగా శక్తికి ఆకర్షణ ,వికర్షణ బలాలు రెండు ఉంటాయి . అదే పదార్ధాని కైతే ఒక్క ఆకర్షణ బలమే ఉంటుంది .
ఆ కాంతి యొక్క శక్తిని కొలవడానికి ఒక సూత్రం -
photon's energy = planc's fundamental nature constant(h) * velocity of light(c) / wave length
ఆ కాంతి యొక్క గమనం కొలవడానికి మరో సూత్రం------
photon's movement = velocity of light(c) * wave length
కాంతి లో రెండు రకాలు . ఒకటి పదార్ధం గా మారేది-fermiyans(అనగా వ్యక్త మయ్యేది ) .
రెండోది పదార్ధం గా మారనిది-boson.(మన కంటికి కానీ పించే కాంతి).
కాంతి వేగం ఎల్లప్పుడూ ఒకేరకం గా ఉంటుంది . అది నీ వైపు గా వస్తున్నా , నీ నుండి దూరం గా వెళుతున్నా కాంతి వేగం ఒకే రకం గా ఉంటుంది . అది సాపేక్షం కాదు . అది స్థిరం . మార్పు లేనిది . (constant).
ప్ర దేశ కాలాలు (space&time) కాంతి కి ఉండవు . కాంతి ఎంత దూరం సాగితే దానితో నే దేశ కాలాలు ఏర్పడా తాయి .
కాంతి దేశ కాలా లపై ఆధారపడి లేదు .దేశ కాలా లే కాంతి పై ఆధార పడి ఉంటాయి .
కాంతి వేగం కంటే తక్కువ ఉన్న వాటికే ప్రదేశ కాలా లతో పని ఉంటుంది .
అందుకే మనకు వాటితో(space&time) పని .
యోగి ఆత్మ స్థాయికి చేరు కొన్నప్పుడు అనగా క్వాంటం స్థాయికి తన చైతన్యా న్ని (ఎరుకను) విస్తరించి నప్పుడు దేశ కాలా లకు అతీతం అవుతాడు . అనగా స్వచ్చమైన కాంతి గా మారతాడు . అదే తన సనాతన సచ్చిదానంద స్థితి అని గ్రహిస్తాడు . అంతటి సూక్ష్మ స్థాయికి మన చై తన్యా న్ని విస్తరింప చేసే విధానానికి సాయ పడే మార్గా లే
భక్తీ,కర్మ,రాజ,ధ్యాన, జ్ఞాన యోగ పద్దతులు . అనగా ఏ పంచ భూతా లైతే ఈ చరా చార ప్రకృతిని నిర్మించా యో వాటి మూలాల కి మన చైతన్యం ప్రసరించి నప్పుడు యోగికి వాటి పై ఆధిపత్యం వస్తుంది .
దేశ కాలా లకు అతీత మైన కాంతి యొక్క స్థితిని ఎలా సూచిస్తాం ?
అందుకే మన మహర్షులు క్వాంటం క్షేత్రాన్ని ఓం అనే సంస్కృత అక్షరం తో సూచించారు . కాంతి కి సంకేతం గా బిందువును చూపుతారు .ఆ బిందువు కింద అర్ధ చంద్రా కారం - ప్రకృతిని అనగా వ్యక్త స్థితిలో ని శక్తి ని సూచిస్తుంది . ( ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః ).
వ్యక్త స్థితిలోని శక్తిని మాయ అని కూడా పిలుస్తారు .
మన జీవితం , మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం అంతా మనందరి ఆలోచనల ఫలితం .
యుగాలు,మన్వంతరాలు ,కల్పాల నుండి ఉన్న ఆలోచనా ధార ల ఫలితం ఈ విశ్వం .
ఈ సకల సృష్టి పరబ్రహ్మ ఆలోచనే . ఆయన ఆలోచన లను మనం లీల అని చెప్పుకొంటా ము .
అలాగే మన జీవితం లో జరిగే ప్రతిదీ కూడా మనందరి సమిష్టి ఆలోచనలే . కానీ నిజానికి , ఇవి కూడా పరబ్రహ్మ లీలలే . ఎందు కంటే మనమూ , మన ఆలోచనలూ ఆ పరబ్రహ్మ లో భాగమే కదా !
కాంతి కంటే ఎక్కువ వేగం ,శక్తి దేనికైనా ఉందీ అంటే అది ఒక్క ఆలోచన కే . అది కూడా దేవుని(విశ్వ చైతన్యం ) ఆలోచన కే .
కాంతి అలలు గా ఉండి దానికి ఒక ఆలోచన ,లేదా ఓ స్పందన కలిస్తే ఆ అల బిందువు గా (super strings ) మారి (collasing of wave due to observer effect)సూక్ష్మ తన్మాత్రలుగా రూపు దిద్దుకొంటా యి . వాటినే క్వాంటం భాషలో ఫర్మియాన్ లు ,బోసాన్ లు అంటాము .
ఫర్మియన్ లు(fermions) పదార్ధం గా మారే ముందు ఎన్నో రకాల సంభా వితాలుగా మార డానికి అనువైన స్థితి (field of probability) ఉంటుంది . ఆ స్థితిలో ఒక సాక్షి లేదా పరిశీలకుని ప్రభావం(కాస్మిక్ మైండ్) వలన ఆ సంభావితాలు అన్నీ పోయి(collapse of possibilities) ఒక సంఘటన(event) ఆవిష్కృత మవుతుంది .ఆ సాక్షి నే మన వేదాలు దైవం గా చెప్పి కొలిచాయి .
బోసాన్ (bosans) అంటే మనం మన కంటి తో చూసే కాంతి .
స్థూలం గా చూస్తే -వర్తమాన ,భూత ,భవిషత్ అనే మూడు కాలాలు,దూరాలు ,వేగము,బలం,త్వరణం అనే కొల మానాలు ఉంటాయి గానీ, సూక్ష్మ స్థాయిలో ఇవేమీ ఉండవు . ఆ సూక్ష్మ స్థాయిని యోగులు పరబ్రహ్మా అని పిలిస్తే ,దానినే "క్వాంటం క్షేత్రం" అని క్వాంటం శాస్త్ర జ్ఞులు అంటారు .
గురుత్వ బలాల పై ఆధార పడిన న్యూటన్ గ్రహ గతుల సూత్రాలు ,
ఐన్ స్టీన్ సాపేక్ష సిద్దాంతం - ఇవేమీ సనాతన మనస్సు(eternal consciousness ) యొక్క ప్రభావం ని లెక్కలోకి తీసు కోలేదు . ఎందు కంటే దృశ్య జగత్తు (స్థూల ప్రపంచా న్ని) మాత్రమే వారు పరిశీలించారు . దాని వెనక ఉన్న
అదృశ్య జగత్ గురించి ఉహించ లేక పోయారు .కానీ తర్వాత వచ్చిన క్వాంటం శాస్త్రజ్ఞులు సృష్టి కి " మనస్సు " ,అనగా ఒక క్రమంలో సృష్టి లయలు సజావుగా జరగా లంటే , ఒక పధకం(planing) ఆవశ్యకత గురించి ఒప్పు కొన్నారు .
స్పందనలో తేడా తప్ప పదార్ధము ,శక్తి ఒక్కటే .
స్థూల స్థాయిలో, వేగము, దిశ ,బలము తెలిసినప్పుడు భవిష్యత్ లో ఏమవుతుందో లెక్కలు వేయ వచ్చు .
కానీ,సూక్ష్మ స్థాయిలో ఎన్నో రకాల సంభావితాలకు అవకాశం ఉంటుంది . కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేము .
ప్రక్రుతి ని సూక్ష్మ స్థాయిలో అనగా పరమాణువు లోపల పరీక్ష చేసి నప్పుడు అంతా ద్వంద స్థితి లో ఉంటుంది .
శక్తి మరియు పదార్ధము రెండు రకాలుగా - అల గా లేదా బిందువు గా ఉండవచ్చు .
పరబ్రహ్మ కి అన్నీ తెలుసు . అలా తెలిసి ఉండ టాన్నే ఎరుక అని అంటాం . స్వయం చేతన ఉంటుంది . స్వయం ప్రకాశం ,స్వయంచోదితం ,స్వయంనిర్ణయం ఉంటాయి . దీనికే మరో పేరు పరమ చైతన్యం - పరమ ఎరుక -పరమ మానసం అని వ్యావహారికం గా చెప్పు కొంటాం .
ఈ పరమ ఎరుక అన్నింటి లో (పదార్ధం /శక్తి ) ఉంటుంది .
కానీ "అది ఉంది" అని తెలుసు కొనే మానస శక్తి మనిషి కే ఉంది .
ఇన్ని మాటలు, ఇన్ని సిద్దాంతాలు వ్రాసి గందర గోళ పరిచే కన్నా ఒక వాక్యం వ్రాసి ముగిస్తాను -
"జగత్ అంతా భగవద్ స్వరూపమే !"

So lucid presentation raju ji Thanking you for your great effort sir plz continue the new articles and good work.
ReplyDelete