గో రక్షణ

స్వస్తి ఫ్రజాభ్య: పరిపాలయంథాం|
న్యాయేన మార్గేన మహీం మహీశా:||
గోబ్రాహ్మణేభ్య : శుభమస్థు నిత్యం |
లోకా సమస్తా :స్సుఖినో భవంతు:||

సనాతన భారతావని లో ఆవు కు  ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు ?

ఆవు గొప్ప తనం గురించి , ఆధ్యాత్మిక పరం గా ఎన్నో విషయాలు వేదం, పురాణాలు
చెప్పినా నేటి కాలానికి అవి నమ్మకం కలిగించ లేవు . అందుకే సామాజిక పరం గా ,ఆర్ధిక పరం గా ,
మనిషి జీవన పోషణ పరం గా చూద్దాం .

 సంస్కృత భాష లో భూమిని కూడ గోవు' అని పిలుస్తారు .
పూర్వం , మనిషికి ముఖ్య జీవనోపాధి పశుపోషణే .ప్రజల సంపద అంతా  జీవాల రూపం లో  అంటే -
 ఆవు, గొర్రె ,మేక, గుర్రం -ఇలా ఉండేది .
ఆ తర్వాత వ్యవసాయం  , ఖనిజ సంపద ని వెలికి తీయడం ,అడవుల సంపద ని
 విచ్చల విడిగా వాడు కోవటం జరిగింది .
ఆవు ,దాని సంతానం మనిషి జీవన పరిణామంలో పెనవేసుకు పోయింది .
పాలు ,పెరుగు,నెయ్యి ,మజ్జిగ తదితర ఆహారాన్ని ఇచ్చేవి ., పొలంలో దుక్కి ,బండి లాగుట  మొదలగు వ్యవసాయ  పనులను చేసేవి .
వాటి మల మూత్రాలు ఎరువుగా ,ఇంధనం గా ఉపయోగ పడేవి .
మిగతా జంతువులకు ,గోసంపద కు ముఖ్యమైన తేడా - గోవులు సాదు జంతువులు .
మచ్చిక చేసుకొని ఉపయోగించు కోవడం కడు సులభం .

సనాతన భారతీయులు అత్యంత కృతజ్ఞతా భావం తో ఉండే వారు . వారి హృదయం అత్యంత
 సున్నితంగా ఉండి ప్రతి చిన్న విషయానికి స్పందించేది .
వారికి ఉపయోగ పడే ప్రతి దానినీ , అలాగే భయపెట్టే ప్రతి విషయాన్ని  -
రాయి ,రప్పా (ఆయుధం); చెట్టు ,చేమ ( నీడ ,ఆహారం );
కొండా ,కోన ( రక్షణ ); గోవులు , నిప్పు ,నీరు ,మెరుపు ,ఉరుము,
నదీ నదములు ;వాగు ,వంకలు ; పాము,పులి,ఏనుగు  - వీటన్నింటినీ భక్తీ తో లేదా
 భయం తో పూజించే వారు . వాటిని పవిత్రం గా చూసు కొనే వారు .
ఆ కాలము అయినా , ఈ  కాలంలో అయినా, అతి తక్కువ పోషణ తో అత్యంత విలువైన
వాటిని ఇచ్చే మచ్చిక జంతువులలో  ఆవు ని మించినది లేనే లేదు . ఆ తర్వాతే  గుర్రం .
ఇంకో విషయం - సూర్య శక్తిని, చంద్ర శక్తిని రెంటినీ గ్రహించి ఇముడ్చు కొనే ప్రాణులలో
మనిషికి అందుబాటు లో ఉన్న జంతువూ ఆవు ఒక్కటే  . కొన్ని ఓషధులు మాత్రమే రెండు
రకాల శక్తులను శోషిం చు కొంటాయి .
అందుకే, భూమిని ,భూ సంపదని ,గోవుని, వాటి సంతానాన్ని అంత  గా కాపాడు కొనే వారు .
దేశం ,ప్రజలు సుఖం గా ఉండాలంటే , న్యాయ మార్గం లో ఉన్న మహారాజులు , ధర్మాన్ని అనుష్టానం చేసే   బ్రాహ్మణులు (సద్గురువులు ) ,
మంచి ఆరోగ్య వంత  మైన గో సంపద ఉండాలి .
కనుకనే ,వేదం మనిషికి కేటాయించిన ప్రాధమిక భాద్యత లలో 
అత్యంత ముఖ్య మైనది గో రక్షణ .ఆ తర్వాత భూ రక్షణ,స్త్రీ రక్షణ,
జల రక్షణ ,వృక్ష రక్షణ .. 
ఇదే సనాతన ధర్మం .
అందుకే , భారతీయం అంటే కడు కృతజ్ఞతా భరిత జీవనం.

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి