what is the purpose of yaga /homam ?
కర్మలు అనగా సంధ్యావందన, బ్రహ్మ యజ్ఞం , దే వతార్చన , పి తృ తర్ప ణా ది నిత్య నైమిత్తిక కర్మలు
తర్పణములు చే యవలను.
--------------------------
పూజా ప్రారంభం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం -అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే
శ్లో. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా(వినాయకుని ధ్యానించవలెను).
(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-)
శ్లో||అపవిత్రః పవిత్రోవా
సర్వావస్థాం గతోపివా|
యస్మరేత్ పుండరీకాక్షం
సబాహ్యాభ్యంతరస్శుచిః||
ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః
(అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో - ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను)
దీపం
ఓం గురుభ్యో నమః
దీపమును వెలిగించి - గంధ పుష్పాదులతో అలంకరించి - దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.
దీప శ్లోకం :
ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ
భూమాత ,గణపతి,గోత్ర ఋషి పరంపర ,తల్లితండ్రులు,ఇష్టదైవం,గురువుల అనుమతి తీసుకొని హోమం చేయాలి.
ఓం బుధ్యాస్మ హవ్యై ర్న మ సోపసద్య
మిత్రం దేవం మిత్ర ధేయం నో అస్తు
అనూరాధన్ హవిషా వర్ధ యంత
శతం జీవేమ శరద : సవీరా
ఆచమన కేశవ నామములు
- ఓం కేశవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
- ఓం నారాయణాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
- ఓం మాధవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
- ఓం గోవిందాయ నమః (అనుచు - ఎడమ చేతిని కుడి అరచేతితోను)
- ఓం విష్ణవే నమః (అనుచు – కుడి చేతిని ఎడమ అరచేతితోను కడుగుకొనవలెను)
భూతోచ్ఛాటనము
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
శ్లోకము చదివి - అక్షతలు కొన్ని వాసన చూసి ఎడమచేతి ప్రక్కనుండి వెనుకకు వేసుకోవాలి.
అథః ప్రాణాయామః (కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి)
ఓం భూః, ఓం భువః , ఓగ్0 సువః, ఓం మహః ఓం జనః, ఓం తపః , ఓగ్0 సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం, (మూడు సార్లు జపించవలెను)
అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకొనవలెను
సంకల్పము
ఓం
మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిస్య,శ్రీ పరమేశ్వర
ప్రీత్యర్ధం శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య
అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత
మన్వంతరే,కలియుగే,ప్రథమపాదే జంబూద్వీపే,భరతవర్షే, భరతఖండే,
మేరోర్దక్షిణదిగ్భాగే,కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర
దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక
చాంద్రమానేన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) అయనే (ప్రస్తుత
ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి)
తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత
యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ,శ్రీమాన్
(మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య
అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి
వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం,
ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల
కార్యవిఘ్ననివారణార్ధం, సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః
ఉపచారైః సంభవితా నియమేన, యావచ్ఛక్తి, శ్రీ మహా గణాధిపతి దేవతా
ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే...
అంటూ అక్షతలు ఉదకం పళ్ళెంలో విడువవలెను.
కలశపూజ
కలశం,
అంటే గంధము, కుంకుమతో అలంకరించిన నీటి పాత్ర, కు అక్షతలు, పుష్పము వేసి
ఎడమ అర చేతితో కింద పట్టుకొని కుడి అరచేతితో పైన పట్టుకుని
తదంగ కలశ పూజాం కరిష్యే...
శ్లో. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు శ్రీ మహా గణాధిపతి పూజార్థం దురితక్షయ కారకాః
(కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ) పూజాద్రవ్యాణి (దేవుడి మీద చల్లి ) దేవం (తమ మీద చల్లుకుని) ఆత్మానం సంప్రోక్ష్య.
ఓం బ్రహ్మణే నమ
ఓం యమా య నమ ఓం సోమాయ నమ ఓం రుద్రాయ నమ ఓం విష్ణవే నమ ఓం ఇంద్రాయ నమ
ఓం భూర్భువ స్సువః రోమ్
అపవిత్రమైన అగ్ని ( క్రవ్యం ) పవిత్రమై న (జాతవేద) తర్వాత మాత్రమే దేవతలకు హవిస్సును అందించ గలదు. అగ్నిని ఇలా ప్రార్ధన చేయాలి-
క్రవ్యాద అగ్నిమ్
తర్వాత నెయ్యి వేసి ఈ క్రింది మంత్రం పఠిస్తూ అగ్నిని సంస్కరించాలి.
ఓం భూర్భువస్సువః స్వాహా||
మంత్రాధీనం దేవా .
అగ్ని ముఖం దేవా .
We say "na mama" (not mine) when we offer any material in the sacred fire. Such an oblation is consumed by Agni and conveyed to the celestials invoked. It is thus that they obtain their sustenance. In this way we also propitiate our fathers(pitrs), those belonging to our vamsa or clan. The Vedas contain directions about how rites meant for pitrs are to be performed.
Comments
Post a Comment