యోగ చింతన

అనంత మంతా ప్రారంభ మయ్యింది ఒక్క బిందువు నుండి. దీనినే శాస్త్రజ్ఞులు  BigBang  అంటారు .
పరిణామం సాగుతూ నే ఉంటుంది . మనిషి శారీరకం గా కంటే మానసికం గా ఎక్కువగా పరిణామం చెందే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు . అంటే,మిగతా అవయవాల కన్నా , మనిషి మెదడు ఎక్కువగా పరిణామం చెందడానికి అవకాశం ఉంది .
కండరాలు, నరాలు అనేవి ముఖ్యం గా రసాయన విద్యుత్ పై ఆధారపడి పనిచేస్తాయి .
మన కణాలు ఆక్సిజన్ ,కార్బన్,హైడ్రోజన్,నైట్రోజన్  ల పై అమితం గా ఆధార పడి  ఉంటాయి .
ఈ భూమి మనందరి కన్నతల్లి .
ముందు యుగాలలో ఏ  భూమి మన తల్లి అవుతుందో తెలియదు .
ఈ సృష్టి ఆగేది కాదు .
మనిషి మనస్సు కూడా అంత  తేలికగా ఆగేది కాదు .
మనిషి మనస్సులో ఆలోచన ఉన్నంత వరకే ఈ మాయా ప్రపంచం .
ఒక్కసారి ఆలోచన ఆగిం దీ అంటే మాయ పటా పంచ లవుతుం ది .

మనిషి సంతోషం గా ,సంఘం ప్రశాంతం గా ,దేశం సుభిక్షం గా ఉండాలంటే ఏం చేయాలి  ?
ప్రతి వ్యక్తీ కొన్ని నియమాలు పాటించాలి . కొన్ని బాధ్యతలు మోయాలి .
దేశ  సంపద సరి సమానం గా పంచే వ్యవస్థ ఉండాలి .
సమాజం లో పాడి, పంట, వినోదం, విహారం ---ఇవన్నీ సమానంగా దక్కాలి .

కానీ  మనుషు లందరూ ఎలా ఒకే రకం గా ఉండరో ,అలాగే వారు పొందే సంపద కూడా .
బలం (-శారీరక బలం  ,బుద్ది బలం ) ఎక్కువ ఉన్నవారు  సంతోషం గా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది .
బలాలున్నా మనస్సు చురుకుగా లేని వారికి అన్నీ ఉన్నా దుఖం ఉండనే ఉంటుంది .
మనిషి కి మనస్సు కీలక మైనది . 
మనస్సు ఇంతగా అభివృద్ధి చెంద  పోతే మనిషికి ఇంత  గుంజాటన ఉండేది కాదు .
కానీ ,అప్పుడు మనిషి కూడా ఒక పశువు లాగా మిగిలి పోయేవాడు .
మనస్సు మనిషికి ఓ వరం . 
మానవ పరిణామం లో మనస్సు పుష్టి చెందడం మేలి మలుపు .
ఎప్పుడైతే మనస్సు అభివృద్ధి చెందిందో , ఎన్నో సందేహాలు , ప్రశ్నలు.
జవాబు దొరక పోతే మనస్సుకి పదును పెట్టి నిరంతర  ఆలోచనా ధార తో తపస్సు .
జవాబుల కోసం బయటా, మనస్సు లోపలా వెతుకులాట .
అలాగే శరీర రక్షణ కోసం నానా పాట్లు .
ఒకరి పై ఒకరికి అనుమానం ,అసూయ .
కోపం,చికాకు ,ఆక్రోశం,ఆవేదన ,తీవ్ర నిరాశ -ఇవన్నీ గందర గోళానికి ,దుఖానికి దారి తీస్తున్నాయి .
కొందరి స్వార్ధం మరి కొందరి కష్ట నష్టాలకు కారణ మవుతుంది .
తెలివి,బలం గల వారి దురాశ సంఘ అశాంతి కి ,అసమానతలకు దారి తీస్తున్నాయి .

వీటన్నింటి నుండి సామాన్య ప్రజలను రక్షించి వారు కూడా సమాజం లో సంతోషం గా ,శాంతం గా ఉండా లంటే ఏమిటి చేయాలో మహర్షులు అనేక రకాలుగా బోధించారు . అదే సమయం లో మనిషి మానస స్థాయిని బట్టి ఎవరెవరు ఏ పని చేయాలి ? ఎలా ప్రవర్తించాలి ? ఎలా బతుకుని సాగించాలి ? అనే వాటికి సమాధానాలు కూడా చెప్పారు .
బుద్ది జీవులు తాము ఎలా పరిణామం లో పురోగమిమ్చాలి ,ఎలా సమాజానికి స్వాంతన కలుగ చేయాలి ,
అనే విషయాల పై తీవ్ర మేదో మధనం చేసి కొన్ని సూత్రాలు చెప్పారు .

కనిపించే ప్రకృతికి- ఈ సృష్టికి వెనక ఏదైనా కారణం ఉందా ?
మనిషి బతుక్కి పరమార్ధం- గమ్యం ఏదైనా ఉందా ?
ప్రతి సంఘటన వెనక -కార్యకారణ సూత్రం అనేది ఉందా ?
సకల చరాచర సృష్టి  ని నడిపించే శక్తి కి ఆధారం ఉందా ?
అసలు సృష్టికి అలాంటి  ఆధారం ఉండవలసిన అవసరం ఉందా ?
ఇలా ఎన్నో ప్రశ్నలు ....

మనిషి కి ఎన్నో బాధలు -రక్షణ లేదు  ,నీరు,ఆహారం కరువు,ఉండటానికి గూడు కరువు,
సంతోషం లేదు , పుట్టెడు  దుఖం , కలిమి లేముల దోభూచు లాట ,రోగాలు,అరాచకాలు ,అత్యాచారాలు ,కొన్ని ప్రక్రుతి ఉత్పాతాలు ,మరి కొన్ని మానవ కల్పితాలు, మరికొన్ని స్వయం క్రుతాలు .....

ఇవన్నీ చూసిన వారికి శ్మశాన వైరాగ్యం వస్తుంది .
అది పతనానికి దారి తీసే పలాయన మే గానీ మంచి మార్గం కాదు .
మరి కొందరికి వివేకం తో కూడిన వైరాగ్యం సుస్థిర మవుతుంది .
ఏవి నిత్య మైన వి? , ఏవి అనిత్య మైనవి ?
 ఏది  సత్య మైనది  ? ఏది  నిత్యమూ ఆనంద స్థితిని ఇస్తుంది ?
ఏ  స్థితి స్థిర మైన ప్రశాంత తను కలగ చేస్తుంది ?

ఆ వివేక వైరాగ్య మానసిక స్థితి స్థిర మైన వారికి అత్యంత శ్రద్ద ,ఓర్పు ఉండాలని చెబుతూ ,
యోగ సాధకులకు  సనాతన మహర్షులు రెండు మార్గాలు సూచించారు .
పరివ్రాజక మార్గం -గృహస్థ జీవన మార్గం ---- ఈ రెండూ ఎవరికీ వారు,వారి వారి సాంఘిక ,మానసిక స్థాయిని బట్టి  ఆచరించ దగ్గ విధానా లే . ఒకటి  గొప్పది,రెండోది తక్కువది అనే తేడా లేదు . జరగ వలసింది మనిషి సమతుల్యం గా ఉండటం . కోరికల నుండి ,బంధాల నుండి స్వేచ్చ పొందాలనే తపన ఉండాలి .
ఏ మార్గ మైనా సాధనా పద్దతులు అన్నీ కూడా మనస్సుని నెమ్మ దింప  చేసి ,చిత్తం లోని  పూర్వ గుణాలను
సమూలం గా భస్మం చేసే వే .

సాధకులకు ----
 సంకల్పం అంటే  సంసారం.
సంకల్పం ఉందీ అంటే సంసారం ఉన్నట్లే .
సన్యాసి గా ఉన్నా , గృహస్తు గా ఉన్నా ,సాధకులు సంకల్పాన్ని అధిగమించ డ మే సాధనా గమ్యం .

సాధనా మార్గం లో లేని వారు , మానవత్వం తో మెలగడ మే కనీస బాధ్యత .
సేవ , ప్రేమ తో కూడిన సేవ ,ప్రతిఫలం ఆశించని సేవ , సాత్విక సేవ మామూలు మనిషి గమ్యం ...
మథర్ థెరీసా ,మాతా అమృతానంద మాయి , ఛారిటీ  సంస్థల ద్వారా ఆర్తులకు సేవ లందిస్తున్న ఎందరో మహానుభావులు, ఇంకా ఎందరో అజ్ఞాత సేవా మూర్తులు ---మనందరికీ ఆదర్శం కావాలి .
వారి పదం లో పదం వేసి కదం తొక్కాలి మనం  .
మనుషులం మనీషులుగా ఎదగాలి మనం .......


Comments