సర్వమూ స్పందన మయం

 కణాద మహర్షి ,భౌతిక వస్తువులని విభజించు కొంటూ చివరకు ఇంకా విభజించ సాధ్యం కాని కణం గురించి చెప్పాడు .
అలాగే,కపిల మహా ముని సాంఖ్య శాస్త్రం లో ప్రాణుల,ముఖ్యం గా మనిషిలో ఉన్న విభూతులను అనేక తత్వాలుగా విభజించారు .
పంచ భూతాల కలయికతో ఏర్పడిన -శరీరం ,ఇంద్రియాలు ,అంతః కరణం ,బుద్ది , ప్రాణం -ఇవన్నీ అపరా ప్రక్రుతి అని , జీవాత్మ పరా ప్రక్రుతి అని వ్యవహారికం గా చెప్పారు .

అంతః కరణం ,బుద్ది, ఆలోచనలు ,కర్మలు --- ఇవన్నీ కూడా మూడు గుణాల ద్వారా 3 విధాలుగా ఉంటాయని తేల్చారు . అవే సాత్విక ,రాజసిక, తామసిక విధాలు .

 వేర్వేరు స్థాయిలలో ఉన్న స్పందనలే గుణాలు .
కనపడే ఈ విశాల విశ్వం అంతా వివిధ రకాల స్పందనల లో ఉన్న శక్తి .

ఎలాంటి స్పందనలు లేక సమ స్థితిలో(static potential) ఉన్న చైతన్యం లో ముందుగా ప్రకాశం ఆ తర్వాత స్పందనలు(vibrations) ,ఆ స్పందనలు ఎన్నో లక్షలు,కోట్ల విధాలుగా సమీకరణం(combinations&permutations) చెంది  వ్యక్త (manifestation) మవ్వడమే సృష్టి .
కపిల మహర్షి స్పందనలను స్థూలం గా 3 విధాలుగా వర్గీకరించాడు .
అవే -సాత్విక ,రాజసిక ,తామసిక స్పందనలు .
 శరీర స్థాయిలో ,మానసిక ,కారణ ,స్థాయిలో కూడా ఈ స్పందనలు 3 రకాలుగా  ఉంటాయి .
పిత్త  ,కఫ ,వాత ములుగా శరీర స్థాయిలో ;
సాత్విక ,రాజసిక ,తామసిక గుణాలుగా అంతకరణ స్థాయిలో ;(consciousness, agitation, or inertia).

ఈ సకల చరాచర సృష్టి గతి శీలం . 
మనిషి చేసే ప్రతి కర్మ స్పందనలు కలుగ చేస్తుంది . ఏ కర్మ చేసినా సాధ్య మైనంత తక్కువ స్పందనలు కలుగ చేయడం మనిషి లక్ష్యం . 
మంచి చెడు అనేవి స్పందనల్లో తేడా నే . పాప పుణ్యాలు అంతే . 

యజ్ఞము ,తపస్సు , దానం ,కర్తవ్య కర్మలు , సకామ కర్మలు ,నిష్కామ కర్మలు ,త్యాగం , - ఇవన్నీ కూడా 3 విధాలుగా ఉంటాయి .
శ్రద్ద , ఓర్పు,విశ్వాసం , కర్తవ్య కర్మాచరణ ,సాత్విక దానం ,సాత్విక యజ్ఞం ,సాత్విక తపస్సు ,నిష్కామ కర్మలు , కర్త్రత్వ భావన లేకుండా విహిత కర్మాచరణ , భగ వంతుని పై సంపూర్ణ సమర్పణ ,నామ రూప సంకీర్తన , --- ఇవన్నీ ప్రతి మనిషి చేయ వలసిన విధులు ,ప్రతి మానవుడు నడవ వలసిన జీవన పధం .

సాధనా పద్దతులు - స్వాధ్యాయం , తపస్సు ,జ్ఞాన విచారణ ,జపం - ఇవన్నీ కర్త్రత్వ భావం లేకుండా , కర్మఫలాసక్తి లేకుండా చేసినప్పుడు ,అహం ని తగ్గించి తద్వారా మనస్సులో ని స్పందనలను నెమ్మదింప చేసి క్రమంగా  శూన్యం చేస్తాయి .
ఆ శూన్య స్థితికి చేరితే ఆత్మానుభవం సిద్దిస్తుంది .

Comments

Post a Comment