progressive expansion of consciousness.
శరీరం తప్ప మరేదీ తెల్వదు. ఆకలి,నొప్పి లాంటి శరీర గత బాధలు తెలుస్తాయి .
సిగ్గు , ఎవరైనా చూస్తార నే జంకు , బిడియం లాంటి మానసిక భావాలు ఉండవు .
కొంచెం పెద్దైన తర్వాత ఎరుక మానసిక స్థాయికి,ఆ తర్వాత విద్యాబుద్దులు నేర్చిన తర్వాత ఎరుక,
"బుద్ది" గత మవుతుంది. అప్పుడే సిగ్గు,లజ్జ, బిడియం ,ఎవరే మను కొంటారో
అనే భావాలు పొ ట మ రిస్తాయి .
మనస్సులొ కలిగే భావాలను గుర్తించి,వాటి పై ఆలోచన చేయడం ,అవసర మైన వాటిని సాధించు కోవడానికి బుద్దిని ఉపయోగించడం చేస్తారు.ఆ పైకి ఎరుక వెళ్ళదు. ఎందు కంటే ,అప్పటికే బాహ్య పర మైన ఆకర్షణలు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి . ఆకర్షణ తో బంధాలు ఏర్పడ తాయి .
ఎరుక విస్తారం చెందా లంటే , దానికి అంతర్యానం,అంటే మనస్సుని సూక్ష్మ తరం చేయాలి .
అంటే మానసిక స్పందనలను చాలా తక్కువ చేయాలి.
అనగా ఆలోచన లేకుండా మనస్సుని ఆధీనం చేయాలి.
మనస్సు లొ ఆలొచన రాకుండా చేయాలీ అంటే,ఎలాంటి సంకల్పాలు ఉండ కూడదు.
మనిషికి సంకల్పాలు ఎందుకు వస్తాయి?
అంతర్గతం గా ఉన్న (కారణ కోశం )వాసనా గుణాల వలన లేదా బయటి ప్రపంచం లొ ఉన్న వి
ఆకర్షింప చేసి వాటిని పొందా లనే కోరికల వలన, మనిషికి సంకల్పం,భావం,ఆలోచన,కార్యాచరణ -ఇలా ఒక గొలుసు కట్టు చర్య లాగా క్రియలు జరుగుతూ మనస్సు,బుద్ది ఎల్లప్పుడు మహా ఆందోళన తో ఉంటాయి.
మనిషి బయట ఉన్న ఆకర్షణలకు ,బంధాలకు దూరం గా పారిపోయి అడవుల కెళ్ళినా,
వాసనా మయ కారణ కోశాన్ని శుభ్రం చేసు కోక పోతే సంకల్పాలను ఆపలేము.
కారణ శరీరం అనేది మన పుట్టుకకు, ముఖ్యం గా మన మెదడు పని చేసే విధానానికి మూల కారణం .
EEG అనేది మెదడు లో ని విద్యుత్ స్పందనలను తెలుపుతుంది .(electrical impulses in gross matter i.e.brain).
ఆ మెదడు వెనక ఉన్న కారణ కోశం లోని స్పందనలను తెలుసు కొనే పరికరాలు ప్రస్తుతం లేవు .
ఆ స్పందనలను పూర్తిగా తుడిచి వేయాలి . we have to erase all old baggage.
శుద్ది జరగడానికి కారణ కోశం మొత్తాన్ని రి ప్రోగ్రామ్మింగ్ అనగా పునర్వ్యవస్థీకరణం చేయాలి.
అది ఒక్క రొజు,ఒక ఏడు,లేదా ఒక జన్మలో జరిగేది కాదు.
కానీ,పని కట్టుకొని,ఒక నిశ్చల మైన వివేక వైరాగ్య అభ్యాసం తో సంకల్పాలన్నింటినీ
ఆలోచనలుగా మారకుండా కట్టడి చేసే ప్రక్రియే ధ్యానం.
ఉదాహరణ కు రోజుకి 60000 రకాల ఆలోచనలతో మనస్సు హడావిడి గా ఉంటుంది.
ధ్యాన సాధన తొలి మెట్టులో వాటిని ఒకే రక మైన ఆలొచన కే పరిమితం చేయాలి. ఎలా?
ఒక మంత్రమో,ఒక రూపమో,ఒక శబ్దమో,ఒక జ్యోతి పైనో మనస్సుని కేంద్రీకరించి ధారణ చేయాలి.
ధారణ లో ఆలోచన ఉండదు. కేవలం ఒక్క విషయం పై గమనికే ఉంటుంది.
గమనిక లో మానసిక స్పందన ఉండదు .
ఎప్పుడైతే స్పందన లేని స్థితి సుస్థిర మవుతుందో అప్పుడే కారణ కోశ శుద్ది ఆరంభ మవుతుంది .
ఈ విధ మైన ధ్యాన క్రియ తో శుద్ది పూర్తీ ఐన తర్వాత నే ఎరుక ఆత్మ గత మవుతుంది .
ఆత్మ గత మైన ఎరుక లొ మనిషి కున్న అన్ని కోశాల జ్ఞానం కలిసి ఉంటుంది.
ఎలా గంటే ,మనిషి ఎరుక శరీర స్థాయి నుండి మనస్సు కి ఎదిగిన తర్వాత శరీరం గురించి బాగా తెలుస్తుంది .
అలాగే బుద్ది బాగా అభివృద్ధి చెందినప్పుడు ,మనస్సులోని మర్మాలు , మనస్సు ఎలా పని చేస్తుంది? అనే విషయాలు అవగత మవుతాయి .
బుద్దిని దాటి కారణ కోశం లేదా ఆనంద కోశం అవగత మైతే సృష్టి కి కారణం ఏమిటో అవగత మవుతుంది .
దానిని కూడా దాటి ఆత్మ స్థాయికి మనిషి ఎరుక చేరి నప్పుడు , సకలం తేట తెల్ల మవుతుంది .
ఆత్మ ఒక్కటే శుద్ద మైనది ,గుణాతీత మైనది.
మిగిలిన అన్నికోశాలు సంసారపు మకిలి అంటు కొని మలిన మై ఉంటాయి.
అలాగని వాటిని త్రుణీకరించ కూడదు.
we are all visitors to this space&time.
our purpose here is to observe,to learn,to grow , to love.....
and then we return Home.
so good RAJUJI
ReplyDelete