మానుష్య ధర్మం -కోశ శుద్ది The human virtues & purification:


ధర్మ క్షేత్రాన్ని యుద్ద వేదికగా చేసుకొని అరిషడ్వర్గాలతో (basic instincts) అలమటిస్తున్న కౌరవులు , మానుష్య ధర్మానికి కట్టుబడియున్న పాండవుల మధ్య జరిగిన  సంఘర్షణే మహా భారత యుద్దం .

అర్జునుడు చిన్న నాటి నుండి , అన్న ధర్మ రాజు భోధల వలన , శ్రీ కృష్ణుని సహా చర్యం వలన ,శివ తపస్సు వలన ధర్మ సాధన లో పరిణితి పొందిన మనిషి . అలాంటి వ్యక్తీ కూడ ప్రచండ యుద్ధ పరిస్థితి లో ఎన్నో రకాల సందేహాలతో  వ్యాకులత చెంది నిర్వీర్యుడ య్యాడు .

మాయతొ (illusion ) - అంటే అరిషడ్వర్గాలతో కూడిన మానసిక స్థితిలో మనిషి  సందేహం , గందరగోళం , నిరాసక్తి , నిర్వేదం , నిరుత్సాహం తో ఉంటాడు .
మాయ -illusion  అంటే అర్ధం ?
  • illusion means twisted or false perception. illusion doesn't mean absence.
what is Dharma?
Dharma is doing those deeds - (will,thought&action) that maintain the harmony of the individual, society,country and the total nature

మనిషి ఎందుకు ధర్మంగా ఉండాలి ? 
 మానుష్య ధర్మం ఏమిటి ? 
ఈ స్రుష్టి లో ప్రతి దానికీ కొన్ని లక్షణాలు ఉంటాయి . ఆ లక్షణాలనే ధర్మాలని పిలుస్తాము . నీరు పల్లం వైపు పారటం , నిప్పు భస్మం చేయడం , గాలి వాతావరణాన్ని కాపాడటం ,భూమి జీవులన్నింటినీ పోషించడం , ఆకాశం శక్తిని ప్రసారం చేయడం - ఇవీ పంచ భూతాల ధర్మాలు .
పంచ భూతాత్మికమైన జీవులు ,అంటే - స్థావర జంగమాల ధర్మం , వాటి సంతానాన్ని ఉత్పత్తి చేసుకొంటూ పరివ్యాప్తి చెందటం.

కానీ ,తెలివి,వివేకం ,విచక్షణ , ఊహా శక్తి తో కూడిన బుద్ది ఉన్న మానవుడి ధర్మం - తనకున్న పంచకోశాలని పరిశుద్దంగా ఉంచుకోవడం , తన చుట్టూ ఉన్న ప్రక్రుతిని పాడు చేయకుండా  జీవనం సాగించడం .

 మనిషి తను ఎదిగే క్రమంలో ప్రక్రుతిని అవసరానికి ఎందుకు వాడుకోకూడదు ? తనకున్న పంచ కోశాలైన భౌతిక, ప్రాణ ,మానసిక ,బుద్ది ,ఆనందమయ శరీరాలను ఎందుకు పరిశుద్దంగా ఉంచుకోవాలి ?

చుట్టూ ఉన్న వాటిని తన ద్రుష్టిలో ,ద్రుక్పధంలో(PERSPECTIVE) చూడటం మనిషికున్న అలవాటు . పరిసరాల నుండి ,ఇతరుల నుండి వచ్చే స్పందనలకు తన ఆలోచనా క్రియను, తన ఊహా శక్తిని  ,తన వివేకాన్ని జోడించి అర్ధం చేసుకోవటం , తదనుగుణంగా వ్యవహరించడం మనషి నైజం .
ఎపుడైతే మనిషి సొంతంగా ఆలోచించడం ప్రారంభించాడో , మనిషి స్వయం నిర్ణయం ,స్వయం క్రియ లతో ఎపుడైతే  స్వతంత్రుడయ్యాడో అప్పుడే   మొత్తం ప్రక్రుతి నుండి వేరు పడ్డాడు .
ఈ విధంగా కోట్లాది మంది మనుషులు స్వయం నిర్ణయాత్మకంగా ఉన్నప్పుడు ,అనేక ఇబ్బందులు ,పోరాటాలు , శ్రుతి మించి యుద్దాలు వీటి వల్ల మొత్తం సంఘమంతా అల్లకల్లోలమవుతుంది .సంఘం ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని కట్టుబాట్లు ,నియమాలు మనుషలందరూ పాటించాలి .ఈ నియమాలే మనిషి ధర్మాలు .

అంటే ప్రక్రుతిలోని మిగతా జీవులన్నీ వాటి వాటి అవకాశాలకనుగుణంగా వర్ధిల్లటమే ధర్మంగా ఉంటే , సొంత నిర్నయాత్మక శక్తి ఉన్న మనిషి మాత్రం , ఇతర మనుషులనుండి  అపకారం రాకుండా , అలాగే మనుషులకూ మనుషులకూ యుద్దాలు రాకుండా ఉండటానికి , సంఘం ప్రశాంతంగా వ్రుద్ది చెందటానికి ధర్మంగా ఉండాలి .
అంటే తన శాంతి , సంఘ శాంతి మరియు విశ్వ శాంతి  కోసం మనిషి ధర్మం గా ఉండాలి .
మనిషి   జీవనోపాధికి , జీవిత పరమావధి కి - వ్యక్తి  శాంతి , సంఘ శాంతి ఎంతో అవసరం .ఈ   ధర్మ సాధనకు  కోశ శుద్ది అత్యవసరం .  

కోశ శుద్ది :
purification of body,mind,intellect & prana:
సరైన ఆహారం ,మంచి నీరు ,గాలి ఉంటేనే శరీరం ఏ రోగమూ లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది .
ప్రాణ శక్తి సరిగా అందాలంటే మనిషి పని చేయాలి .ప్రతి కణమూ ప్రాణ శక్తిని అంది పుచ్చుకోవాలంటే రక్తం ,దానితోపాటు పోషకాలు , ప్రాణ వాయువు సరిగ్గా ,ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా అవుతూ ఉండాలి . అలా జరగా లంటే మనిషి పని లేదా వ్యాయామం లేదా హట యోగం చేస్తూ ఉండాలి .
మనస్సు ఇంద్రియాలనుండి వచ్చే సమాచారానికి స్పందించడం వల్ల ఆలోచనా తరంగాలు పుడతానే ఉంటాయి . స్పందనలను నియమితం చేసుకొంటే ఆలోచనలు తగ్గుతాయి . ఇంద్రియాల సమాచారం వస్తూనే ఉంటుంది. కానీ దానిని విశ్లేషించక అలా నిమిత్తంగా ఉండిపోవటాన్ని సాక్షీ భావం లేదా స్పందన లేకపోవటం అంటాము . 
కానీ మనిషిలో కోరికలు (రాగ ద్వేషాలు ) నిరంతరం పుడతం వల్ల , వాటిని తీర్చుకోవటానికి మనిషి ఇంద్రియాలమీద ,వాటి ద్వారా స్పందనలు , ఆయా స్పందనలను తనకు ( అహం ) ఆపాదించుకొని అనుభూతి (సుఖం ,కష్టం ) చెందటం -ఇదీ సగటు  మనిషి ముఖ చిత్రం .
మరి మనస్సు శుద్ది అవ్వాలంటే స్పందనలు క్రమంగా తగ్గుతూ పూర్తిగా పోవాలి . అపుడు మనస్సు ప్రశాంతతను అనుభూతిస్తుంది . స్పందనలు తగ్గాలంటే కోరికలు తగ్గాలి . అంటే రాగమూ ,ద్వేషమూ తగ్గాలి .
రాగమంటే  - ఇష్టం , జీవించాలని ,సుఖంగా ఉండాలని , అదీ ఇదీ కావాలని ,తను ప్రకటింపబడాలని 
ద్వేషమంటే - అయిష్టం , పోల్చుకోవడం ,తనే గొప్పగా ఉండాలని ,అన్నీతనోక్కడికే  ఉండి  ఇతరులకు లేకుండా  చేయడం , ప్రక్రుతి ని చెడగొట్టడం ...
మనిషిలో రాగమూ ,ద్వేషమూ కలబోసుకొని యుంటాయి . ఈ రాగ ద్వేషా లనే ద్వంద ప్రవ్రుత్తి వల్ల అరిషడ్వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆవ్రుత్తులు చిత్తంలో  పుట్టి ,అవే  కోరికలై , తద్వారా ఆచరణ , అనుభూతి కలుగుతాయి .
ద్వేషానొక్కటే కాదు ,రాగాన్ని కూడ పూర్తిగా లేకుండా చేసుకొంటే కోరికలు లేని వైరాగ్య స్థితి వస్తుంది .
రాగ ద్వేషాలను గుడ్డిగా అణ చివేయటం సాధ్య పడినా అది మంచి పద్దతి కాదు . రాగ ద్వేషాలను వివేకంతో ,విచక్షణతో మాత్రమే  సంపూర్తిగా  అదుపులో ఉంచుకోవచ్చు. అదీ నిరంతర అభ్యాసంతో సాధ్య పడుతుంది .
రాగ ద్వేషాలను ప్రాపంచిక విషయాల నుండి దారి మళ్ళించి , దేవుని పైన పెడితే భక్తి అంటాము . అహం లేని సేవ మీద పెడితే నిష్కామ కర్మ యోగమని అంటాము,
మనిషి తనకున్న రాగ ద్వేషాలను నేను ,నా కుటుంబం ,నా కులం , నా వర్గం అనే సంకుచిత స్థాయి నుండి  విశ్వ స్థాయికి  పరిధి పెంచుకోవటమే  మానవ పరిణామం .

ఒట్టి వైరాగ్యం కన్నా ,వివేకంతో (బుద్ది ) కూడిన వైరాగ్యం మానసిక , బుద్దిక  కోశాన్ని శుద్దం చేస్తాయి .

కారణ శరీర శుద్ది : మన పుట్టుకకు కారణమైన కారణ శరీరం తర తరాల  జన్మల నుండి మోసుకొస్తున్న సంచిత ,ప్రారబ్ద కర్మలను పూర్తిగా భస్మం చేసుకొని శుద్ది పొందితే కారణ శరీరం లేకుండా పోతుంది .

 కర్మలను ఎలా భస్మం చేయాలి ?
ఒకే ఒక్క మార్గం ,ధ్యానం . ధ్యానమంటే విస్తారం చేయబడ్డ ఎరుక . పూర్ణ విశ్వాసం .సంపూర్ణ శరణాగతి . నదిలో నీళ్ళు సుడులతో వడివడిగా పారుతూ ఉన్నా నది ఒడ్డు నిర్వికారంగా ఉంటుంది . నిత్యం సాక్షీ భావం తో  మెలకువతో మెలగటమే ధ్యానం . ఇది కొద్ది నిమిషాలపాటు చేసి వదిలేసేది కాదు . మన జీవనంలో నిత్యమూ మమేకమై  ఉందే అనుభూతి . కర్మలన్నీ పరిపాకమై పూర్తిగా నిర్మూలనం చెందే వరకు ధ్యాన జీవనం తప్పనిసరి . 

భౌతిక సుఖాలను త్రుణ ప్రాయంగా భావించే వైరాగ్య స్థితి స్థిరంగా ఉన్నప్పుడే ధ్యానం అనేది ఒక పనిలా కాక అదే జీవనంగా మారుతుంది .
ఈ విధంగా కారణ శరీరం కూడ పూర్తిగా శుద్దీకరణ చెందితే మిగిలిన ఆనందమయ కోశం అనంతంలో ఎలాంటి పొరలూ అడ్డు లేకుండా కలిసిపోతుంది . అనంత మైన ఆనంద సాగరంలో ప్రతి జీవి 
ఆనంద శరీరం ఓ అల .

ఆనంద కోశం స్థిర శక్తి . దాని చుట్టూ ఉన్న ఇతర కోశాలు గతి శక్తితో ఉంటాయి .
శివ లింగం స్థితి శక్తికి నమూనా . అంతర్లీనమూ పరివేష్టించీ ఉన్న పార్వతి గతి శక్తికి నమూనా .
శ్రీ చక్రం విశ్వ స్థితికి నమూనా . బిందువు నుండి స్రుష్టి  వ్యాప్తి చెందుతూ రకరకాల స్థాయులలో ఏ విధంగా ఉంటుందో చూపించే నమూనా.

శుద్దీకరణ అంటే ఏమిటి ?
ఖనిజ బంగారాన్ని కాలిస్తే చుట్టూ ఉన్న మలినాలు పోయి  నిజమైన బంగారం బయట పడుతుంది .
ఓషధులను ,ఖనిజాలను వాటి నిజ స్వరూపాలు బహిర్గతం చేయటానికి వేడి చేస్తాము .
అంటే వేడి లేదా కాల్చుట వలన వాటి వాటి నిజ స్వరూపాలు ,నిజ స్థితులు బహిర్గతం అవుతాయి .
పంచ భూతాలతొ ఉన్న మన భౌతిక శరీరం నిజ స్థితి కాస్త బూడిద ,నిప్పు లేదా వేడి ,కొంచెం నీటి ఆవిరి  .
మనో కోశం ఆకాశం ( ధ్వని ) లో కలుస్తుంది .
ప్రాణ కోశం  అగ్ని లో కలుస్తుంది .
ఆనంద కోశం కాంతి లో కలుస్తుంది .
Purification removes the illusory veil and thus  
reveals the total true  reality...

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి