Expand the Horizons.

మీరు గమనించే ఉంటారు ,ఆలోచన చేయా లన్నా , ఆలోచనలను ఆపా లన్నా మనకున్న ఏకైక ఆయుధం -మనస్సే . 

మనిషి మనస్సులో రోజుకి సుమారు 60000 ఆలోచనలు పుడతాయి. వాటి క్రమం ఇలా ఉంటుంది.  
వాసన(instinct) - సంకల్పం(will) -ఆలోచన(thought) -వివేక విచక్షణలు (intellect &discrimination)- కార్యాచరణ(execution).

మనిషికి మనస్సే - బంధనం. 
 మాయ కి ఉతమిచ్చేది ,చేధించే ది మనస్సే . 
మూలాధార శక్తి అనేది మనిషి కి ఉన్న అద్భుత అవకాశం . 
ఆ శక్తిని అధోముఖంగా , అనగా ప్రాపంచిక విషయ వాసనలకు ఆజ్యం గా ఉపయోగిస్తే కలిగే పరిణామాలు మనందరికీ తెలుసు . 
అదే శక్తిని ఊర్ధ్వ ముఖం గా ఉపయోగిస్తే మన చైతన్యం క్రమేణా విస్తరింప బడి పరమ చైతన్యం లో మిళిత మవుతాము . 

అంటే మనిషి ప్రాణం లేని జడ పదార్ధం లాగా ఉండాలా ? 
అలా కాదు . అన్ని పనులు చేయాలి . అన్ని సంఘటనలను అనుభవించాలి . 
మన చైతన్యం ప్రాపంచిక స్థాయికి పరిమిత మైనప్పుడు ద్వంద తత్త్వం- (రాగ ద్వేషం- సుఖ దుఖం ) ఉండటం వలన ఆయా సంఘటనల నుండి ఉత్పన్న మయ్యె స్పందనలు - బాధ,సంతోషం -అనుభవిస్తాము . 
ఎప్పుడైతే చైతన్యం విస్తరించి ఆత్మ స్థాయికి చేరిందో ద్వంద తత్త్వం ఉండదు కావున బాధ,సంతోషం అనుభూతికి రావు . 
అందుకే చైతన్యం పరిణామం చెందని సాధకులు ద్వందాలకు అతీతులు కాలేక ఆధ్యాత్మిక అనుభూతులను ప్రాపంచిక విషయాలకు ఖర్చు చేస్తారు . అనుభూతులను కూడా సరిగ్గా అర్ధం చేసు కోలేరు . 
The seeker won’t be able to understand and more likely distort the experience according to the level of mental development.


మనిషి ఎప్పుడూ స్వార్ధం తోనే ఆలోచిస్తాడు . selfish consciousness.ఎందుకని ? 
తను వేరు ,మిగతా వారు వేరు అనే ద్వంద భావం వలన . 
అలాగే మనిషి కి ఎల్లప్పుడూ స్వీయ స్పృహ ఉంటుంది . కొందరి కి ఈ స్పృహ పక్క దారి పట్టి -అందరూ తన నే పరీక్ష గా  గమనిస్తున్నారని , అనుమానం తో సత మవుతూ ఉంటారు . దీనినే స్వీయ ప్రాముఖ్యత (self-centeredness)అంటారు . 
self consciousness ,when aberrant  turned gradually to shyness,introversion & paranoia.

స్వీయ స్పృహ స్వకీయం గా(private self consciousness) ఉండటం వేరు ,
ఎవరో (public self consciousness) పరీక్ష గా నన్నే చూస్తున్నా రానే అనుమానం తో 
స్వీయ స్పృహ    ఉండటం వేరు. 

అందరు నన్నే చూస్తున్నారు . నేను ఈ పనిని బాగా చేయాలి . నేను మంచి డ్రెస్ వేసుకోవాలి . నేను సరిగా చేయ లేక పోతే అందరూ నవ్వుతారు -అనే ఆందోళనతో బాగా వచ్చిన పని కూడా చేయ లేక పోతారు . 
సచిన్ కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తూ తన పని తాను చేసు కొంటూ మంచి ఖ్యాతి పొందాడు.
కానీ , ఆ క్రమం లో ఎన్నో సార్లు చిన్న చిన్న తప్పిదాల వలన బాగా ఆడ లేక పోయే వాడు. అందరి చూపు తమ పై ఉన్నప్పుడు , అందరి ఆశలు తానొక్కడే మోస్తున్నప్పుడు ఆట బాగా వచ్చిన వాళ్ళు కూడా తప్పులు చేస్తారు . 
అసలు ఎవరూ చూడక పోయినా , పట్టించు కో పోయినా , అందరూ నన్నే చూస్తున్నారని ఉహించు కోవడం 
ఒక విధమైన మానసిక దురలవాటు . 

మనం ఒ క తప్పు చేసినప్పుడు ఎవరైనా విమర్శ చేస్తే కోపగిస్తాం . ఆ కోపం లో మనం చేసింది తప్పా ,ఒప్పా ? అని ప్రశ్న  వేసుకొని, తప్పు ఐతే ఎలా దిద్దు కోవాలి అనే ఆలోచన చేస్తే ,
దానిని స్వీయ మానస శోధన అంటాం . 
 గమనించ వలసింది ఏమిటీ అంటే , యోగమార్గం లో ఉన్నవారు  చేసేది ఆత్మ శోధన.  

మనిషి కి శరీరం పై ఎంత బంధం ఉంటుందో అంతగా స్వీయ శరీర (body conscious), 
స్వీయ మానసిక స్పృహ(mind conscious) ఉంటుంది . 
అదే స్పృహ తనలోని ఆత్మ పై ఉంటే దానినే ఎరుక(self or soul awareness) అంటారు . 

Evolution of human consciousness:
మనిషి స్వీయ శరీర స్పృహ నుండి స్వీయ మానసిక స్పృహ కి ఆ తర్వాత 
స్వీయ ఆత్మ స్పృహ కి పరిణామం చెందాలి . 

The way to happiness:
“If we erase the  border between self and society, we can make profound effects on man’s attitude to his environment, both social and physical. If we experience  our self in all other 's, then self-consciousness becomes social consciousness leads to godly consciousness.”

వరైతే అందరి ఆత్మలను తనలో,తన ఆత్మను ఇతరుల ఆత్మ లలో అనుభూతి చెందుతాడో అతనికి ద్వంద ము లైన రాగ ద్వేషాలు ,అరిషడ్వర్గాలు ఉండవు - ఈశోపనిషత్ 
He who sees all beings in his own self and his own self in all beings, he does not feel any revulsion to any being.

ఎన్ని చెప్పు కొన్నా మనిషి -- మనస్సు మసిలే 3 స్థితులలో కాకుండా , తురీయ స్థితి(super conscious or expanded state) లోనే మాయని చేదించి సచిదానంద ఘన స్వరూపమైన ఆత్మ గా అనుభూతి స్థిరం చేసు కొంటాడు . 

Comments

Post a Comment

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి