సనాతన ధర్మం

The eternal cosmic law:సనాతన ధర్మం
సనాతన ధర్మం అంటే అది ఏదో భారత దేశానికి ,హిందూ మతానికి  సంబంధించిన వ్యవహారం కాదు . అది ప్రక్రుతి మరియు పురుషుని అనగా దైవానికి సంబంధించిన మార్చ లేని సూత్రం . పదార్ధానికి గురుత్వ ఆకర్షణ ఉండటం ఎంత నిజమో ఇదీ అంతే .
సూర్యుడు మన పాల పుంత నాభి చుట్టూ ప్రదక్షిణం  చేస్తుం టే ,ఆ సూరుని చుట్టూ భూమితో పాటు సౌర కుటుంబ గ్రహాలూ పరిభ్రమిస్తున్నాయి . అదే విధం గా సనాతన ధర్మం మన సృష్టికి ఆలంబన గా ఉంది .

గ్రహాల కదలికల గురించి , వస్తువుల పై పడే బలాల గురించి   కెప్లర్ ,న్యూటన్ సూత్రాలు ఎలా మనం మతాలకు అతీతం గా చెప్పు కొంటున్నా మో , సనాతన ధర్మ సూత్రాలూ అంతే .
1. దైవం లోని 99% అవ్యక్తం గా ఉండి ,కేవలం  1% విభూతి నుండి సకల చరాచర విశ్వ ము వ్యక్త మయ్యింది . వ్యక్త మైన విశ్వం 3 గుణాల కలయిక . అవ్యక్త చైతన్యం త్రిగుణా తీతం .
2. అనేక రూపాలలో ,వివిధ నామాలతో గుళ్ళలో ,ఇళ్ళలో పూజలు,వ్రతాలు ,క్రతువులు , కాండలు ,తంత్రాలు ,జపము ,తపము ,యజ్ఞము ,దానము చేసినా అహం కరగక పోతే  ఆత్మ పరమాత్మ ఒక్కటే అనే స్థితి కి చేరు కో లేరు . సాత్విక భావం తో(ఎలాంటి అహము లేకుండా )  దైవానికి సంపూర్ణ శరణాగతి చేస్తే మనిషి ఆ దైవం లోనే కలిసి పోతాడు .
3. ప్రతి ప్రాణి , అలాగే  ప్రాణం లేని ప్రతి వస్తువూ దైవ మే . కానీ ఆ సత్యం ఎరుకలోకి తెచ్చు కొనే సామర్ధ్యం ఒక్క మానవుడి కే ఉంది . సాధన చేస్తే  మనిషి లొని జీవుడు శివుడు కాగలడు .
4. సంసార చక్రం -జనన మరణ చక్రం ప్రతి జీవికి ఉంటాయి .ఈ సంసార చక్రం నుండి తప్పుకొని అద్వైత సిద్ది పొందడానికి ఆత్మ జ్ఞానం , అదే బ్రహ్మ విద్య అవసరం .
5. సృష్టి లో ప్రతీది స్పందనలో ఉంటుంది . పౌన పుణ్యమే -(frequency) తేడా .  ఈ స్పందనే పదార్ధ స్థితి ని బట్టి భ్రమణ ,పరిభ్రమణం గా ఉంటుంది . మనిషి కేవలం 3 మితులలోనే(3 dimensional) ఈ స్పందనల రూపాన్ని చూస్తున్నాడు . కానీ 14 మితులలో చూసే అవకాశం ఉందనేది  సత్యం .శక్తి ఎన్నో రూపాలలో ప్రకటిత మైనా మూల శక్తి ఒక్కటే .
6. వాక్కు ని అంటుకొని అర్ధం ఎలా ఉంటుందో , ప్రక్రుతి -పురుషుడు , పదార్ధము - శక్తి అలానే ఉంటాయి .
7. పదార్ధము -శక్తి నిత్యమూ ,అమరము . నాశనము లేనివి .ఆది అంతము లేనివి .
8. ఈ సకల సృష్టి పూర్ణం(zero) నుండే వచ్చింది . సృష్టి కూడా పూర్ణమే . అనగా పూర్ణం నుండి పూర్ణం వచ్చినా మార్పు లేదు . పూర్ణము పూర్ణమే .
9. చర్యకి ప్రతిచర్య ఉంటుంది . చేసే పనులు,మాట్లాడే మాటలు ,చిత్తం లోని సంకల్పాలు ,మనస్సులోని ఆలోచనలు - ఈ కర్మల న్నిం టికీ  "ప్రతి కర్మ" ఉంటుంది .
10. సాత్విక విధానం లో  కర్మలెన్ని(యజ్ఞ ,దాన ,తపస్సులు ,త్యాగం ,సేవ -కర్మయోగం ) చేసినా , సాత్వికం గా భక్తి యోగం చేసినా ఆద్యాత్మిక వృద్ది ద్వైత సిద్ది కలుగుతాయి గానీ , జ్ఞాన యోగ -ధ్యాన యోగం ద్వారా నే కూట స్తానికి చేరుకొని అక్కడ నుండి సహస్రారానికి ఎదిగి అద్వైత స్థితి పొందుతారు .

మనకు తెలిసిన చరిత్రలో ఎన్ని మతాలూ వచ్చాయో ,అవన్నీ పైన చెప్పుకొన్న సనాతన ధర్మ సూత్రాల లోని  కొన్నింటి పై  ఆధార పడి  వ్యాపించిన వే .
సనాతన ధర్మ సూత్రాలు మతాలకు , సంప్రదాయాలకు అతీత మైన అసలైన సత్య మైన జ్ఞానం . పుట్టిన ప్రతి బిడ్డా చిన్న వయస్సు నుండి తెలుసు కోవలసిన ,సాధన చేయవలసిన (జీవనానికి అన్వయించు కోవడం ) విద్య .
ఇది ప్రతి స్కూల్ ,కాలేజీలలో నేర్ప వలసిన అఖండ జ్ఞానం .
 ఋషులు చెప్పినా ,మరొకరు చెప్పినా నిజాలను నిగ్గ దీసే సామర్ధ్యం పిల్లల్లో రావాలీ అంటే , ఈ విజ్ఞానం సంస్కృత భాషలో ఉంది కాబట్టి ప్రతి బిడ్డా సంస్కృతం నేర్చు కోవాలి . ప్రాంతీయ సంకుచిత్వాలు వదిలేసిన నాయకులే  మనకు నేడు కావాలి .

Comments

Post a Comment

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి