సావన్ కో ఆనే దో

దక్షిణాయనం,అనగా పొడుగు రాత్రులు ,పొట్టి పగళ్ళు ఉండే సమయం .
 అలాగే మనుషుల్లో నకారాత్మక దృక్పధం పెచ్చరి ల్లె కాలం.

ఉపాసకులు  దీక్షలు పట్టే  చాతుర్ మాసకాలం  లో శ్రావణ మాసం మొదటిది .
దీనితోనే చాతుర్ మాస దీక్ష , సోమవార ఉపవాస దీక్ష కూడా ఆరంభ మై  ఈ 4 నెలలలో మొత్తం 16 సోమ వారాలూ ఉపవసిస్తారు ఉపాసకులు .
శ్రావణ లో  వర్షాలు బాగా పుంజు కొంటాయి . కొత్త నీరు వలన కామెర్లు, విరోచనాలు మొదలైన నీటి సంబంధ వ్యాధులు వ్యాపిస్తాయి .
అన్ని జంతువులూ సంతానోత్పత్తి లో నిమగ్న మై ఉంటాయి .
ఈగలు,దోమలు విపరీతం గా పెరిగి అంటు వ్యాధుల వ్యాప్తికి హేతువు అవుతాయి .
ప్రజలలో రోగ నిరోధ శక్తి కూడా బాగా తక్కువ ఉంటుంది . అందుకే ఈ మాసం లో జంతు వధని,మాంస భక్షణ ని  నిషేధిం చింది సనాతన ధర్మం .

శ్రావణ మాసం లో నకారాత్మక దృక్పధం(negative mentality) ఉధృతమై ,మనుషులు కామ ప్రకోపం , ఇంకా నానా రకాల కోరిక లతో ఉక్కిరిబిక్కిరి అవుతారు . కాబట్టి , మనస్సు కుదురు గా ఉండ టానికి వ్రతాలు,ఉపవాసాలు ,పూజలు ప్రతిరోజూ చేయ వలసింది గా సనాతన సంప్రదాయం చెబుతుంది . 

Comments

Post a Comment