సత్తు ని పెంచుకో ...
ఏకం గా ఉన్న సత్య చిదానంద చైతన్యం స్వ ప్రేరణ తో శక్తి తరంగ సంపుటి ని కల్పించి రెండుగా మారి , త్రిగుణాల మేళ వింపుతో మాయా సృష్టిని ఆరంభించింది .
ఈ మాయా మోహ సృష్టి లో సత్వ -రాజస -తామస "అనే 3 గుణాలు వేర్వేరు నిష్పత్తులలో మేళ వింప బడి రకరకాల తత్వాలు సృష్టింప బడ్డాయి . ఆ తత్వాల నుండి పంచ తన్మాత్రలు ,వాటి నుండి పంచ భూత తత్వాలు ,ఇలా సృష్టి బహుధా విస్తరింప బడింది .
చైతన్యము తన శక్తితో మాయా మోహ సృష్టి ప్రారంభించిన దశలో త్రిగుణాల లోని సత్వము ఎక్కువగా ఉన్న పరామితులను(matrix or dimensions) ఊర్ధ్వ లోకాలని ,తామసం అత్యంత ఎక్కువ ఉన్న పరా మితులను అధో లోకాలని ఋషులు వర్గీక రించారు .
ఈ రెండూ కలిసి రాజస గుణం పుట్టి కర్మ క్షేత్రం గా అవతరించిన దే భూలోకం .
రాజసం అంటే కర్మ .
ఇలా మూడు గుణాల శక్తులకు మధ్యన కలిగిన ,కలుగుతున్న వైరుధ్యం సంఘర్షణకు దారితీసి అల్లకల్లోలం ఏర్పడుతుంది . సిస్టం లో సత్వ -తామస గుణ నిష్పత్తిలో విపరీత మైన తేడా నే అధర్మం అంటాము .
లోకాలు అల్లాడుతూ ఉండ ట మంటే అదే .
వ్యవస్థలో -అది ఈ అనంత సృష్టి కానివ్వండి , లేదా మన సమాజం కానీండి -సత్వ గుణం సరైన
పాళ్ళలో ఉండాలి .
ఈ 3 గుణాలు భౌతికం గా కనబడవు . వాటి ప్రభావం మాత్రమే మనం గ్రహిస్తాం . ఈ మూడు గుణాల ప్రభావం విశ్వమంతా నిండి ఉంటుంది . సమయాన్ని బట్టి ఈ నిష్పత్తి లో మార్పులు వస్తాయి . ఉదాహరణ కి సంధ్య సమయం లో తామస- రాజస గుణ ప్రభావం హెచ్చు గా ఉంటుంది . పర్వ దినాలలో సత్వ గుణ ప్రభావం హెచ్చు గా ఉంటుంది . రాహుకాలం,వర్జ్యం ,గుళిక ,యమ గండ కాలం -ఇవన్నీ తామస గుణం అత్యంత ఎక్కువ గా ఉండే సమయాలు .
సూర్యోదయ కాలానికి రెండు గంటల ముందు నుండి మొదలై సూర్య అస్తమయం వరకు విశ్వం లో ధనాత్మక /సాత్విక శక్తి తరంగాలు ఎక్కువగా ఉంటాయి .
సత్వ గుణాన్ని అభివృద్ధి చేసు కొనే మార్గమే ఆధ్యాత్మిక సాధన .
ఈ సాధన వ్యక్తికే కాదు విశ్వాని కే ప్రయోజన కారి .
సాత్వికత ని పెంచు కోవడం ఎలా ? అనగా విశ్వం లో సాత్విక గుణాన్ని ఎలా వృద్ది చేయాలి ?
సాత్విక ఆహారం -సాత్విక విహారం -సాత్విక వ్యవహారం -సాత్విక అలవాట్లు .
ఒక్క వాక్యం లో చెప్పు కోవా లంటే , నిరంతర సాధన ద్వారా కామము, క్రోధము ,లోభము, మోహము, మదము ,మాత్సర్యము -మన చిత్తము లో పెరగ కుండా చూసు కోవాలి .
ఈ 6 దుర్గుణాలు ప్రాధమిక తామస -రాజస గుణాల నుండి పుట్టినవే .
వీటిని మనస్సులో తలెత్తకుండా చేయా లంటే అహాన్ని (false identity) తగ్గించు కోవడం అభ్యాసం చేయాలి .
దైవం పై అచంచల విశ్వాసం , వివేకం ,వైరాగ్యం , సమతా భావం , శరణాగతి ,---వీటిని మన జీవనం లో
మేళ వించు కొని జీవనం సాగించడ మే ఆధ్యాత్మిక సాధనా పధం .
అంటే సన్యాసిగా మా రనక్కర లేదు . గృహస్తు గా ఉంటూ అభ్యాసం ,అనుష్టానం చేసుకో వచ్చు .
మనిషి ఏ పని చేస్తున్నా మంచి కౌశలం తో , అంకిత భావం తో చేస్తూ ఆ పనికి లేదా బాధ్యతకు పరిపూర్ణత చే కూర్చడానికి ప్రయత్నం చేయాలి . మానవ ప్రయత్నం ఆ స్థాయిలో ఉన్న ప్పుడే విశ్వ శక్తి కూడా సాయం అందిస్తుంది . పని లేదా బాధ్యత పై తపన ఉండాలి . ఆ పని వలన వచ్చే సుఖ దుఖాలపై దురాశ లేదా భయం,ఆందోళన ఉండ కూడదు .
పనిలో దైవాన్ని ,పొరుగు వాడిలో దైవత్వాన్ని ,ప్రక్రుతి పై కరుణ ను ,అభాగ్యులపై ప్రేమను ,చూపడ మే ధనాత్మక శక్తి ఆరాధన . అదే సాత్వికత . అలాంటి జీవన సాధనే ఆత్మ ఆవిష్కారానికి సరైన మార్గం .
ప్రతి విషయాన్ని ,ప్రతి మనిషినీ , ప్రతి సంఘటనను భయం, సందేహం ,ఆందోళన , ఆక్రోశం , ఆవేశం ,గర్వం - వీటితో చూడటం ఋణాత్మక శక్తి ,అనగా తామస తత్వాన్ని పెంచు కోవడ మే . అవే అసురీ శక్తులు .
మనిషి ఎప్పుడూ దేవతల పక్షాన ఉండాలి .
జీవుడి మహా ప్రస్తా నానికి అదే సులభ మైన దివ్యమైన మార్గం .... శుభం భూయాత్ .
From a spiritual perspective the purpose of a human birth is to attain God Realisation. The key difference between human beings and animals is that only human beings have developed minds and intellects that can be channeled towards sattvik activities to propel themselves towards God-realisation.

Comments
Post a Comment