మానవ సంబంధాలు

మనిషి(ఆత్మ) జీవితం ఓ వ్రుత్తం(పూర్ణం). 
మనకు వ్యవహారికం గా పైకి కనిపించే వి- పుట్టుక, జీవనం,మరణం మాత్రమే.
చావు పుట్టుకల మధ్య నున్న కాస్త జీవనం ఎన్నొ అవసరాలతొ ముడిపడి ఉంటుంది.
ఇచ్చి పుచ్చు కోవడాలు అందులో అత్యంత ముఖ్య మైనవి.
మానవ సంబంధా లన్నీ వీటి పై ఆధారపడి ఉంటాయి.మానవ సంబంధాలు
మానవ సంబందా లన్నీ హార్దిక సంబంధాలు కావు,అవి కేవలం ఆర్ధిక సంబంధాలే "  అన్నాడు మార్క్స్ .
ఏవైనా ప్రాణి  ఇంకో ప్రాణి  పై ఆధార పడ వలసిందే . పరస్పర సహకారం అత్యంత అవసరం .

ఎందుకు మనిషి కి ఇవన్నీ?
అన్ని ప్రాణుల లాగా నే మనిషికి కూడా కనీస అవసరాలు ఉంటాయి . అవి తీరా లంటే
మిగతా వాటి సహకారం అవసరం .
మిగతా ప్రాణుల కంటే ,మనిషికి భావ తృప్తి ,ఆలోచనా వ్రుత్తి , బుద్ది బలం  ఎక్కువ .
కాబట్టి , మనిషిలో మనస్సు చేసే హడావిడి ఎక్కువ .
ఎందు కంటే తన నిజ రూప మైన ఆత్మ ఒక సంపూర్ణ ఆనంద స్థితి అనే సత్యం తెలియక,
మనిషి మనస్సు నిరంతరం ఏదో ఒకటి కావాలని కోరు కుంటుంది.
తను అసంపూర్ణం గా ఉన్నానని తలుస్తుంది.
తను పూర్ణ స్థితి కి చేరు కొని ఆనందానుభూతి పొందా లంటే తనలోని అసంపూర్ణత
లేకుండా పోవాలని తల పోస్తుంది .
మనస్సు ఎప్పుడూ ఒక వస్తువు తో,ఒక మనస్సుతో ,ఒక భావం తో -ఇలా ఏదో
ఒక బాహ్య ప్రేరణ తో అనుబంధం ఏర్పాటు చేసు కోవడానికి ఉవ్విళ్ళూరుతూ  ఉంటుంది.
ఎందు కంటే, అలా బంధం లో ఉంటేనే తనకు సంతోషం స్థిరం గా ఉంటుందనే భ్రమలో  ఉంటుంది.
అందుకే మనిషి మనస్సు ,రకరకా లుగా బంధాలను కాపాడు కోవడానికి ప్రయత్నం చేస్తుంది.

ఈ విషయం బాగా అర్ధం,కావా లంటే ఒక ఆడ,మగ మధ్య సంబంధం ని గమ నించండి.
ఒకరికోసం ఒకరు ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తారో !
మనిషి మనస్సు ఇలా బంధాలు పెంచు కొంటూ ,సంతోష మనే త్రుప్తి ని లేదా నిరాశ తో
కూడిన అసంతృప్తి ని పొందుతుంది.
ఆ త్రుప్తి లొనే శాశ్వతం గా ఉండాలని,ఆయా బంధాలను పొషించు కోవడానికి ఎన్నో సర్కస్ లు చేస్తుంది.

అలా కాక,ఆ సంతొషం,త్రుప్తి ఎలాంటి బాహ్య మైన వాటి పై ఆధారపడ కుండా,కేవలం తన మనస్సే,తన భావా లే,తన సంకల్పా లే- తనకు ఆనందం ఇస్తుంటే అది ఇంకా మంచిది.
ఒక విధం గా మనిషి కి ప్రమోషన్ వచ్చి నట్లే .
అప్పుడు మనిషి సంతోషం కోసం, పొరుగు వారి పై ఆధార పడ నక్కర లేదు.
పైగా తనే ఇతరులకు ఆనందాన్ని పంచి ఇవ్వగలడు.
అప్పుడు,ఇతరులు కూడా మన ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు.
ఎందు కంటే మనం సంతొషాన్ని బయటి వారి నుండి కోరడం లేదు.
మీకు తెలుసుగా ,ఎలాంటి షరతులు ఉండని ప్రేమని అందరూ కోరు కొంటారు .

మనం ఒక విషయం గమనించా లి .
మనం అందరి నీ కలుపుకు పోయి ,వారి నుండి ఏదీ ఆశించ కుంటే
అందరి సంతోషానికి కారణం మనమే అవుతాము .
ఇరుగు పొరుగు వారు కూడా మన దేహానికి కొనసాగింపే అని భావన చేస్తూ
 ఉండటమే పరిణామం లో అత్యంత కీలకం .

శ్రావణ మేఘం- చల్లని గాలి ,వాన చినుకులను మోసుకొస్తుం ది . ఎవరి కోసం?
హేమంతం లో పసుపు పచ్చని చేమంతి - మంచు బిందువులతో కలిసి నవ్వు తూ ఉంటుంది . ఎవరి కోసం?
తన ఒంటి నిండా ముళ్ళతో వికారం గా ఉన్న ఒక కొమ్మ చక్కని ఎర్ర గులాబీని గుబాళి స్తుం ది . ఎవరి కోసం?
మనిషి కూడా అలాగే ఆనందం లో మునిగి ఉండాలి . ఆనందం పంచితే తరిగేది కాదు .
అది ఎవరి కోసమో కాదు .
అది తెచ్చి పెట్టు కొన్న స్థితీ  కాదు .
గుండె లోతుల నుండి ఫౌంటెన్ లాగా చిమ్ముతూ ఉండాలి .
కరుణ ,ప్రేమ అనేవి అత్యద్భుత మైన భావాలు .
జీవ పరిణామం లో సూక్ష్మ తర అతి గొప్ప శక్తి వంత మైన భావనా మాయ సంచయాలు .
జాలి వేరు . దయ వేరు .
జాలి లో అహం ఉంటుంది . దయ లో అహం కనపడదు .
జాలి బాధల్లో ఉన్న వారిని చూస్తే కలిగే భావం .
కరుణ స్థిరం గా ఉండే ఒక అద్భుత స్థితి .
అలా జరగా లంటే ఎం చేయాలి ?
మనకున్నవి, 4. శరీరం,భావాలు ,మనస్సు ,ప్రాణ శక్తి . ఇవన్నీ ఒక ఆనంద స్థితిలో ఉండాలి .
శరీర ఆనందం గా ఉంటే  అదే ఆరోగ్యం .
భావాలు  ఆనందం గా ఉంటే  ప్రేమ .
మనస్సు ఆనందం గా ఉంటే  ప్రశాంతత .
శక్తి  ఆనందం గా ఉంటే పారవశ్యం .
Pleasantness -in body -we call it as health&pleasure.
Pleasantness -in mind -we call it as peace & joy.
Pleasantness -in emotions -we call it as Love & compassion.
Pleasantness -in enegies -we call it as bliss & ecstasy.

 మనిషికి ఎంత ప్రాముఖ్యత ఉందో కీటకానికి కూడా అంతే ప్రాముఖ్యత ఈ స్రుష్టి లొ ఉంది.
ప్రాణులన్నీ తమ శరీర ఉనికిని కాపాడు కొంటూ ఉంటాయి.
ఒక్క మనిషి మాత్రం శరీర ఉనికితో బాటు,భావాత్మక,మానసిక ఉనికిని కూడా కాపాడు కొంటూ ఉంటాడు.

సగటు మనిషి ఎలా ఉంటాడు ?
సగటు మనిషి తన శరీరం,మనస్సు,భావజాలం,ప్రాణం -ఇవన్నీ మిగతా ప్రాణుల
మరియు మనుషుల  నుండి వేరు అని అనుకొంటాడు.
అలాగే వాటితో అవసరార్ధం -(సంతొషం,త్రుప్తి, కోసం )- బంధాలు ఏర్పరచు కొంటాడు.
ఆ యా బంధాల పటిష్టత కోసం ఎన్నో యుక్తులు,పధకాలు వేస్తుంటాడు.
ఆయా బంధాలలో తేడా వచ్చినా, రావలసినంత త్రుప్తి రాక పోయినా,సంతోషం తగ్గి
విసుగు పుట్టినా,మనిషి ఆ బంధాల నుండి బయటకు వచ్చేస్తాడు.

బంధాలను,అనుబంధాలను అడ్డు పెట్టుకొని ఇతరుల పై అజమాయిషీ చేయడానికే
 ప్రయత్నిస్తాడు  కానీ,మనిషి అందరినీ కలుపు కొని పోవడానికి ప్రయత్నించడు.

ఎంత సేపూ, ఏ విషయా న్నైనా తన ఒక్కడి ద్రుక్కోణం నుండే చూస్తాడు గానీ,
మిగతా వారి అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వడు.
అలా ఉండటం వలన,బంధాలు బలహీన మై మనుషుల మధ్యన స్పర్ధలు వస్తాయి.
మరి ,మనిషి ఎలా ఉండాలి ?
అందరినీ కలుపుకు పోవాలి . మన శరీరాన్ని ఎలా మనం చూసు కొంటా మో ,మన భావాలను , ఆలోచనలను ఎలా గౌరవిస్తామో అదే మాదిరి గా ఇతరుల శరీరాన్ని ,మనస్సుని చూడాలి .

సరే . మన ఒక్కరికే కలుపు కొనే భావ ము ఉంటే సరిపోతుందా ?
అందరికీ లేకపోతే గొడవలు వస్తాయి గదా ?

"నువ్వు " అంటే ఆత్మ అని అర్ధం . నువ్వు చూడవలసింది నీలో అయినా ,ఎదుటి వారిలో అయినా
ఆత్మ ని మాత్రమే . మిగతా వన్నీ ఆత్మకి పరికరాలు . పరికరాలను కూడా కాపాడు కోవాలి .
ఎదుటి వాడు నిన్ను తిట్టినా ,కొట్టినా ,నీకు అన్యాయం చేస్తున్నా నువ్వు ప్రతిఘటించ  వలసిందే .
స్వయం రక్షణ చేసు కోవాలి . దానిని మానకూడదు . అలా మానితే అది హింస కిందకు వస్తుం ది .
 పరికరాలైన శరీరం,ప్రాణం,మనస్సు -ఇవి  ఎవరివైనా వాటిని క్షోభ పెట్ట కూడదు .
ఎదుటి వారు అన్యాయం చేస్తున్నా ,ప్రకృతికి హాని చేస్తున్నా వారి ని ఆపాలి . అది నీ బాధ్యత.
ఇహ లోకానికి ,పరానికి రెంటి కీ ప్రాముఖ్యత ఇవ్వాలని సనాతన ధర్మ సూత్రం చెప్పింది.
రెండూ   దైవానికి బొమ్మా బొరుసులే .
సమతా స్థితి - అందరూ సమానమే - జాతి,వ్రుత్తి, ప్రవ్రుత్తి వేర్వేరు అయినా మనుషులందరి నీ
సమ దృష్టి లో చూడాలని ధర్మం చెప్పింది .
అన్ని ప్రాణులు స్వస్థత తో ఉండే విధం గా మానవుడు ప్రవర్తించాలని ధర్మం దారి చూపింది .
సమస్త భూ, ఖగో ళాల సంభావ్యతను పాడు చేయ కూడదని ధర్మం నొక్కి చెప్పింది .


  • శరీర సాయం తో  "నిష్కామ ఫల అనాసక్తి కర్మ యోగం". 
  • మానసిక అధీనం తో ధ్యాన యోగం
  • భావం ద్వారా భక్తీ యోగం
  • శక్తి(షట్చక్రాలు ,నాడీ చైతన్య సంచలనం ,కుండలినీ ఊర్ధ్వ పయనం) ద్వారా క్రియా యోగం --- 

మన ఇంద్రియాలకు గోచ రించే  నాలుగు పరికరాల ద్వారా ( -శరీరం,మనస్సు,భావం,శక్తి)  పర మాత్మతో,
అనగా అన్నింటి తో మమేక మయ్యే  పద్దతి నే యోగం అంటారు .యోగం అంటే కలిసిపోవడం .

తను వేరు మిగతా వారు వేరు అనుకొనే స్థితి నుండి అందరూ
ఒక్కటే అనే ద్వందాతీత స్థితికి చేరు కోవడ మే వైరాగ్యం.
సంకల్పాలు,కోరికలు లేకుండా, అన్నింటి మీదా ఉదాసీనతని విరక్తి అంటారు.
ఈ సమస్త మానవాళి,ప్రక్రుతి,భూమి,అంతరిక్షం 
                సమతుల్యత లొ ఉండే స్థితి ని సదా కోరు కొందాం.
సర్వేషాం స్వస్తిర్భవతు . 
సర్వేషాం శా న్తిర్భవతు 
సర్వేషాం పూర్ణంభవతు 
సర్వేషాం మంగళం భవతు -
లోకా సమస్తా స్సుఖినో భవంతు . 

Comments

Post a Comment

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి