ఆత్మ సంవాదం

సత్యాన్ని ఎవరు ధరిస్తారు?
ఎవరైతే తన నిజ స్థితిని గ్రహించి,జరిగేవన్నీ ప్రక్రుతి చేస్తుందని,
తన నిజరూపమైన ఆత్మ నిమిత్త మాత్రమని నమ్ముతారో వారే సత్యధరులు. 
ప్రక్రుతి అనగా ఏమిటి?
మార్పు చెందే ది ప్రక్రుతి.
అనగా పదార్ధ రూపం లో ఉన్నవన్నీ -శరీరం,మనస్సు,సంఘం ఇవన్నీ ప్రక్రుతే. 
ఇవన్నీ ఎక్కడి నుండి పుట్టాయి ?
శక్తి నుండి . 
శక్తి ఎక్కడినుండి పుట్టింది ?
చైతన్యం నుండి . 
చైతన్యం ఎక్కడినుండి పుట్టింది ?
చైతన్యానికి పుట్టుక అనేది లేదు . అది నిరంతరం ఉండే అజరామర మైన స్థితి . 
దానికి ఆది అంతము లేవు కాబట్టి దానిని "సత్యం " అని అంటారు . 
చైతన్యం - నిత్య సత్యం - సచ్చిదానందం  - దైవం -పురుష -పరబ్రహ్మ ---- ఇవన్నీ పర్యాయ పదాలు . 

ఆత్మ ఎలా ప్రక్రుతి కి బందీ ఐయింది ?
ఆత్మ బందీ అవ్వడం కాదు . ఆత్మే ప్రకృతిని పరివేష్టింప చేసు కొంటుంది . 
ఒక విధం గా అవగాహన చేసు కోవాలంటే, ఆ రెండూ ఒక్కటే - కాబోతే భిన్న వ్యాహృతులు . 
"అర్ధ నారీశ్వ రం -వాక్ అర్ధాలు - శి వశ క్తులు -లింగయోనులు -లింగపానవట్టం -శ్రీయంత్రం" -ఇవీ అందరూ అర్ధం చేసుకోవడానికి మహర్షులు ముఖ్యం గా వైదిక,ఆగమ శాస్త్ర కారులు,తంత్ర శాస్త్రజ్ఞులు 
ఏర్పరచిన గుర్తులు .  

ఎప్పుడైతే చైతన్యం లో ఒక సంకల్పం పుట్టి స్పందన గా మారి,అది 3 గుణాలతో -(సత్వ రజస్ తమో)  శక్తి గా
మారిందో ,అది  ప్రక్రుతి గా విస్తరించా డానికి సిద్ద మై నట్లే . 
అనగా చైతన్యం లో ఒక బిందువు నుండి శక్తి విస్తరిల్ల టాన్నే  ప్రప్రధమ  విస్ఫోటనం (Big Bang) అంటారు .  
ఈ క్రమం లో చైతన్యం లో కలిగే అలలు -స్పందనలే ఆత్మలు . 
ఎప్పుడైతే ఆత్మ చుట్టూ ప్రక్రుతి 3గుణాలతొ పరివేష్టిత మయ్యిందో,అప్పుడే 
 ఆయా గుణాల మధ్యన జరిగే చర్యలు  ,ప్రతి చర్యలు -ఇవన్నీ ఒక గొలుసు కట్టు లాగా 
నిరంతరం  మార్పు కి లోబడి ఉంటాయి . 
బ్రహ్మాండం అంతా  కూడా పిండాండం  లోనే  చూడ వచ్చని అంటారు గదా ! 
మామూలు మనిషి కి అది సాధ్య మేనా ? 
సాధ్యమే . మనకు తెలియనివి తెలుసు కోవాలంటే  జిజ్ఞాస , కొన్ని సహాయ కారకాలు ,
వాటిని విడ మరిచి చెప్పగల గురువులు , నిరంతర అభ్యాసం ---ఇవన్నీ అవసరం . 
మనిషి నేర్చు కొనేది మనస్సు తోనే . 
విషయం అంతా లోపలే ఉంది కాబట్టి , మనస్సు ని లోపలి కి తిప్పాలి . 
అలాగే  సూక్ష్మ తర మైనవి గ్రహించా లంటే మనస్సు నిర్మలం గా ఉండాలి . 

మన మనస్సుని గందర గోళ పరిచే వి ఏవి ?
భయాలు ,కోరికలు,బంధాలు,బాధ్యతలు  . 

  • ఆహారం,నీరు,గాలి,గుడ్డ,నీడ ,ప్రాణ రక్షణ -ఇవి ఉంటాయో , పోతాయో అనే భయం . 
  • కాంత,కనకం,కీర్తి -ఇవి కావా లనే కోరికలు . 
  • తల్లితండ్రులు ,పిల్లలు, స్నేహితులు ,సంఘాలు,కులాలు,మతాలు  ఇలా ఎన్నో బంధాలు . 
  • కుటుంబ పరం గా ,వ్రుత్తి పరం గా ,సంఘ పరం గా చేయ వలసిన విధులు ,
  • వ్యక్తీ పరం గా చేయ వలసిన నిత్య కర్మలు,నైమిత్తిక కర్మలు , ---- ఇవన్నీ మనిషిని  ప్రపంచానికి , అంటే ప్రకృతికి కట్టేసేవే . ఈ  క్రమంలో  మనిషి లో సహజాతాలుగా ఉన్న అరిషడ్వర్గాలు  తీవ్రం గా పేట్రేగి ,పశు ప్రవృత్తిని ఎగ దోసి మనిషి క్రమం గా దిగజారడమో  లేక అలా స్తబ్దుగా ఉండిపోవడ మో  జరిగి ,కర్మచక్ర భ్రమణం లో నే ఉండి పోతాడు .  
పైన చెప్పుకొన్న వన్నీ చేస్తూ  మనస్సు  గందరగోళ పడకుండా  ఏం చేయాలి? 
ఎలా జీవించాలి ? 
మనస్సుని నిర్మలం గా ఎలా ఉంచుకోవాలి ? 
సరే,మనస్సు నిర్మలం గా ఉంది . అ ప్పుడు మనిషి ఏం చేయాలి ? 
ఇలాంటి ప్రశ్నలు మనందరికీ ఉన్నాయి . 
వీటన్నింటికీ  మహర్షులు చెప్పిన  మార్గాలే  సనాతన ధర్మ జ్ఞాన ధారా పరంపర . 
Let us meditate on problems, but not with problems....
He who sees that all actions are performed in their entirety by Prakriti alone, 
and not by the Self, is indeed a beholder of truth. —The Bhagavad Gita XIII:29


Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి