దైవ వాక్యం

ఓ జీవి ప్రయాణం : పరబ్రహ్మ లోని ఓ శకలం స్వ లేదా దైవ ప్రేరణతో, మాయకు లోబడి ఆత్మ గా తన ప్రస్తానం మొదలు పెట్టింది . దాని గమ్యం "మాయ" ముసుగుని తొల గిమ్చు కొని, తాను అనుభవిస్తున్నట్లుగా భావించిన  త్రిగుణా త్మక మైన " కల " లాంటి ప్రయాణా న్ని ముగించి నిర్గుణ బ్రహ్మలో  ..... 
  • మనిషి తన ఇష్టానికి, కష్టానికి లేదా రాగ ద్వేషాలకు లోబడి తనకు తోచిన విధం గా  మాట్లాడతాడు,కర్మలు చేస్తాడు .
  • మరికొందరు కీర్తి కోసం ,డబ్బు కోసం, బంధం కోసం, బాధ్యతల రీత్యా ,ఇతరుల కోసం , ఇతరులు చెప్పినట్లుగా చేస్తారు . 
  • కానీ ,మనిషి దేవుడు చెప్పినట్లు ఎప్పుడు నడచు కొంటా డో అప్పుడే మనిషి సాధకుడు అవుతాడు .
దేవుడు చెప్పింది ఇదీ' అని ఎవరు చెప్పారు ?
సనాతన ధర్మం ,ఇంకా వివరం గా శృతి స్మ్రుతి పురాణాలు చెప్పాయి .
ప్రస్తాన త్రయాలైన ఉపనిషత్ ,గీత ,బ్రహ్మ సూత్రం ' ద్వారా ఇంకా విడమరిచి చెప్పారు ఋషులు .

ఏమిటా దైవ వాక్యం ?
దైవ వాక్యం ఇదే -సకల సంకల్పాలను ,ఆలోచనలను ,కోరికలను ,కర్మలను కర్తృత్వ భావన లేకుండా(*నేనే చేస్తున్నాను అని కాక ) ,అదే సమయం లో కర్మ ఫలితాలపై ఎలాంటి ఆసక్తి ని చూప కుండా(ఆ ఫలితం *సుఖాన్ని ఇస్తుందా లేక దుఖం కలగ చేస్తుందా, అనే ఆందోళన లేకుండా ) , అత్యంత కౌశలం తో ప్రతి బాధ్యతను భగవద్ ఆజ్ఞగా నిర్వర్తించి ,వచ్చే ఫలితాలు ఎలాంటి వైనా భగవద్ ప్రసాదం లా స్వీకరించాలి .
ఇక్కడ గమనించండి - 1. నేనే ' అనే అహాన్ని పూర్తిగా వదిలేయాలి . 2. సుఖ దుఖాలకు శీ తోష్ణాలకు అతీతం గా ఉండగలగాలి .

ఈ వాక్యాన్ని పొల్లు పోకుండా అమలు చేయా లంటే మనిషి 'సాధకుడు ' గా మారాలి .
అలా మార్పు చెంద డా నికే నాలుగు దివ్య మైన మార్గాలు సూచించారు ఋషులు .
అవే ,భక్తి -కర్మ/రాజ -జ్ఞాన యోగ మార్గాలు .
ముందుగా ఈ మార్గాలలోకి మనిషి అడుగు వేయా లంటే అతనికి కనీస 
అర్హత ఒక్కటి ఉండాలి . అదే, ప్రగాడ నమ్మకం ...  మనిషికి మూడు విషయాల పై ధృడ మైన
నమ్మకం ఉండాలి .


1. దైవం పై అచంచల విశ్వాసం.
2. ఆ తర్వాత, మానవ జన్మకి ఒక లక్ష్యం ఉందని , కర్మ పరిపాకాన్ని పూర్తిగా భస్మం చేసుకోవడ మే జీవి గమ్యమని నమ్మాలి . కర్మలను తుడిచి వేయా లంటే ఉన్న ఏకైక మార్గం ఆధ్యాత్మిక సాధన .. అంటే ,
 దైవ వాక్యాన్ని అక్షరం పొల్లు పోకుండా అమలు చేయాలి .
3. కేవలం మానవ జన్మలోనే అలా అమలు చేయగల అవకాశం జీవికి ఉందని ,ఆధ్యాత్మిక సాధన మా నవ జన్మ లోనే  సాధ్యమని  నమ్మాలి .

14 భువనాలలో(dimensions) జీవి ఎక్కడ ఉండాలో నిర్ణ యించేది , ఆ జీవి యొక్క కర్మల భారం .
ఈ 14 లోకాలలో అత్యంత ముతక(gross) ,అత్యంత భౌతిక (physical)లోకం మన భూలోకం .
"జీవి' తన మహా ప్రస్తానం లో భూమి పై న ఉండే సమయం కూడా అత్యంత అల్పం .
ఇంకా వివరం గా చెప్పు కోవా లంటే ,జీవి ఎక్కువ కాలం వేరే లోకాల్లో(dimensions) ఉంటుంది .

చేసుకొన్న కర్మలు-( సంచిత కర్మలను) భస్మం చేసు కోవా లంటే జీవికి కర్మ సాధన లేదా ఆధ్యాత్మిక సాధన  చేసుకొనే కర్మ భూమి అత్యంత అవసరం .అదే భూలోక జననం .
 అంటే జీవుడు , కర్మలభారాన్ని పూర్తిగా తొల గించు కోవా లంటే మానవ జన్మ తప్పనిసరి . 

14 లోకా లంటే వేరే ఎక్కడో అంతరిక్షం లో ఉండవు . పదార్ధం ,ధన శక్తి తరంగం,ఋణ శక్తి తరంగాల మేళ వింపు తో ఈ 14 లోకాలు ఒక దానిలో ఒకటి ఇమిడి ఉంటాయని రుషి వాక్యం .

కోట్లాది జీవులు రకరకాల ఆధ్యాత్మిక  స్థాయిల్లో ఉంటాయి . ఆయా స్థాయిలను బట్టి అవి ఈ 14 లోకాలలో
ఉంటాయి . జీవికి , ఈ భూమి పై మానవ జన్మ పొందడ మనేది అత్యంత అరుదైన అవకాశం .

దురదృష్ట వశాత్తు,99శాతం మనుషులు ఇవేమీ నమ్మరు .
నమ్మినా సాధన చేయ లేరు . చేయడం మొద లెట్టినా,కొనసాగించ లేరు .
కానీ వేదాలను ,గీతను ,పురాణాలను లేదా  వారి వారి ఇతర మత గ్రంధాలను  నమ్మలేనివారు ,
కనీసం 100 రోజుల పాటు ధ్యానం చేయండి .
మీ లోపలి "మీరు " చెప్పేది...  కొంచెం వినండి . 
నమ్మండి ... వినండి ... 

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి