ఏది సుఖం ?
ఏది సుఖం ?కొందరికి నిధి చాలా సుఖం . మరి కొందరికి రాముని సన్నిధి సేవ సుఖం .
ముందుగా ఓ విన్నపం .
ఏది సుఖం, ఏది దుఖం అనే చింతన జిజ్ఞాసువు కే గానీ , అటు ఎలాంటి మానస శోధన
లేని అజ్ఞానికి ,ఇటు అప్పటికే జ్ఞానం తో పండిన జ్ఞానికి అవసరం లేదు .
ముందు సుఖం గా ఉందనే భ్రమ కలిగించి తర్వాత దుఖానికి కారణ మయ్యె ప్రతిదీ
మనిషికి పనికి రానిదే .
కోరికలే మనిషి కష్టానికి కారణం అని ఋషి వాక్యం .
వస్తువుల పైన ,విషయాల పైన మనిషికున్న వ్యామోహం ,దానితో మనలో కలిగే అలజడి
ఆ కోరిక తీరడానికి పడ వలసిన శ్రమ ,కష్టం ఇవన్నీ మనిషిని ఆందోళనకు గురి చేస్తాయి .
నిజానికి కోరిక మనలో లేనప్పుడు మనిషి శాంతం గా ,సుఖం గా నే ఉంటాడు .
ఎప్పుడైతే ఓ ప్రే రేపణ ,ఓ కోరిక , ఓ వ్యామోహం మనస్సులో మెదిలిం దో
అప్పుడే మనస్సు కి సుఖం ఉండదు .
ఆ కోరిక తీ రేంత వరకు ప్రశాంతత ఉండదు .
కోరిక తీరి, కావలసింది దక్కిన తర్వాత మనస్సు పూర్వ స్థితి ,అనగా
మునుపటి ప్రశాంత ,ఆనంద స్థితి కి వస్తుంది .
వస్తువు దక్కడం వలన ఆనందం వచ్చిందని అందరం అనుకొంటాం .
కానీ ,నిజానికి కోరిక తీరడం అనేది ఓ తుఫాన్ తగ్గిన తర్వాత కలిగే ప్రశాంతత మాత్రమే
అని మనం గ్రహించాలి .
వాతా వరణం, తుఫాన్ రాక ముందు & తుఫాన్ తగ్గిన తర్వాత , ప్రశాంతం గా నే ఉంటుంది .
అంటే , మన స్థితి ఎల్లప్పుడూ ఆనంద కర మే .
కోరికల వలన ఆ స్థితి తాత్కాలికం గా పాడవుతుంది .
సుఖం ,సంతోషం ,దుఖం ,బాధ , ఇష్టం, అయిష్టం -ఇవన్నీ తాత్కాలిక మానసిక ,శారీరక స్థితులు .
ఇవి మనిషి దృష్టి కోణం పై ఆధార పడి ఉండే అవస్థలు .
"ఆత్మా నందం లో పిసరు వంతు పాటి చేయవు విషయానందా లు" -అని రుషి వాక్యం .
సంకల్పమే దుఃఖ హేతువు .
అప్పటివరకు చక్కగా శాం తం గా ఆనందం గా ఉన్న ఆత్మానందం,
సంకల్పం కలగ గానే చెదిరి పోయి దుఃఖం కలుగుతుంది .
నిజానికి ఆత్మ యె క్క ఆనంద స్థితి చెదిరి పోనిది,మార్పు లేనిది .
కానీ "తను ఆత్మ కాదు, శరీరమే తాను" అనే భ్రమలో ఉన్న జీవుడు ద్వందాలకు లొంగి ,
సంకల్పాలతో చెదిరి, విషయాలకు లొంగి దుఃఖ స్థితి లో ఉంటాడు .
"ఆనంద స్థితి ---->సంకల్పం ----> కోరికలు -----> తీరే వరకు ఆందోళన ----->తీరిన తర్వాత ఆ సంకల్పం కరిగి పోతుంది---> సుఖసంతోషం" === ఈ విధమైన గొలుసు కట్టు చర్య లే మనిషి జీవితం లో దుఃఖ హేతువులు .
కోరికలు దుఃఖ హేతువులు కాబట్టి వాటిని ఆధీనం లో ఉంచు కోవాలి అని -జైనం ,వేదం , బౌద్ధం చెప్పాయి .
సంకల్పమే సంసారం ,కాబట్టి సంకల్పాన్ని త్యజించ మని సనాతన ధర్మం చెప్పింది .
సరే ,కోరికలను ఆధీనం లో ఉంచ లేక పోతున్నాం ; సంకల్పాలను ఆపలేక పోతున్నాం -మేమేం చేయాలి ?
నీ ఆశ్రమానికి తగ్గ ధర్మ కార్యాచరణ -విహిత కర్మలు -నిత్య నైమిత్తిక కర్మలు ,సాత్విక కర్మ కాండలు
చేసు కో వచ్చు .
ధర్మ బద్ధ మైన కోరికలు ధర్మ మార్గం లో , అనగా ఎవరికీ ,ప్రకుతికి కూడా
హాని చేయని మార్గం లో తీర్చు కోవాలి .
ఒకనికి పానీ పూరీ తినాలని కోరిక ఉంది . అది ధర్మ బద్దమేనా ? ధర్మమే .
రోడ్ పక్కనున్న బండి పై అమ్మే వాటిని తింటే రోగం వస్తుంది ,కాబట్టి అది అధర్మం .
అపుడేమి చేయాలి ? ఇంట్లోనే తయారు చేసుకొని తినాలి . అదే ధర్మం .
అలాగే , కామం మనిషిని నిలువనీయదు . కామం ధర్మ బద్దమేనా ? ధర్మమే .
అపుడేమి చేయాలి ? వివాహ బంధం ద్వారా కామాగ్నిని ఉప శమింప చేసు కోవాలి . అదే ధర్మం .
మరే ఇతర పద్దతి అయినా అధర్మమే .
మనిషికి అటు నాలుక, ఇటు జననేంద్రియం పతనానికి దగ్గర మార్గాలు చూపిస్తాయి .
ఇంద్రియాలకు మూల మైన మనస్సుని ఆధీనం చేసు కో లేకుంటే సామాన్యుడికి దుఖం తప్పదు .
మితాహారం , సంతానం కోసం కామం -ఇవే మనిషిని పశువుని వేరు చేసే నియమాలు .
మనిషి, తన జాతిని విస్తరింప చేసు కోవడానికి ,తనకున్న జ్ఞానేంద్రియాల ,కర్మేంద్రియాల బలహీనతను
అధిగమించ డా నికి ,పరిణామం లో తెలివి ని వృద్ది చేసు కొన్నాడు . అలాగే
ఋతువులతో సంబంధం లేకుండా నిరాఘాటం గా కామాన్ని నిర్వర్తించ డానికి
అవసర మైన రసాయన హార్మోన్ ల ఉత్పత్తి కూడా జీవ పరిణామం లో మానవ జాతి
పరంపరగా వృద్ది చెంద డానికే - అని శాస్త్రజ్ఞుల అభిప్రాయం .
కల లు కనాలి . కోరిక బలం గా ఉండాలి .
అప్పుడే విజయం నిన్ను వరిస్తుందని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతారు . అది తప్పా ?
అందమైన భార్య ,సమర్ధులైన పిల్లలు , ఇల్లు , హోం థియేటర్ , కారు , సెల్ ఫోన్,డబ్బు
ఉంటే సౌకర్యం గా ఉంటుంది .
నేటి సమాజ పరిస్తితు ల్లో , ఆ సౌకర్యాలు పొందా లంటే అవి సంపాదించు కోవా లనే కోరిక బలం గా ఉండాలి .
నైపుణ్యం ,ఓర్పు ఉండి కష్టించి పని చేయాలి . అందరి నీ కలుపుకు పోవాలి .
సవాళ్ళను ,పోటీని ఎదుర్కోవాలి .
ఈ క్రమం లో ఎన్నో బాధలు ,అవమానాలు ,కష్టాలు పడాలి .
ఇంత కధ నడిస్తే నే ... మనిషి కోరికలు తీరతాయి .
ఇక్కడ నిదానం గా చూడండి .
సౌకర్యాలని మనం ఏవైతే అను కొన్నామో అవి సమాజ స్థితి గతులను బట్టి మారుతూ ఉంటాయి .
ఇది వరకు సైకిల్ ఉండి ,ఇంట్లో చిన్న దీపం , గాదె లో పుట్టెడు ధాన్యం ,నాలుగు పాడి గేదెలు ,డజను కోళ్ళు ,
వినటానికి ఓ రేడియో అమిరితే చాలని అదే సౌకర్యమని అనుకొన్నాం .
అంతకు మునుపు మంచి కొండ గుహ ,బలమైన తోడూ , పని చేసే గంపెడు పిల్లలు ,
వేట బాగా సాగాలని ,క్రూర మృగాల బారిన పడ కుండా ఉండాలని అనుకొన్నాం .
సౌకర్యాల కోసమే మనిషి నాగరికత లో ముందు కెళ్ళు తున్నాడు . సుఖ సంతోషాల కోసం కాదు .
సౌకర్యా లే సుఖ హేతువులు అని అనుకొంటు న్నాము .
మనిషి ఏది చేసినా, తన ఉనికి ఈ సమాజం లో ప్రకటింప బడాలని ,అందరూ ఉన్నట్లే తను, తన కుటుంబం
సౌకర్యాలతో ఉండాలని కోరు కొంటాడు . దాని కోసం కష్ట పడతాడు . కొందరు ఇష్ట పడి కష్ట పడతారు .
మరి కొందరు ముక్కుతూ మూలుగుతూ కష్ట పడతారు .
ఏది ఏమైనా మనిషి కలలు కనాలి ... వాటిని సాధించు కోవాలి .
ఆ క్రమంలో ఎవర్నీ కష్ట పెట్టకుండా ,ప్రకృతికి హాని కలగ కుండా చూసుకోవాలి .
అదే క్రమంలో చేసే పనిపై సంపూర్ణ ధ్యాస పెట్టి ,వెనకడుగు వేయ కుండా ,
ఫలితం ఎలా ఉంటుందో అని మధన పడ కుండా పని చేసుకు పోవాలి .
అంటే కోరికలు ఉండవచ్చు . కలలు కన వచ్చు . అందరిలో బాగా కనిపించాలని
అనుకోవచ్చు . కానీ మనస్సులో ఆ కోరిక, నీ ప్రశాంత తను చెడ గొట్ట కూడదు .
ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతం గా ఉండాలి .
చేసే పని వలన తనొక్క డి కే కాక పదిమందికీ ఉపయోగం కలగాలి .
చేసే పనిలో స్వహితం ,సంఘ హితం ఉండాలని, ఫలితం గురించి ఆందోళన పడకుండా
పనిచేసుకోవాలని,అప్పుడే పని బాగా జరిగి మంచి ఫలితాలు వస్తాయని గీత చెప్పింది .
కలలు వేరు, పగటి కలలు వేరు .
ఒక నిర్దిష్ట మైన సంకల్పం,నైపుణ్యం ,సమకాలీన సమాజ అవసరం ఇవన్నీ కూడిన ప్రణాళిక నే
నిజ మైన కల అనాలి . మిగతా అడ్డదిడ్డ మైన ఉహలన్నీ పగటి కలలు.
ప్రణాళిక లో ఖచ్చిత మైన సాధనా విధానాలు, ఒక పద్దతి లో అపజయం పొంది తే
ఇంకో పద్దతి ...ఇలా రకరకాల మార్గాలు ఉంటాయి .
ఏదో ఒక రంగం లో ఎంతో కొంత నైపుణ్యం, ఏ రంగం లో తనకు నిపుణత ఉందో
తెలుసు కొనే సామర్ధ్యం ఉన్న వారికే కలలు కనే అర్హత ఉంటుంది .
మనిషి తాను అనుకొంటున్న సుఖం సంతోషకరం కాదు ,దుఃఖ హేతువు అని తెలుసు కోవడం,
తాను ఏదైతే అతిలోక అందమని మురుస్తు న్నాడో ,అది క్షణ భంగుర మైన తోలు తిత్తి అని గుర్తించ డం,
తాత్కాలిక సంతోషానికి - శాశ్వత ఆనందానికి,అలాగే తాత్కాలిక అందానికి -ఆత్మ సౌందర్యానికి తేడా కని పెట్టడం,
శాశ్వత సుఖానికి ,అదే ఆ త్మానంద పధా నికి తొలి మెట్టు ....
Comments
Post a Comment