అమాయకత్వ మే ఆనందం
చైతన్యం అనగా శుద్ద సత్యజ్ఞానం . దానికి శక్తి తోడైతే అప్పుడు సృష్టి జరుగుతుంది . జ్ఞానం లేని శక్తి అత్యంత ప్రమాదకరం . అలాగే శక్తి లేని జ్ఞానం నిరుపయోగం . సహస్రారం నుండి జ్ఞాన ధార పడుతూ ఉంటే శక్తి సక్రమ మైన పంధాలో పయ నించి లోక కల్యాణం జరుగుతుంది . అంటే మానవ సమాజం, ఈ భూమండలం ,ఖగోళ అంతరిక్ష మండలం ,సమస్త ప్రక్రుతి
సమతుల్యత లో ,ఓ విధమైన సుఖ స్పందనా స్థితిలో ఉంటాయి .
మూలాధారంలో నిద్రాణం లో ఉన్న శక్తిని మేల్కొలిపి దానిని ఊర్ధ్వ ముఖం గా పయనింప చేయడమే సాధకుని కర్తవ్యం .
మన మూలం అమాయకత్వం . పుట్టినప్పుడు మనిషి చాలా అమాయకం గా ఉంటాడు .
చేసే పనుల్లో ఎలాంటి స్వార్ధం ఉండదు . సమాజం ,పరిస్థితులు ,కోరికలు మనిషిని కరకు కసాయి గా మార్చి వేస్తాయి . మూల శక్తి కేంద్రం చుట్టూ ఒక దుర్భేధ్యమైన అహంకార పూరిత కోట నిర్మింపబడి ఉంటుంది .
విశ్వ శక్తి లో ని భాగమైన భూ కుండలినీ మనిషి మూలం లోకి చొచ్చుకు వెళ్ళా లంటే చుట్టూ పేరుకొన్న కరడు గట్టిన కోరికల స్వార్ధపు కోట బద్ద లవ్వాలి .
మనిషి-ధర్మ, మో క్షాలను నిర్లక్ష్యం చేసి ,కేవలం అర్ధ ,కామాల కోసం వెంపర్లా డుతూ ఉంటాడు .
శరీరం,మనస్సు,బుద్ది ఎలాంటి మలినాలు లేకుండా పరిశుద్ద ము గా ఉండాలి . అలా ఉందా లంటే యమ,నియమ,ప్రత్యాహార ,ధారణా, ధ్యానం తప్పనిసరి . రాగి తీగలో కరెంటు ప్రయాణం చేయా లంటే ఆ తీగలో ఎలాంటి మలినాలు ఉండకూడదు .
మూలాధారం మనిషి జీవనానికి పనికొచ్చే దేహ(శరీరం,మనస్సు,బుద్ది ,అహం )చైతన్యం(consciousness) తోపాటు ప్రారబ్ద కర్మ లతో నిండి యుండే సుప్త చైతన్యం(sub-conscious) ,అలాగే సహజాతాల తో(instincts&traits)నిండి ఉంటుంది .
పశుత్వం(animal instincts) నుండి మానవత్వం(human qualities) ను వేరు చేసే
చైతన్యం మూలం లోనే ఉంటుంది .
అమాయకత్వం ,స్వచ్చత ,పొరుగువారిని మోసం చేయకుండా బతకడం ,నమ్మకం,శ్రద్ద ,విశ్వాసం
ఇవన్నీ పిల్లల్లో ఉంటాయి . కానీ కాలం గడిచి వయస్సు పెరిగి,సమాజం చేస్తున్న మోసాలు ,అన్యాయాలకు ఎదురు తిరిగి మనస్సు రాటు దేలి అమాయకత్వం పారి పొతుంది . కానీ మనిషి అమాయకత్వాన్ని నిలుపు కోవడాన్ని సాధన చేయాలి . ఎదుటి వారు మోసగిమ్చినా, ఎదుర్కోవాలి గానీ ,మళ్ళీ మోస గించ కూడదు . మనిషి స్వచ్చం గా ఉండాలీ అంటే , స్వార్ధం మితి మీర కూడదు . ఎదుటి వారి కి చేత నైతే సాయం చేయాలి గానీ,
మోసం చేయ కూడదు .ఇన్ని మాట లెందుకు ,మనిషి శివుడి లా ఉండాలి .
మనుషుల భావంలో, ఆలోచనల్లో ,మాటలో ,చేతలో - సమత్వం ,స్థిరత్వం ఉంటే సామాజిక శాంతి ఉంటుంది .
మూలాధార శక్తి ప్రజ్వరిల్లి పైకి ఎగబాకుతూ చైతన్యాన్ని వివిధ స్థాయిలకు పెంచా లంటే(to expand the consciousness) మనిషిలో స్వచ్చత(purity), సమతా(equality&harmony),
పనిచేయా లనే హుషారు(enthusiasm&dynamism) ఉండాలి .
మనిషి ఖాళీగా ఉండటం వేరు, సోమరిగా ఉండటం వేరు .
పని ఏదీ లేక కూర్చోవడం idlesness.
పని ఉన్నా చేయకుండా కాలం కరిగించ డం సోమరితనం (laziness).
అలాగే అమాయకత్వం(innocent. ) వేరు , అజ్ఞానం(ignorance. ) వేరు .
అమాయకత్వం లో నిష్కళంకత్వము ఉంటుంది . అజ్ఞానం లో అవివేకం ఉంటుంది .
మూలాధార శక్తి చైతన్యం పొందా లంటే మనిషి అమాయకం గా నే ఉండాలి . అంటే స్వచ్చం గా -శరీరం శుచిగా ,మనస్సు పవిత్రం గా , భావం పరిశుద్దం గా ,మొత్తానికి పావనత్వం తో ఉండాలి .
మన తల్లితండ్రులు మనకీ మానవ జన్మ ఇచ్చి నందుకు ,ప్రతి మనిషీ అమాయంకం గా ఉంటూ
బాధ్యతలను నిర్వ హించడం అనేది మానవ చైతన్య పరిణామంలో అత్యంత కీలక మైన తొలి మెట్టు .
మనిషి ఈ మెట్టు ఎక్క గలిగితే అనంత శక్తి భాండా నికి తాళం దొరికి నట్లే .
Comments
Post a Comment