The soul matrix

ఈ సృష్టి  సాలె గూడు లాంటిది .
ఖగోళ మండలం నిత్యం పుడుతూ ,విస్తరిస్తూ, లయం చెందుతూ ఉంటుంది .
అంటే శక్తి పదార్ధం గా , మళ్ళీ అదే పదార్ధం శక్తి గా మారుతూ ఉండటం నిరంతర ప్రక్రియ .
క్వాసర్స్ ,నెబ్యులా లు ,గ్రహ నక్షత్రాలు అన్నీ  మన కి కనిపించని  వాయువుతో ఒకదానికొకటి కలిపే ఉంటాయి .
మన మెదడు కూడా అంతే . బిలియన్ ల కొద్దీ న్యురాన్ లు  ఒకదానికొకటి కలిపే ఉంటాయి .
ఈ విధమైన నిర్మాణం మనకు ఒక సత్యాన్ని తెలియ చేస్తుంది .
అదే ,సమాచార మార్పిడి .
 ఈ నిర్మాణం తో, ఈ సృష్టి లో ప్రతి ఒక్కటీ  సమాచారాన్ని ఇచ్చి పుచ్చు కొంటుంది .
అందుకే మన జ్ఞాన ఇంద్రియాలకు మూలం ఐన మనస్సు నిరంతరం సమాచారం కోసం వెంపర్లా డు తుంది .

మనిషి,  ఈ సృష్టి కి మూల కారణ మైన చైతన్యా న్ని   ఎలా చూడగలడు ?
మన కళ్ళతో పదార్ధాన్ని చూస్తున్నాము . పదార్ధానికి 3 మితులుంటాయి(3-dimensional) .
చుట్టూ ఉన్న శక్తి లో చాలా కొద్ది భాగా న్ని  కంటితో చూడక పోయినా , అనుభవిస్తున్నాము .
ఆ శక్తినే వివిధ పేర్ల తో పిలుస్తున్నాము . శక్తికి ఉన్న మితులు ఇన్ని అని  మనం చెప్ప లేము .
శక్తి అంటే తీవ్రమైన స్పందన ఉన్న పదార్ధం . పదార్ధం అంటే స్పందనల తీవ్రత బాగా తగ్గి ఉన్న శక్తి . 
కొన్ని స్పందనలను ( కొన్ని పౌన పున్యం లు ) మాత్రమే మనకున్న జ్ఞా నెంద్రియా లతో ,
శాస్త్ర పరిక రాలతొ కనిపెడుతున్నాము.
అంటే సమాచారాన్ని గ్రహించి, పాత జ్ఞాపకాలతో పోల్చు కొని,బేరీజు వేసుకొని ,
చివరకు దాని అర్ధాన్ని అవగాహన చేసు కొంటాము .
శాస్త్ర పరికరాలు --->జ్ఞాన ఇంద్రియాలు ---> జ్ఞాపకాలు ---> పోలికలు ---> అవగాహన -->అనుభూతి . 

మన పరికరాలతో చేసే పరిశీలనకు అందని స్పందనలు ఎన్నో .

మనిషి objective perception కి  బాగా అలవాటు పడ్డాడు .
అంటే,  ఇంద్రియాల రారాజు మనస్సు, ఎప్పుడు బాహ్యం వైపుకే తిరిగి ఉంటుంది .
కానీ చూసే విషయాలలో అంతర్యం గా ఉన్న ఆత్మ ని అనగా చైతన్యాన్ని చూసే పరిజ్ఞానం మనిషికి లేదు .
మరి ఆ పరిజ్ఞానం మనిషి ఎలా సాధించాలి ? 
ఖగోళం ,బ్రహ్మాండం అంతా నీలోనే ఉందని మనిషికి చెబుతారు ఋషులు .
దానితో మనిషి కంగారు పడి ,ఇంతంత లేసి ఉన్న ఈ గ్రహ నక్షత్రాలు నాలోనే ఉన్నాయా ? అని అనుకొ ని ఋషులు చెప్పేవి నమ్మశక్యం కాదు అని ఒక అభిప్రాయం పెంచు కొంటాడు .

కానీ ఋషులు  చెప్పేది ఏమిటీ అంటే , కని పించే ప్రపంచం లో అంతర్లీనం గా ఉన్న చైతన్యం గురించి .

సరే ,కంటికి కనబడని చైతన్యం పై మనిషి ఎలా నమ్మకం పెంచు కోవాలి ?
నీ కంటికి కనపడక పోయినా వేడిని ,చల్ల దనాన్ని ,వాసనలు మోసు కొచ్చే గాలిని ,నువ్వు నమ్మడం లేదా ?

అవి నాకు అనగా నా జ్ఞానేంద్రియా లకు  అనుభ వా న్ని కలగ చేస్తున్నాయి ,అందుకే వాటిని నమ్ముతున్నాను .
నా శ్వాస ద్వారా గాలి లోపలి వెళ్లి ప్రాణాన్ని ఉద్దీపనం చేస్తుంది - అందుకే గాలిని  నమ్ముతున్నాను.
పంచ భూతాలలో మట్టిని ,నీటిని ,నిప్పుని  కంటితో చూస్తున్నాను . గాలిని అనుభూ తిస్తున్నాను .
అనగా మనస్సు తో నే తెలుసు కొంటు న్నాను . కానీ,"ఆకాశం" ను నేను తెలుసు కోలేక పోతున్నాను .
పంచ భూతాలలో 4 భూతాలను మనస్సు తో నే చాలా తేలికగా కనుగొం టున్నా ను . ఒక్క ఆకాశ భూతాన్ని తెలుసు కోలేకున్నాను .

మనస్సులో సూక్ష్మ మైన "చిత్ " , ఆకాశ రూపమే . దానినే యోగ పరిభాషలో చిదాకాశం అని అంటారు .
ఆకాశం అనేది మిగతా భూతాల కన్నా సూక్ష్మ భూతం . అనుభవానికి వచ్చిన ప్రతి విషయాన్ని రికార్డ్ చేయడమే దాని ధర్మం.
చిదాకాశం  పూర్తిగా శు భ్ర పడే వరకు జన్మ సంసారం,కర్మ చక్రం  తప్పదు .
మన మనస్సులో "వాసనలు -గుణాలు"(traits) ఉండే ది చిత్తం లోనే .

ఆకాశాన్ని అనుభూతిలోకి తెచ్చు కోవడానికి ఉన్న మార్గం - చిత్తం లో పుట్టే సంకల్పాలను సాక్షి గా గమ నిస్తూ ఉంటే కొంత సమయానికి చిదాకాశం అనుభవం లోకి వస్తుంది .
ఈ విధం గా పంచ భూతాలను సూక్ష్మ పరిశీలన చేస్తూ ఉంటే ,ఆ గమనిక చైతన్యానికి అనగా
ఆత్మ స్థితికి దారి తీసి మన నిజమైన ఉనికి ఆత్మగా తెలుసు కొంటాం .
ఇన్నాళ్ళూ ఎంత మాయలో ఉన్నామో, ఎంత గా ఇతరులను రాగ ద్వేషాలతో చూశామో ,
ప్రకృతిని ఎంతగా నాశనం చేసామో తెలిసి ఆశ్చర్య పోతాము .

ఇన్నాళ్ళు నేను అనుకొన్న వేమీ "నేను" కాదు అనే సత్యం ప్రకటిత మవుతుంది .
అచ్చం నీవే ,అది నీవే !
 నీ "నిజమైన నేను" అదే ఐనప్పుడు నీకు ఏ రక మైన బాహ్య ప్రేరణ సరిపోదు . 
 వాటికి సంబంధించిన జ్ఞానం   నీలో అంతకు మునుపే ఉంటే నే, బాహ్య ప్రేరణలు త్వరగా అర్ధమై ,
నీకు అనుభవాన్ని ఇస్తాయి .

 35 తత్వాలతో ,అనగా 35 రకాల స్పందనలు చైతన్యం నుండి మొదలై ,అవన్నీ ఒక మాత్రిక/matrix ( ప్రక్రుతి మాత లేదా మూలపుటమ్మ లేదా యోని or an enclosure within which something originates or develops  ) లాగ పనిచేసి క్రమం గా కారణ శరీరం ,ఆస్త్రాల్ శరీరం ,భౌతిక శరీరం గా పరిణామం చెందుతాయి .

19 తత్వాలతొ సూక్ష్మ శరీరం ఉంటుంది.
అహంకారం,చిత్తము,బుద్ది,మానసం,5జ్ఞాన ఇంద్రియాలు,5కర్మ ఇంద్రియాలు,5ప్రాణాలు(five life forces categorised on their direction of force) .
ఈ సూక్ష్మ శరీరానికి మరో 5 భూతాలు (coarse substance)-ఆకాశం,నీరు,గాలి,నిప్పు,మట్టి,
 తోడైతే భౌతిక శరీరం తయారవుతుంది .
గమనించ వలసిన విషయం , ఈ పంచ భూతాలూ సూక్ష్మ స్థాయిలో తన్మాత్రలుగా (fine substance)
సూక్ష్మ శరీరం లో(astral body) కూడా ఉంటాయి .

కానీ పై విషయాన్ని ఇంకా చక్కగా అర్ధం చేసుకోవా లంటే ----
విశ్వ చైతన్యం ---- లో ఒక స్పందన -ఆత్మ  -----కారణ కోశం --మరిన్ని రకాల స్పందనలు / 35 తత్వాలు ---- 19 తత్వాల ఆస్త్రల్ కోశం  ----- ఘనీభవించిన  స్పందనలు ----- 16 తత్వాల భౌతిక శరీరం . 

మనిషికి అనుభూతి కల గా లంటే ఏదో ఒక బాహ్య ప్రేరణ అవసరం .
ప్రేరణ,అనుభూతి  అనేది మానస ధర్మం.
కానీ,ఋషులు ఒక్కటే చెప్పారు .  మనస్సుని పూర్తిగా లేకుండా చేస్తే మిగిలిన స్థితే ఆత్మ స్థితి.
అంటే కొత్తగా ఒక ప్రేరణ ఉండ నక్కర లేదు . ప్రేరణ కి స్పందించే మనస్సు అక్కరలేదు .

నెత్తి మీద రాయితో కొట్టినా , మత్తుమందు తీసు కొన్నా మనస్సు మాయ మవుతుంది . ప్రాణం ఉంటుంది .
కానీ ఆ స్థితి లో నీవు కూడా ఒక రాయి మాదిరిగా నే ఉంటావు . ఎలాంటి గ్రహింపు ఉండదు .
కానీ ,ధ్యాన ,యోగ మార్గం లో మనస్సుని అంతర్యానం చేయిస్తూ ఉంటే ఒకానొక దశలో చాలా కొద్ది పరిమాణం
లో ఉన్న మనస్సు ఆత్మ స్థితి ని గ్రహిస్తుంది -అని కొందరి అభిప్రాయం  .
మనస్సు పూర్తిగా కరిగిన తర్వాత ,మిగిలే ఆత్మ స్థితి ని
అనుభూ తిం చేది ఆత్మే - అని మరి కొందరి అభిప్రాయం .
కానీ,దేనితో ఆత్మని అనుభానికి తెచ్చు కొంటు న్నా మనేది అప్రస్తుతం .
ఆత్మ అనుభవం - ఆత్మ స్థితి అనేది ముఖ్యం .  

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి