లోకకల్యాణా నికి నాంది......

ఓం గం గణపతయే నమః 
   బ్లాగ్ పాట కులకు వినాయక జన్మదిన శుభాకాంక్షలు . 

గణపతి ఆరాధన సమస్త నాగరికతలకు అత్యంత ముఖ్యమైన పండుగ .
సృష్టి ఆరంభం కాక ముందు ,అనగా చైతన్యం (పురుష), శక్తి కలిసి ప్రక్రుతి గా (సృష్టి గా ) మారక ముందే
గణపతి ఆవిర్భావం జరిగింది .
గణపతి లేదా 33కోట్ల దేవతలు - ఇవన్నీ "చైతన్య -శక్తి" స్పందనలు , అనగా వేర్వేరు
 పౌన పున్యా లున్న(frequency)  శక్తి తరంగాలు .
ఈ తరంగాలు ఎలా ఉంటాయో మన ఇంద్రియాలకు అందదు .
ఈ శక్తి తరంగాల స్పందనను ఒక శబ్ద తరంగం లా, ప్రతిధ్వని లా (Resonance) వినడానికే ద్రష్టలు మంత్ర శబ్దాలను మనకిచ్చారు . అందుకే "మంత్రాధీనం దేవతా "  అని అంటారు మంత్ర వేత్తలు .
అంటే అర్ధం , ఆయా దేవతా శక్తులు ఆయా మంత్రాల తరంగాలకు ఆకర్షింప బడతాయి .
"గం ...... " అనే శ బ్డా న్ని  శ్రద్దగా  జపం చేస్తూ ఉంటే  గణపతి శక్తి మన
నాడీ  శరీరం లోకి ప్రవే శిస్తుం ది .
కానీ , ఒక షరతు -మన శరీరం ,నాడులు అన్నీ శుద్ది గా ఉండాలి .
లేకుంటే ధనాత్మక శక్తులకు ,మనలో పేరుకు పోయిన ఋణాత్మక శక్తులకు ఘర్షణ ఏర్పడి
కొన్ని సమయాలలో శరీరం , మనస్సు గందరగోళ పడుతుంది .
అందుకే మంత్ర శాస్త్రం పై సంపూర్ణ అవగాహన ఉన్న గురు ముఖతా
మాత్రమే మంత్రం లేదా శబ్ద సాధన చేయాలి . ముఖ్యం గా యమ ,నియమాలు పాటించాలి .

అలాగే ఆయా దేవతలకున్న స్పందనలను కొన్ని రంగులు ఆకర్షించు కొంటాయి .
ఉదాహరణకు ,గణపతి అనే స్పందనలను ఎర్రని మందార పుష్పం చక్కగా ఆకర్షించి పీల్చు కొంటుంది .
అందుకే ఎర్ర మందారాల తో గణపతిని పూ జించమని  రుషి వాక్యం .

సకల సృష్టి దైవ లీల .
ఈ సృష్టిలో వ్యక్త మయ్యె ప్రతి దీ కూడా పరిణామం చెందుతూ చివరకు అవ్యక్త చైతన్యం
లోకి మిళి త మవ్వ వలసిందే .
ఈ చైతన్య పరిణామం క్రమం ఎలా ఉంటుందంటే -----
 రకరకాల పాళ్ళలో పంచ భూతాల సమ్మిశ్రిత మైన  ప్రతి వస్తువు లో చైతన్యం ఉంటుందని తెలుసు .
ఖనిజాలలో ఈ చైతన్యం సుప్త అవస్థలోనూ ,మొక్కలలో అర్ధ చైతన్యం తో ను ,
కీటకాలు మొదలగు జంగమాలలో కాస్త మెరుగైన చైతన్యా వస్త తోనూ ,
మనుషులలో తొలుత బాల్యం లో పశు సమాన చైతన్య మున్నా ,పూర్ణ పరిణామానికి
అవకాశమున్న స్థాయి లో చైతన్యం ఉంటుంది .
ఈ సృష్టి ముఖ్య ఉద్దేశం చైతన్య పరిణామ మే . 
 పరిణామ చక్రం, అనగా మాయ ని ముసుగు లా వేసు కోవడం ,
తర్వాత ఆ ముసుగుని తొల గించు కోవడం -ఇదే ఆ చక్రం .
పరిణామానికి మూల క్రియ సత్య జ్ఞాన అన్వేషణ . 
ఓం ప్రధమం గా సృష్టి చక్రానికి ఆది అవస్థ గణేశుడు .
అందుకే మనిషి ఏ పని తల పెట్టినా ,ముందు గణేశు ని తలచి కొలుస్తాడు  .

సత్యాన్వేషణ కి జ్ఞానం అవసరం . ఆ జ్ఞాన అన్వేషణ లో బుద్ది ని పెంచు కొని ,వివేక విచక్షణ లను అభ్యాసం చేసు కొంటూ  మూలాధారం లో పేరుకొని ఉన్న అనేక జన్మల వాసనల ను భస్మం చేసుకొనే కార్య క్రమానికి
గణేశు ని ముందుగా పూజించాలని  మహర్షుల వాక్యం .

మనం     బాల్యం  నుండి నేర్చు కోవడం మొద లేడతాం . మనిషి జీవనానికి జ్ఞానమే పరమావధి .
బుద్ది వికసిస్తే శక్తిని ఉపయోగించు కొనే అర్హత వస్తుంది .
మూలాధార శక్తి  ని దక్షిణ ద్వారం ద్వారా(అధో ముఖం గా )  పయనింప చేయడం అనగా -సంతానోత్పత్తి, మలమూత్ర విసర్జన ,అనేవి జీవికి అత్యవసరం . కానీ,మనిషి వీటి తోనే ఆగి పోకూడదు .

శక్తిని ఉత్తర/ ఊర్ధ్వ ముఖం గా కూడా పయ నింప చేయాలి .
అలా చే యా లంటే ,యమ నియమాలు పాటించా లని గణపతి రూపం మనకు బోధిస్తుంది . 
పెద్ద చెవులు బాగా విని జ్ఞానం సంపా దించాలని ,
చిన్ని కళ్ళు నిశిత మైన చూపు ఉండాలని ,
అటు పెద్ద వస్తువులను ,ఇటు చిన్న సూది లాంటి సూక్ష్మ వస్తువులను అలవోకగా తీసుకొనే తొండం,మనిషి బలం గాను, విచక్షణ తోనూ ఉండాలని,
ఏక దంతం ద్వంద బుద్ది ని విడనాడా లని ,
ఎప్పుడూ ఏదిపడితే అది నమిలేసే ఎలుక లాంటి ఇంద్రియాలను ఆధీనం లో ఉంచుకోవాలని,
సిద్ది బుద్ది ప్రదాయకుడు ,శక్తి సంపుటికి కాపలా వాడు ,సప్త ధాతు యుక్తమైన శరీరానికి రక్షకుడు ఐన
గణపతి రూపం సదా మనకు బోధించే లా ఋషులు దర్శించి స్తుతించారు .

మీ అరిచేతులు ,పాదాలు వేడి గా ఉన్నాయంటే మూల శక్తి లోని ఎక్కువ భాగం
మీ కోరికలకు ఖర్చు పెడుతూ న్నారని అర్ధమ్.
ఎప్పుడైతే కోరికలు  చల్ల బడతాయో ,అవి కూడా చల్లగా ఉంటాయి .
ఆ చల్లదనం కోసం, అలాగే కోరికలను మితం చేసు కొంటామని సంకల్పం చెప్పుకొని ,
 పచ్చని పచ్చి పత్రీ తో గణపతిని పూజిస్తాము .

మిగతా నాడీ చక్రా లన్నీ సుషుమ్నా తో కలిసి ఉన్నా , మూల చక్రం ఒక్కటే
అత్యంత ముఖ్యమైన సుషుమ్నా నాడి  కి బయట ఉంటుంది .
మూలాధారం నుండి సుషుమ్నా మార్గాన్ని వేరు చేస్తూ గణపతి( బుద్ది ) కావలి గా ఉంటాడు .
గణపతి కరుణిస్తే ,అనగా బుద్ది (వివేకం, విచక్షణ ) వికసిస్తే నే, మూల శక్తి సుషుమ్నా
 మార్గం లోకి ప్రవే శి స్తుం ది .
గణపతి నాగ యజ్ఞోప వీతం, మూల కుండలినీ శక్తికి సంకేతం .
పవిత్రమైన గుర్తులైన ఈ రూపాలను (sacred symbols&sacred geometry)ఎవరికి వారు
ఇ ష్టం వచ్చిన రీతిలో అర్ధం చేసుకొని, వాటినే తంత్ర మార్గంలో సాధన చేయడానికి
ప్రయత్నాలు చేసి ఎంతో  మంది విలువైన జీవితాలను భ్రష్ట్టు పెట్టు కొన్నారు .
అలాగే , అమ్మోరుకి ఎర్ర రంగు అంటే ఇష్టమని రక్తాన్ని ఏరులై పారిస్తున్నారు .
దుర్గామాత స్పందనలు ఎర్రని రంగు కి ఆకర్షింప బడతాయి .
కాబట్టి , ఎర్రని పుష్పాలతో ,ఎర్రని పదార్దాలైన పిండి వంటలతో ,ఎర్రని కుంకుమతో  మనం పూజిం చ  వచ్చు .
భగవద్ ఆరాధన రాజస, తామస రీతుల్లో ఉండకూడదు .
దైవారాధన ఎప్పుడూ కూడా సాత్వికం గానే ఉండాలి అని జగద్గురువు శ్రీ కృష్ణుడు, గీతలో చెప్పాడు .

మనం ఏదన్నా సంకల్పించి పని చేశా మంటే , అవి మనకు సుఖ సంతోషాలను ఇవ్వాలి .
ప్రక్రుతి పులకిమ్చాలి . పొరుగు వాడు అభినందించాలి . కుటుంబం గర్వం గా తిరగాలి .
హెన్రి ఫోర్డ్ సుఖకర మైన నాలుగు చక్రాల వాహనాన్ని కనిపెట్టాలని గట్టి గా సంకల్పించి చివరకు
కారు తయారు చేశాడు . కానీ అప్పటి కాలంలో అమెరికాలో గానీ, మరే దేశం లో గానీ
కారులు నడిచే రోడ్ లు లేవు . ఫోర్డ్ ఎంతో ప్రయత్నం తో అమెరికా ప్రభుత్వాన్ని ఒప్పించి
నున్నని రోడ్ లు ,గాస్ బంకు లు ఏర్పాటు చేయించడం తో నేడు మనం చూస్తున్న కారు
 మనిషి దైనందిన జీవితం లో విడదీయరాని భాగమై పోయింది .
చూడండి ,ఓ సత్సంకల్పం వలన అటు ఫోర్డ్ తన కల ల ను పండించు కొని లబ్ది పొందాడు ,
ఇటు మానవాళి కూడా  విలువైన కాలాన్ని ఆదా చేసే మంచి సౌకర్యం పొందిం ది .
అలాగే చరిత్ర తిర గేస్తే మహనీయుల కార్యాలన్నీ వారి కోసమే చేసుకొన్నా ,
అవి మిగతా మానవాళి కి కూడా మేలు చేశాయి .
 లోక కళ్యాణ కారక సృష్టి అంటే అదే . 

మూలాధార శక్తి తో  అలాంటి సృష్టి ని చేయాలి మనం . దానికి గణపతి పూజ నాంది కావాలి .
అపుడే మన దేశం,మన ప్రజలు  నిజ మైన గణపతి పూజ చేసి నట్లు గా భావించాలి .
సృష్టి అంటే సంతానోత్పత్తి ఒక్కటే కాదు . ఆ పిల్లలను దేశానికి పనికొచ్చే విధం గా తీర్చి దిద్ది నప్పుడే
లోక కల్యాణం .
అందుకే అంటారు -నువ్వు సృష్టించే ది అందరికీ సుఖ దాయకం కావాలీ అంటే,
బలమైన సంకల్పం , జ్ఞానం, నైపుణ్యం ,తపన, ఉంటేనే సాధ్య మవుతుందని గణపతి ఆరాధన
 ద్వారా మనం నేర్చు కోవలసిన తొలి పాటం .
మనమేమీ పెద్దపెద్ద పనులు చేలేక పోయినా కనీసం మన పెద్దలను
 పోషించి కాపాడు కో లేక పోతే మనం ఎన్ని పూజలు చేసి ఉపయోగం ఏముందీ ?
మన సంకల్పం -
సనాతన్ భారత్ -స్వచ్చ్ భారత్ -శ్రేష్ట్  భారత్ -వీర్ భారత్ -
మన నినాదం -
గణపతి బప్పా మోరియా ...........



Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి