గురుకులమ్

విలువలతో కూడిన విద్య .
ఋషులు ,మునులు ,సద్గురువులు మన సనాతన ధర్మ సారధులు.
గురుకుల ఆశ్రమ విద్యార్ధులు మన వారధులు .
ఎలా జీవించి ,సమాజాన్ని బతికించాలో ఆ నాడు చెప్పేవారు .
నేడు , జీవితం అటుంచి , ఎలా ఉద్యోగం చేయాలో కూడ చెప్పలేక పోతున్నారు .
సాంకేతిక విద్య అందరికీ అందుబాటు లో కొచ్చింది . రకరకాల వృత్తులు ఏర్పడ్డాయి .
సేవా రంగం ,కళా రంగం, వినోద ,సమాచార మాధ్యమం అత్యంత వేగం తో మనిషిని చుట్టెస్తున్నాయి .
ఇవన్నీ ఇంతలా అభివృద్ధి చెందటం మంచిదే .కానీ, ఉత్పత్తి రంగం కునారిల్లుతోంది . సమతుల్యత పోయింది .
ఉన్న భూమికి ,పెరిగే జనాభాకు లంగర్ అందటం లేదు .
-ఖనిజ సంపద, అడవులు, నదులు, చెరువులు - అన్నీ పూర్తిగా ఆక్రమించ బడి ప్రక్రుతి
క కా వికలమై పోతుంది .
వ్యక్తీ , వ్యష్టి (సంఘం) ప్రశాంతం గా ఉండా లంటే మనిషి ఎలా ఉండా లో వేర్పేది అసలైన విద్య .
ఆ రెండూ శాంతి గా ఉన్నప్పుడే ఉత్పాదకత పెరిగి సంపద ,ఆరోగ్యం ,జీవన ప్రమాణం పెరుగుతుంది .
కనుక నే ,ఆ కాలం లో మనిషికి అది భౌతిక , అది ఆత్మిక ఆలోచనలు కలిగి తత్వ దర్శ నాలు ,
తద్వారా ఆత్మా దర్శ నం అనే ఆవిష్కరణలు జరిగాయి .
Comments
Post a Comment