రుషి ప్రోక్తం ....

అధౌ ఋషి ప్రోక్తః ..... 
(.... అని మన సనాతన ఋషులు చెప్పారు ).

శ్యప ,అత్రి, అంగీరస, భ్రుగు, దూర్వాస, వశిష్ట, విశ్వామిత్ర, మైత్రావరణ, కౌండిన్య, అగస్త్య, గౌతమ,
 యాజ్ఞ వల్క్య,వేదవ్యాస,వాల్మీకి,శక్తి,పరాశర  మహర్షులు , శుక,శౌనకాది సూత మునీంద్రులు
తదాది యోగీశ్వర శ్రీ కృష్ణుడు పెట్టిన  జ్ఞాన భిక్ష మన సనాతన ఆర్యావర్త ధర్మ పధం .

సృష్టి ,బ్రహ్మ,అధిభూతం,అధిఆత్మ,అధిదైవం,అధియజ్నం,కర్మ --- అనగా అర్ధం ఏమిటి ? 
ఈ పదాలు భగవద్ గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం లో ప్రముఖం గా వినిపిస్తాయి .
సనాతన ఆర్యావర్త  ధర్మ జీవనానికి ఒకే ఒక ప్రామాణిక గ్రంధం ఐన భగవద్గీత శ్రీకృష్ణుని ముఖతః పరబ్రహ్మ పలికిన వాణి  ....
గీత లోని కొన్ని పదాలకు సరైన అర్ధం అవగాహన చేసు కొంటే గీతా సారాన్ని మన జీవితాలకు అన్వయించు కోవడం తేలిక అవుతుంది .

ఈ సువిశాల విశ్వం కృతి (creation) కాదు . 
ఇది అవతరణ (manifestation).
విత్తు నుండి చెట్టు రావడం సృష్టి .
అదే విధం గా అవ్యక్తం నుండి వ్యక్త మయ్యే ఈ సకల లోకాలు, గ్రహ నక్షత్రాలు ,కాల బిలాల తో
ఉన్న విశ్వం నే ప్రక్రుతి అని అంటాము .
ఇలా వ్యక్త మవ్వడానినే  సృష్టి అని అంటాం .

లేనిది కొత్తగా పుట్టడం కాదు . ఉన్నదే ,కానీ అది అవ్యక్తం గా ఉన్నది . దాని ని చైతన్యం లేదా అధి దైవం లేదా పరబ్రహ్మమ్ అని పిలుచుకొందాం . ఆ చైతన్యం లో కలిగే స్పందనలే  సృష్టి  అని వశిష్ట మహర్షి ఉవాచ . ఎప్పుడైతే  ఏకం గా ఉన్న చైతన్యం లో అనేకం అవ్వాలని సంకల్పం కలిగిందో  అప్పుడే స్పందనలు ఉత్పన్న మయ్యాయి . ఈ స్పందనల నే  పరాశక్తి అని పిలుచు కొందాం .
చైతన్యం లో కలిగిన స్పందనల వలన - అనగా దైవ కర్మ వలన - ప్రక్రుతి ఉత్పన్న మవ్వడా న్నిసృష్టి   అని పిలుస్తారు .
ఆ యా స్పందనల తీరుని బట్టి రక రకాల అణువులు -తన్మాత్రలు -శబ్ద రస రూప గంధాదులు -అనేక స్థావర జంగమాలు -మనిషి ఉత్పన్న మయ్యాయి . ఈ ఉత్పన్న మైన దానినే ప్రక్రుతి లేదా అధిభూతం అని పిలుస్తారు . అలాగే ప్రతి స్థావర జంగమాలలొ నిక్షిప్త మై ఉన్న చైతన్యపు అంశ నే పురుషుడు లేదా అధిఆత్మ  అని పిలుస్తారు.

బ్రహ్మ అనగా ఏమిటి ?
క్షరం కానిది. నాశనం లేనిది . ఏదైతే సృష్టింప బడ లేదో అది నాశనం కాదు . అది అనంతం . అది అమరం .

 అనంత చైతన్యం నుండి విడివడిన జీవులు అహంకారపు మాయలో చిక్కుకొని ఎలా పరిణామం చెందాయి ?    జీవులకు కోరికలు  ఎందుకు కలుగుతున్నాయి ? జీవులలో ఉత్కృష్ట మైన జన్మ మానవ జన్మ ఎలా అయిం ది ? 

 చైతన్యం నుండి స్పందనల ద్వారా శక్తి, ఆ శక్తి యొక్క క్రియల ద్వారా ప్రక్రుతి ఉద్భవించాయి . ఆ ప్రక్రుతి లోని ప్రతి అ ణు వు లో చైతన్యం కూడా దాగి ఉంటుందని వేరే చెప్ప నక్కర లేదు . ఆకాశంలో గ్రహ నక్షత్రాలు విడివిడి గా ఉన్నా అవన్నీ ఆకాశంలో నే ఉన్నాయి . అలాగే ఆయా గ్రహ నక్షత్రాలలో కూడా ఆకాశం నిబిడీ కృత మై ఉంది . 
అలాగే ప్రతి జీవిలో,అంతే కాదు అన్ని స్థావర జంగ మాలలో చైతన్యం నిబిడీ కృత మై ఉంది .

జీవుడు  బ్రహ్మ పధం నుండి జనన-మరణ చక్రం లోనికి పడ్డప్పుడు ఆ జీవుడికి మొదట ఏమీ తెలియని మైకం కమ్మింది . ఆ మగత నిద్ర క్రమం గా ఒక కల లాగా ,ఆ తర్వాత ఆ జీవుని చైతన్యం పూర్తీ  మెలకువ దశకు చేరింది . కానీ విషయాలను తప్పు విధానం లో చూడటం మొదలు పెట్టింది . దీనినే మన వ్యవహారిక భాషలో గాడ సుషుప్తి ,కల ,మెలకువ అనే 3 స్థితులలో జీవ చైతన్యం ఉంటుందని అర్ధం చేసు కొంటాము . కానీ 4వది ఐన తురీయ స్థితే మన జీవుని గమ్యం . అనగా ఆత్మ సాక్షాత్కారం మనిషి గమ్యం . అంటే  మళ్ళీ జీవుడు ఆ అనంత చైతన్య కడలిలో అంతర్హితుడవ్వడం . 

 విశ్వం దర్పణ దృశ్య మానం ..... 
ఆ విధం గా అది దైవం నుండి విడి పడి  న జీవుని (మానవుడి) దృక్కోణం కూడా మారిందని చెప్పుకొన్నాం . 
ఆ జీవునికి  ఈ విశ్వం తనకు  బయట కనిపించడం మొదలయింది . 
నిజానికి తన లోనే ఉన్న విశ్వాన్ని , సమస్తాన్ని  అద్దం  లో చూసి నట్లు గా బయట చూస్తున్నాడు .   
విశ్వం ఒక దర్పణ దృశ్య మానం గా ఉంది . 
నిజానికి తన లోనే అన్నీ ఉన్నాయనే జ్ఞానం (ఆత్మ జ్ఞానం) పోయింది . 
సత్యం  మరచి పోయాడు .  అన్నీ బయ టే ఉన్నాయనే మాయలో చిక్కు కొన్నాడు . అందుకే ప్రతిదీ కావా లనే కోరికతో వేగి పోతున్నాడు . అన్నీ తనలోనే ఉన్నాయ నే వాస్త వాన్ని ఎప్పుడే తే మరిచాడో ఆనందం,తృప్తి కోల్పోయాడు . మళ్ళీ వాటిని పొందడానికి బయటే వెతుకుతూ వెంపర్లా డుతూ  నానా గలాభా చేస్తున్నాడు . 

జీవుడు  భగ వంతుడి నుండి విదివడినాక బయట ఉన్న వాటిని గ్రహించడానికి కొన్ని పరికరాలు  అవసర మయ్యాయి . 
అవే జ్ఞానేంద్రియాలు . శబ్ద రస రూప గందాదులను గ్రహించడానికి వాటిని ఉపయోగిస్తు న్నాడు . బయట ఉన్న వాటిని సొంతం చేసుకోవడానికి మానసం( మనస్సు ,చిత్తం , బుద్ది ,జ్ఞాపక శక్తి , ) ఉపయోగిస్తున్నాడు . బయట ఉన్న జీవరాసులు , నిర్జీవ ప్రక్రుతి  ఇవన్నీ వేరు ,తను వేరు అనే భావం గట్టి పడిన కొద్దీ  వాటిని స్వాధీనం చేసు కోవాలనే కోరిక , దానితో అరిషడ్వర్గాలు పెచ్చరిల్లడం మొద లైంది . 
కానీ నిజం చెప్పుకోవా లంటే , శబ్ద రస రూప గందాదు లే కాదు ,ఈ విశ్వంలో ఇంకా ఎన్నో ఉన్నాయి . వాటిని గ్రహించే పరికరాలు మనిషి దగ్గర లేవు . లేదా ఉన్న పరికరాలకు (ఇంద్రియాలకు )ఆ నైపుణ్యత లేదు . 

ఈ సకల చరాచర సృష్టి అంతా  అధియజ్ఞమ్ . ప్రతి పనికి కారణం ఉంటుంది . అలాగే ఈ సృష్టి క్రియా చక్రానికి ఒక కారణం(కర్మ ) , కర్త ఉన్నాయి . శాస్త్రం అంటే లెక్కలు ఒక్కటే కాదని క్వాంటం ఫిజిక్స్ చెప్పింది . ఒక పరిమితి వరకే మన లెక్కలు ,తర్కం పనిచేస్తాయి . సూక్ష్మ ప్రపంచం లో అసలైన సత్యం దాగి ఉంది . 
అందుకే లెక్కలు,తర్కానికి ఆలవాల మైన మనస్సుని నెమ్మది చేస్తే దాగి ఉన్న సత్యం అనుభూతికి వస్తుందని రుషి వాక్యం .... మనస్సు నెమ్మదిం చి అధిగ మించాలం టే ధ్యానం చేయాలి . 

అలాగే పైన వ్రాసిన దాంట్లో ఎంత నిజ ముందో తేలా లంటే ధ్యాన సాధన ఒక్కటే మార్గం ... 

Comments

Post a Comment

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి