అవిద్య



సనాతన ధర్మ సూత్రం ఒక్క పరా విద్యే కాదు,అపరా విద్య ని కూడా ఎలా ఆచరిం చాలో చెప్పింది .
అపరా విద్య అనేది ఇహ లోక సంతోషాలకు ,శాంతికి ,పుష్టికి , స్వస్థతకు పని కొచ్చే విజ్ఞానం .

సనాతన జ్ఞాన వాహిని లో ఉన్న ప్రతి అక్షరానికి వ్యావహారిక ,ఆధ్యాత్మిక ,తాంత్రిక అర్ధాలు -వీటినే అధిభౌతిక ,అధిఆత్మిక ,ఆధిదైవిక  వ్యాహృతులు ఉంటాయి .
మనం ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోవాలి - మన ప్రపంచ మంతా  "సత్యానికి" వేసిన మేలి ముసుగు.
ఆ ముసుగు కి ,మన ఆలోచనా అనుభూతులను బట్టి రకరకాల పేర్లు  పెట్టి ఆ ముసుగు నే మనం "నిజం"
అనుకొ ని దానితో మమేక మై పోతాము .
ఈ మమేక మవ్వడం కూడా మనుషులలో వివిధ విధాలుగా ఉంటుంది .
అందరూ ఒకే రకం గా ఆలోచించరు .
అందరూ ఒకే రకం గా మమేక మవ్వరు .
అంటే మనుషులలో అమాయకత్వం , అహంకారం ఒకే విధం గా ఉండదు .

అమాయకత్వానికి ఒక ఉదాహరణ :
హైడ్రోజన్ ,ఆక్షిజన్ అనే రెండు మూలకాలు కలిసిఉన్న అణువుని మనిషి నీరు అని అంటున్నాడు .
సామాన్య మానవుడు చూసేది నీటినే గానీ ,ఆ రెండు మూలకాలను కాదు . దీనినే శాస్త్రజ్ఞులు అమాయకత్వం(ignorance) అని ,తత్వ వేత్తలు మాయా ముసుగు (veil)అని అంటారు .
ఆ నీరు రంగు ,రుచి ,ఇలా ఉందని ,అలా ఉందని ; తాగడానికి బాగుందని, బాగో లేదని అనుకోవడం అధ్యాస లేదా మమేక మవ్వడం (thought projection or super imposition) అంటారు .
ఆ నీటిని అందరూ పంచుకొని ఉపయోగించు కోవాలనుకోవడం సాత్వికం .
నాకే ఆ నీరు ఉంది , నేనే అందరికీ పంచాలి అనుకోవడం రాజసం .
నా ఒక్కడికే ఆ నీరు దక్కాలి ,మిగతా వారెవ్వరికీ అది దక్కకూడదు అని అనుకోవడం తామసం .


మనిషి తనకున్న పరిధిలో ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా జీవనం ఎలా సాగించాలో చెప్పే ఇహ లోక ధర్మ ,
న్యాయ శాస్త్రాలు ,అలాగే మనిషి తను ఉండే ఆశ్ర మాన్ని(బాల్య,బ్రహ్మచర్య ,గృహస్తు ,వానప్రస్థ ),తనకున్న బంధాలను (బిడ్డగా ,తండ్రిగా ,సోదరుడిగా ,భర్త/భార్య గా ,తల్లిగా ) ,తన కుండే బాధ్యతలను (వ్రుత్తి ,ప్రవ్రుత్తి )
 అనుసరించి చేయవలసిన  విధులు ,నడవ వలసిన పద్దతులు - సనాతన ధర్మ సింధువు తేట తెల్లం చేసి సమాజాలు శాంతియుతం గా ఉండే టట్లు కట్టుబాట్లు ,ఆచారాలు, సంప్రదాయాలను మనిషికి అలవాటు చేసింది .

అయినా మనిషి సంఘాన్ని, ప్రకృతిని ,చివరకు తన శరీరాన్ని,ఉనికిని కూడా నాశనం చేసు కొంటూ పోతున్నప్పుడు , ఆయా కాలమాన సాంఘిక పరిస్థితులు ఒక సంస్కర్త నో ,ఒక ఆచార్యుడినో ,ఒక ధర్మ పరి పాలకుడినో,ఒక ప్రేమైక మూర్తినో,ఒక కరుణామయుడి నో ,ఒక నిరంకుశ  చక్రవర్తినో పుట్టించి
మళ్ళీ మనిషి  గాడిలో పడేటట్లు  చేస్తాయి .

నేటి సైన్స్ , విభిన్న మతాల మౌలిక ఉద్దేశం మానవాళి సంతోష సౌభాగ్యాలే .
కానీ అవి, అపాత్రుల చేతిలోకి వెళ్లి నప్పుడు అణు యుద్దాలు,మత యుద్దాలు,మత  మార్పిడులు జరిగి
మానవాళి తో బాటు భూమి నాశన మైపోతుంది .

ప్రాపంచిక ధర్మాధర్మ విచక్షణ -
మనుషులను కలిపి ఉంచే ది  ధర్మం .
విడదీసి యుద్దాలకు ఎగ దోసేది అధర్మం .
ప్రకృతి రక్షణ  ,మనిషికి సంపద నిచ్చే జీవుల పోషణ ధర్మం .
వనరుల వినాశనం అధర్మం .
మనుషుల మధ్య సమాన న్యాయం,సమాన అవకాశం ధర్మం .
అసమానత ,అణచివేత అధర్మం .
సరైన సమయం లో సరిఐన వైద్యం ,సత్వర న్యాయం ధర్మం .
అక్కరకు రాని  వైద్యం , అకాల న్యాయం అధర్మం .
జీవుల తిండి పోషణ రక్షణ సమాజ ధర్మం .
దోపిడీ ,మోసం ,అక్రమాలు అధర్మం .
మనిషి కి వాక్కు , నడత ,జ్ఞాన అన్వేషణ,ఆశ్రమ శిక్షణ ధర్మం .
మానవ బానిసత్వం,జ్ఞాన నిరాకరణ అధర్మం .

ఇహలోక ధర్మానికి,శాంతికి ,సౌభాగ్యానికి  ఆయువు పట్టు లాంటి ప్రాపంచిక ధర్మ శాస్త్ర జ్ఞానం
మనువు కాలం నుండి జీవ నది లాగా  మనిషిని పునీతులను చేస్తూ నే ఉంది .
ఆ జ్ఞానాన్ని మన జీవనానికి అన్వయించు కోవడం మనిషి చేతిలోనే ఉంది . 

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి