అంతర పూజ / అంతర్యాగం
ప్రస్తుతం మనిషి బాహ్యపరమైన పూజలకు
,ఆడంబరాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత ,ఆయా హోమాలు, వ్రతాలు ,పూజల వెనక ఉన్న అంతరార్ధం
పై దృష్టి పెట్టడం లేదు . భావ శుద్ది లేని కర్మలు రాజస ,తామస కర్మల వలనే బంధాన్ని
బలపరుస్తాయి గానీ, దైవానికి దగ్గర కానివ్వవు . దానం,జపం,తపస్సు ఇవన్నీ సాత్విక
పరమైన భావం తో ఉంటేనే మనిషి జన్మ లక్ష్యం ఐన ఆత్మ సాక్షాత్కారం సిద్దిస్తుంది
.
అంతర్ పూజ యొక్క ప్రాముఖ్యత నేడు ఏ పూజారులూ విడమరిచి చెప్పడం లేదు .
ఆధ్యాత్మిక కార్యక్రమాల వెనక ఉన్న అంతరార్ధం ను
,అంతర్యాగం యొక్క విశిష్టత ను చాటి చెప్పకుంటే మన సనాతన జ్ఞాన వాహిని
ఎండి పోతుంది .
శబ్ద ,కాంతి తరంగ రూపులైన దైవీ శక్తులు సాత్విక భావ
శక్తికి తల వూచి మనిషి ని ఆధిదైవిక మార్గం లోకి ఆహ్వానిస్తాయి .
బాహ్య పూజ ,స్తోత్రం ,జపం ,ధ్యానం , నిరంతర అంతర
పూజ -ఇవన్నీ ఒకదానికన్నా ఒకటి ఎంత మేలు చేస్తాయో ఈ చిన్ని పద్యం చూడండి
-
కోటి పూజ సమం స్తోత్రహ
కోటి స్తోత్ర సమో జపం .
కోటి జమ సమం ధ్యానం .
కోటి ధ్యాన సమో లయం . - లయ మంటే
నిరంతర అంతర పూజ.
మనిషి తన దేహాన్ని ఒక దేవాలయం లా భావన చేసి తన శరీరం ఓ ఆలయ ప్రాకారం
,తనలోని జ్ఞాన కర్మేంద్రియాలు ,మనస్సు ,చిత్తము ,అహం వీటన్నింటినీ
తనలోనే నిండి ఉన్న ఆత్మకి శరణాగతి
చేసి ,తనలోని తలపులు ,చేతలు సమస్తమూ ఆత్మకి నివేదన చేసి ,వచ్చిన
ఫలితాలను ఆత్మ ప్రసాదం లా స్వీకరిస్తే -అదే అంతర్యాగం .
"దే హొ దేవాలయః ప్రొక్తహ
జీవ శివ సనాతనః
తేజతే అజ్ఞాన నిర్మాల్యం
సోహం ' భావేన పూజయీ ... "
you are That- అది నీవే -తత్ అహంసి -సోహం -
ఇదే శోడసోప చార పూజ ,ఇదే వ్రతము ,ఇదే యాగము ,ఇదే అంతర పూజ ...
మనిషి చేయ వలసింది ఇదే .
నువ్వెవరవు ? శరీరం కాదు ,జ్ఞాన-కర్మ ఇంద్రియాలు కాదు
,మనస్సు-చిత్తము కాదు, మిధ్యా నేను అదేనండి అహము కాదు .... మరి ఎ వరిని నేను
?
ఆత్మను నేను ....
ఇది ఎలా నమ్మాలి ?
ప్రస్తాన త్రయా లైన ఉపనిషద్ లు ,భగవద్గీత ,బ్రహ్మ సూత్రాలు చెప్పాయి
. అదే శ్రుతి వాక్యం .
అదే ప్రామాణిక మైన వేద సారం .
ఏదో ఏమిటో తెలియని కాలంలో కొందరు చెప్పిన సిద్దాంతాలను ,అనుభవాలను ,దర్శనాలను వినేసి ,చదివేసి నమ్మేస్తే మనిషి కి ఎదుగుదల ఎలా వస్తుంది ?
శరీరానికి ఆహారం కావాలి ,గాలి కావాలి ,కోరికలు తీరాలి ,తృప్తి కలగాలి
, తన అస్థిత్వము- ఉనికి చాటింప బడాలి ,తన కీర్తి దిగంతాలకు వ్యాపించాలి. ఇవన్నీ
జరగా లంటే అంతర పూజలు ,బాహ్య పూజలు చేస్తూ ముక్కు మూసుకొని కూర్చుంటే కుదరదు
.
కర్మలు వద్దని ఎవ్వరూ చెప్ప లేదే ! కర్మ ఫల సన్యాసం చేయ మన్నారు
. కర్త్రత్వ భావన లేకుండా అత్యంత కౌశలం తో ,అత్యంత ఇష్టం తో పని చేయ మన్నారు . నీ
ఆశ్రమ ధర్మానికి విహిత మైన బాధ్యతలను భగవద్ కైంకర్య భావనతో నిర్వర్తిమ్చ మన్నారు .
ఇలా చేస్తూ ఉంటే వచ్చిన ఫలితాన్ని భగవద్ ప్రసాదం గా భావన చేసి పది మందితో పంచు
కోమని చెప్పారు మన ఋషులు .
కష్టాలు, సుఖాలు వస్తే కుంగి పోయి, పొంగి పోయి అశాంతితో
మాడిపోవద్దన్నారు .
అన్నింటినీ సమానం గా స్వీకరించడం అభ్యాసం చేయ మన్నారు .
దేహమే "నేను " అనుకొంటే శాంతి లేదు ,రాదు పొమ్మన్నారు .
"నేను " సర్వ వ్యాపితమైన "ఆత్మ" అనుకొంటే
నిశ్చింత వస్తుందన్నారు . అలా భావన చేస్తే పదిమందికి సాయం చేసే దృక్పధం అలవడు
తుందని చెప్పారు .
వ్యక్తి గత ఎరుక సమిష్టి గతం గా ఎదుగు తుందని,
తద్వారా సమిష్టి గత ప్రశాంతత లోకంలో వెల్లువై తుందని అదే ఇహ లోక
స్వర్గమని చెప్పారు .
ఇవన్నీ బతుకు బండి ని లాగ లేక ఆయాసం వచ్చి జీవితం పై మొహం మొత్తి
ఏర్పరచుకొన్న అభిప్రాయాలు ....
సరే ,నువ్వు స్థిమితం గా కూర్చొని ఆలోచన చేసి ,ధ్యానం అలవాటు చేసు
కొంటూ ఎందుకు నిజ నిర్ధారణ చేయ కూడదు ?
నాకా అవసరం లేదు .నాకంత ఓపికా లేదు . నేను బాగానే ఉన్నాను
.
అలా అనుకొనే వారికి ఈ తర్కము , సంవాదము ,అంతర్మధనం ,అంతర్యాగము తో
పని లేదు ... స్వస్తి !
Comments
Post a Comment