Is astrology a real science?

                               
తారా తెర పై గ్రహాలు ఆడించే నాటకానికి మనుషు లే పాత్రధారులు.

కారణ  కోశం లోని సవా లక్ష కర్మలలో (సంచిత కర్మ )చాలా కొద్ది శాతం ప్రారబ్ద కర్మ గా  నిర్ణయింప బడి ,దానికి అనుగుణ్యం గా శరీరం,సామాజిక వ్యవస్థ,కుటుంబం  ఎన్నిక చేయ బడుతుంది . ప్రారబ్ద కర్మలను అనుస రించే మన "మానసం " అభివృద్ధి చెందుతుంది . 
"బుద్ది కర్మాను సారిణి " అని రుషి వాక్యం . 

మానసానికి హార్డ్ వేర్ మెదడు . ఆపరేటింగ్ సిస్టం (OS)సాఫ్ట్ వేర్ కారణ కోశం . 

మానసం అంటే అది ఓ గతితార్కిక వ్యవస్థ . దానిలో వివిధ అంతరాలు (Levels)ఉంటాయి . చిత్తం అనేది "ROM"(read only memory) లాంటిది . అందులో నే ప్రారబ్ద కర్మ కి అనుగుణ్య మైన సహ జాతాలు (inherent traits) ఉంటాయి . అలాగే మెమొరి ఉంటుంది . ఆలోచన చేసే మనస్సు (algorithmic processor)ఉంటుంది. 

ఆలోచనలు మంచివా  చెడ్డవా ?పాప పుణ్య హేతువులా ? 
సమాజానికి చెరపు  చేస్తాయా ?- అనే విచక్షణ చేసే బుద్ది(gateway controls) తర్వాత అభివృద్ధి చెందుతుంది . 
విద్య,అంటే జ్ఞానం (application software)సంపాదించిన కొద్దీ ,జ్ఞాపక శక్తిని, ఆలోచనా శక్తిని,తార్కిక ,ఉహా శక్తిని ,విచక్షణా శక్తిని మనిషి అభివృద్ధి పరచు కొంటాడు . ఇలా ఇచ్చా ,జ్ఞాన శక్తులను పెంచు కోవ డాన్ని " వివేకం" (highly structured and the most amenable user interface)అంటాం . 

 వివేకం బాగా అభివృద్ధి చెంది చిత్తం లోని సహా జాతా లను కూడా మార్చి వేసే 
 సంకల్పం ను పెంచు కోవడం పరిణామం లో తొ లి మెట్టు . 

ప్రారబ్ద కర్మ లేదా విధి వ్రాత (destiny) కి లొంగి జీవించడం అనేది ప్రతి జీవీ  చేస్తుంది . 
కానీ,కాంతి రూపు లైన మానవులకు -(people of light) అలా లొంగక తమ  ధీ శక్తి తో (wisdom) తమ లోని చిత్త వాసన లను పరిశీలించి పనికి రాని వాటిని అణచి వేసి భస్మం చేసు కొనే సామర్ధ్యం ఉంది . 
కానీ ,మనిషి దానిని వాడు కోవడం లేదు . 

 బుద్ది ,వివేకం,విచక్షణ వ్రుద్ది పొందిన మనిషి  ఈ గ్రహ నక్షత్ర నాటకం లో  
విధికి లొంగి పోయి ,నటన చేయ న క్కర  లేదు.
కానీ ఇక్కడ చిన్న అభ్యంతరం ఉంది . ఎంతగా మన చిత్తా న్ని శుభ్రం చేసు కొన్నా కొన్ని కర్మలు ,
ముఖ్యం గా ఇతరుల కారణ కోశాలతో అనుబంధం ఎక్కువ ఉన్నా , అలాగే కుటుం బానికి ,దేశానికి , జాతి కి  సంబంధించిన కర్మలు తప్పించు కోవడం తేలికైన పని కాదు . 


జ్యోతిర్వేదం ఒక జ్ఞాన వాహిని . అందులో ము ఖ్యం గా  జాతక చక్ర వివరణ అనే విభాగం ఓ సంభావ్యతా సూచక శాస్త్రం (probable science). పొగ తాగే వారికి కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని ఎలా చెబుతున్నాం ?కాన్సర్ జబ్బు బారిన పడిన వారిలో ఎక్కువ మంది కి పొగతాగే అలవాటు ఉంది అని పరిశీలనలో తేలింది . ఆ తర్వాత లాబ్ ల్లో నికోటిన్ కాన్సర్ హేతువు అని 
నిరూపణ చేశారు . 
అలాగే ,  ఋషులు ఎందరో జీవితాలను పరిశీలించి , రాసి చక్రం లో పలానా గ్రహ ఏర్పాటు ఉంటే పలానా సమస్యలు వచ్చాయి అని తేలిన విషయాన్ని  వారి అంతర్యానం లో నిజమా?కాదా? అని నిగ్గుదేల్చి ఆ జ్ఞాన సంపదను సూత్రాల రూపం లో క్రోడీక రించారు . 
మన జీనోమ్ కూడా రకరకాల కారణాల వలన ,ముఖ్యం గా కాలుష్యం వలన మన జీన్స్ లో మార్పు లొచ్చి రకరకాల జబ్బులు ఎలా వస్తాయో ,అలాగే గోచార గ్రహ గమనం వలన మన రాసి చక్రం కూడా ప్రభావితం చెందుతుంది . 
ఈ సృష్టిలో వ్యక్త మయ్యె ప్రతిదీ స్పందించి నట్లే , గ్రహ నక్షత్రాలు కూడా 
ఒక విధమైన స్పందనను వెలువరిస్తాయి.
మన భూమి  కి అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుందో,ప్రతి పదార్ధానికి దానికి తగ్గ మోతాదులో,పౌన పున్యం లో అయస్కాంత బల రేఖలు,స్పందనలు గా వెలువడతా ఉంటాయి.

నైసర్గిక శుభ గ్రహాల స్పందనలు మనిషిలో మంచి సుఖకర మైన ఆలోచనలను ప్రేరేపించి సుఖానికి,ప్రశాంతతకి తోడ్పడ తాయి.
 నైసర్గిక పాప గ్రహాల స్పందనలు మనిషికి బాధలు కలుగ చేస్తాయి.

అనగా మనిషి ఆలోచనలను ఆల్రెడీ కారణ కోశ వాసనలు ప్రభావితం చేయడం తో పాటు 
గోచార రీత్యా గ్రహ గమనం కూడా ప్రభావితం చేస్తాయి.
కానీ నేటి యుగం లో కొన్నిరకాల నైసర్గిక పాప గ్రహ స్పందనలు -అవి చివరికి దుఖం కలిగించినా,నేటి కాలానికి అవసరం అని అనిపిస్తాయి.

గ్రహ నక్షత్రాలలో ఉన్న మూలకాల నిష్పత్తి పై ఆధార పడి వాటి వర్ణం,స్పందన ఉంటాయి.
నక్షత్రాల యొక్క వర్ణం,స్పందనలను ఆయా నక్షత్ర స్థానాలలో ఉన్న గ్రహాలు మార్పు (modify) చేస్తాయి.
తరంగ దైర్ఘ్యం,పౌనపున్యం,వర్ణపటం,-అనేవి ఆయా గ్రహ నక్షత్రాలకు వేర్వేరుగా ఉంటాయి.

మనిషి భూమి పైకి వచ్చిన సమయం లో తూర్పున ఉదయిస్తున్న నక్షత్రమె ప్రా పంచిక జీవనానికి ఆరంభ స్థానం. దానినే లగ్నం అంటారు.
లగ్న సమయాన్ని అనుసరించి,ఆ లగ్న స్థానానికి ఏయే గ్రహాలు ఎంత దూరం లో ఏయే నక్షత్రాల లో ఉన్నాయి" అనేది మౌలికం గా లెక్క వేయ దాన్నే రాశి చక్రం వేయడం అంటారు . 

మనిషి పుడమి పైకి రాగానే,అనగా పుడమి పై ఉన్న పంచ భూతాల అధీనం లొకి రాగా నే,ఆ  మనిషి సూక్ష్మ శరీరం ఒక్క సారిగా యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మనిషి ఈ లోకం లో పడ్డాడో ,అప్పుడే ఈ భూ ఖగోళ స్పందనలను ఓ ఫోటో గ్రాఫిక్ మెమొరి లాగా తన సూక్ష్మ కోశం లో నిక్షిప్తం చేసు కొంటారు . ఈ స్పందనలు శాస్వతం గా సూక్ష్మ కోశం లో ఉండి పోయి ,గోచార గ్రహ గమనానికి స్పందిస్తూ ఉంటాయి . 

మన జీనోమ్ లోని వివరాలు ఎలా ఐతే మనిషి శారీరక, మానసిక స్థితులను తెల్పుతాయో ,అదే మాదిరి గా పుట్టిన సమయంలో ఉన్న గ్రహాల ,నక్షత్రాల అమరిక కూడా తెలియ చేస్తుంది -అని ఋషి వాక్యం . 

పైనున్న గ్రహ నక్షత్ర ఏర్పాటు మనిషి సూక్ష్మ శరీరాన్ని అందులో ఉన్న మర్మాలను సూచన చేస్తున్నాయా?
లేక
సూక్ష్మ శరీరాన్ని ,పైన ఆ సమయం లో ఒక ఏర్పాటులో ఉన్న గ్రహ నక్షత్రాలు ప్రభావితం చేస్తాయా?
లేక,
 పుట్టిన సమయం లో ని గ్రహ నక్షత్రాల అమరిక ప్రారబ్ద కర్మ ని ఒక సూచన గా సూచించి, ఆ తర్వాత జరిగే గ్రహ గమనాలు(గోచారం), మనిషి సూక్ష్మ శరీరాన్ని తద్వారా మనిషి ఆలోచనా విధా నాన్ని ప్రభావితం చేస్తాయా ?
                  ఇవన్నీ మనమే పరి శోధించు కోవాలి .                                             

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి