కాల మహిమ
దేనికైనా కాలం కలిసి రావాలి .
వాడికి ఇంకా టైం రాలేదు .
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు . --- ఇలాంటి సామెతలు కాల మహిమ గురించి చెబుతాయి .
12 నక్షత్ర రాశుల గుండా సూర్యుడు చేసే గమనం లో ప్రతి రాశిలోకి జరిగే ప్రవేశాన్ని సంక్రమణం అంటారు .
12 నక్షత్ర రాశుల గుండా గురు గ్రహం ప్రయాణం చేసినప్పుడు నదులకు పుష్కరాలు వస్తాయి .
కాలాన్ని ,తద్వారా మానవ జీవితాలను అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసే వి
వివిధ నక్షత్ర రాశులలో జరిగే సూర్య, గురు, శని గ్రహాల గమనం.
సూర్యుడు అగ్ని స్వరూపమైన బుద్దిని ,చంద్రుడు జల స్వరూపమైన మనస్సును ,గురు గ్రహం వాయు
తత్వా న్ని ,శని గ్రహం పృధ్వీ తత్వా న్ని ప్రభావితం చేస్తాయి .
తులా రాశి అన్నింటినీ సమానం చేస్తుంది .
శని గ్రహం కూడా యమ ధర్మ రాజు లాగా అందరికీ సమ న్యాయం అందే టట్లు చూస్తాడు .
అందుకే కర్మలతో నిండి పోయిన మానవ జీవితాల పై అత్యంత తీవ్రమైన ప్రభావం చూపుతుంది శనిగ్రహం .
కర్మ భారం తక్కువ ఉన్నవారిని ,ఆధ్యాత్మిక సాధన అనుష్టానం గా చేస్తున్న వారిని
శనిగ్రహం అంత ఎక్కువగా బాధించదు .
ఇది సూర్యుడు కన్యా రాశి నుండి తులా రాశిలోకి ప్రవేసించే సమయం .
తులా సంక్రమణం కాలంలో నే రాముడు రావణుని చంపి అయోధ్య కి వచ్చాడు .
ఇదే కాలంలో కృష్ణుడు నరకాసురుడుని చంపాడు . వామనుడు బలిని పాతాళానికి పంపాడు .
మహాకాళి రాక్షసులను పరిమార్చి దేవతలకు ,లోకాలకు మోదం పంచింది.
ఈ సంఘటన లన్నింటి లో అధర్మం పై ధర్మం జయించింది .
అనగా ప్రజలకు, లోకానికి న్యాయం జరిగింది . ధర్మం ప్ప్రతి ష్టింప బడిన చోట సంపద ఉంటుంది .
సంపదని పూజించడం అంటే గౌరవించి ప్రసాదం లా పంచు కోవడమే గానీ ,
భోశాణాలు ,ఇనప పెట్టెల్లో పెట్టు కోవడం కాదు .
సంపద సమానం గా పంచ బడిన దేశం ధర్మం తో సుభిక్షం గా ఉంటుంది .
ఇదే శ్రీ మహా లక్ష్మీ పూజ . అదే ధన తేరాస్ .
ఆర్ధిక అసమానతలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా తిరుగు బాట్లు ,తీవ్ర వాదం ,
వైరస్ ల వ్యాప్తి ఉంటుంది .
కొన్ని రకాల పనులు కొన్ని సమయాలలో మాత్రమే చేస్తే అవి సరైన ఫలితాన్ని ఇస్తాయి - ఇది రుషి వాక్యం .
కొన్ని విహిత మైన నిత్య,నైమిత్తిక మరియు కామ్య కర్మలు -ఎప్పుడు ఎలా చేయాలో సనాతన ధర్మం మనిషికి చెప్పింది .
ధన త్రయోదశి ,నరక చతుర్ధశి ,దీపావళి ,బలి పాడ్యమి,యమద్వితీయ -అనే ఈ ఐదు రోజులూ
భారత వర్షం లో ముఖ్యమైన పర్వ దినాలు .
ఆకాశం లో కదిలే సూర్య చంద్ర గమనం ,మేఘాల కదలిక,వాయు తీవ్రత ,వర్షపు రాకడ ,అలాగే మొక్కల్లో పెరుగుదల ,వనస్పతుల ,వానస్పతుల పంట లతీరు ,జంతువులలో కలిగే అలజడి ,మనుషుల ప్రవర్తనలో కలిగే మార్పులు , మనిషి చావు-పుట్టుకల తీరు -ఇలా ప్రక్రుతి లో జరిగే మార్పులకు ,మానవ జీవితానికి సంబంధాలను
కనిపెట్టి ,ఏ యే కాలా లలో ఏ విధమైన సంఘటనలు జరిగే అవకాశం ఉందో పంచాంగం ,జ్యోతిర్వేదం అనే శాస్త్రాలలో లో వివరం గా చెప్పారు మన ఋషులు .
అలాగే ఋషులు మనుషులకు ఏది భోదిం చినా,అది మూడు రకాలుగా ఉపయోగ పడే టట్లు గా చూసే వారు.
వ్యక్తికీ ,సమాజానికి ,దైవానికి -ఇలా 3 స్థాయిలలో మంచి జరిగే విధం గా చేసే ఏర్పాట్లే పర్వ దినాలు .
మనిషి కనురెప్ప పాటు(సెకన్ ) మొదలుకొని సృష్టి కర్త బ్రహ్మ జీవిత కాలం( 500 కోట్ల ఏళ్ళు) వరకు కాలాన్ని విభజించి కొలిచే విధానాన్ని కనిపెట్టారు ఋషులు .
దక్షిణాయనం , శరద్ ఋతువు , ఆశ్వీయుజ మాసం ,బహుళ పక్షం -ఇది మానవ కాలమానం .
దేవ కాలమానం ,పితృ కాలమానం అనేవి దేవతలకు ,పితరులకు సంబంధించిన కాలం కొలతలు .
మనిషికి ఓ మాసం - పిత్రు లకు ఒక దినం .
మనిషి మరణించిన తర్వాత జీవాత్మ ని చుట్టి సూక్ష్మ దేహం ఉంటుంది . దీనినే ప్రేతం అంటాం . స్థూల శరీరం ఉంటే శరీర లేదా దేహం అని అంటాము . జీవాత్మ దేహం లో ఉంటే దేహాత్మ అంటాం . అదే సూక్ష్మ శరీరం /ప్రేతం లో ఉంటే ప్రేతాత్మ అంటాం .
సూక్ష్మ దేహం ఓ విధమైన శక్తి తరంగాలతో తయారై ఉంటుంది . సూక్ష్మ దేహానికి శక్తి సమపాళ్ళలో అందితేనే మరల అది జన్మ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది . ఏ కారణం చేతైనా శక్తి అందక పోతే "ప్రేతం " సరిగ్గా బలపడక బలహీనమైన స్థితిలో అలానే ఉండి పోతుంది . దీనినే పున్నామ నరకమని వ్యవహరిస్తారు .
సంతానం చేసే శ్రాద్ధ తర్పణాల ద్వారా ఆ శక్తిని ప్రేతం అందు కొంటుంది . ఏడాది పాటు అలా సంతానం చేసే తర్పణాలు ప్రేతాన్ని శక్తివంతం చేస్తాయి . ఏడాది తర్వాత సంతానం ద్వారానే కాకుండా ఇతరులెవ రైనా శ్రాద్ధ తర్పణాలు చేసినా ప్రేతాలు శక్తిని అందుకోగలవు.
ప్రేతము భావ తరంగ శక్తి మయం.నియమ నిష్టతో సంతానం చేసే శ్రాద్ధ కర్మల వెనుక ఉన్న భావా లే వాటికి ఆహారం .
మూడు తరాల నాటివారిని పితృ లని, వారి కన్నా వెనుకటి తరాల వారిని ,ప్రాచీనులను పితృ దేవతలని వ్యవహరిస్తారు .
జన్మ నిచ్చిన తల్లితండ్రులు ,జ్ఞాన మిచ్చిన గురువులు , శాస్త్ర గ్రందాల ద్వారా వెలుగు నిచ్చిన ఋషులు ,
సూక్ష్మ స్థాయిలో రక్షణ ఇచ్చే పితృ దేవతలు , సకల సృష్టి పోషణ చేసే దైవం ---వీరందరికీ మనిషి ఋణపడి ఉన్నాడు .
మనిషి గా జన్మించిన జీవుడు , పితృ ఋణం ,దేవ ఋణం ,రుషి ఋణం తీర్చేసు కోవాలి . అలా చేయా లంటే మన కాల మానాన్ని పితృ మరియు దేవ కాలానికి సమన్వయం చేసుకొని నిర్వర్తించ వలసిన కర్మ లు చేసే రోజులే పర్వ దినాలు .
కాలానికి తగ్గట్లు గా చేయవలసిన విధులు ,నిత్య నైమిత్తిక కర్మలు చేయడ మనేది సనాతన సంప్రదాయం .
ధనం అంటే పసిడి . సిరి అంటే సంపద . సంపద కి దేవత శ్రీ మహా లక్ష్మి .
బంగారాన్ని పూజించడం అంటే, బతుకుని బంగారు మయం చేసు కోవడం.
అంటే,షాపు కెళ్ళి తాహతుకి తగ్గంత బంగారాన్ని కొనేయడం మాత్రమే కాదు .
మన సంకల్పాలు ,మన ఆలోచనలు ,చేసే పనులు బంగారం వలె ఉండాలి .
అంటే బంగారం లా శాశ్వతం గా ఉండాలి . అందరికీ ఆమోద యోగ్యం గా ఉండాలి .
బంగారం అందరికీ ఇష్ట మైన ,ఆమోద కరమైన ఖనిజం .
అంటే ఒక వ్యక్తి కే గాక సమాజం కూడా లబ్ది పొందే విధం గా ప్రతి ఒక్కరూ ఉండాలి .
పూర్వ యుగాలలో ఈ సమయం లోనే ,
బలహీనులను ,అబల లను చెర పట్టి హింసించిన నరకుడు శ్రీ కృష్ణుడి చేతిలో ,
ఒంటరిగా ఉన్న అబలను బలవంతం గా చెర పట్టిన రావణుడు శ్రీరాముడి చేతిలో శిక్షింప బడ్డారు .
లోకాలకు పుష్టి ,తుష్టి ని ప్రసాదించే శ్రీ మహా విష్ణువు -శ్రీ మహా లక్ష్మి ల కల్యాణం ,
అసురీ సంపదతో లోకాలను పట్టిపల్లార్చే దుర్మార్గులను శిక్షించే మహా కాళీ పూజ --- ఆయా సంఘటనలకు
గుర్తుగా వేడుకగా జరుపు కొంటాము .
దైవ భక్తి తో ఎంతగా పునీత మైనా గర్వం అనే దుర్గుణా న్ని అదిగ మించక పోతే
పాతాళానికి పతన మవ్వక తప్పదని బలి చరిత్ర చెబుతుంది .
అరిషద్వార్గాలతో అలముకొన్న చీకట్ల లో వివేక వైరాగ్య మనే సాధనతో భక్తి ,కర్మ లనే
విహిత కర్మాచరణ తో జ్ఞాన మనే దీపాన్ని వెలిగించు కోవాలి .
అలాగే ఆ జ్ఞాన దీపాలను అన్నింటా వెలిగించాలి , అందరికీ పంచాలి .
ధర్మానికి ,అధర్మానికి పోరు ఎప్పుడూ ఉంటూనే ఉంటది .
ధర్మ మేదో ,అధర్మ మేదో ,ఎవరు ఎన్ని తప్పులు చేశారో ,వారికే విధమైన శిక్షలు వేయాలో ,
ఏ జీవుడిని ఎలా ఎంత కాలం ఎక్కడ ఉంచాలో నిర్ణ యిమ్చే ధర్మరాజు,
"యమనియమాల" ప్రాముఖ్యత
ఎంత ముఖ్యమో సమస్త మానవాళికి గుర్తు చేసే కాలం ఇది .

Comments
Post a Comment