దేవుడు చెప్పిన కధ .(God's Story)

                                                       ఓం గణపతయే నమః
నేను దైవాన్ని అయినా,  మనిషి నమ్మకానికి విలువ ఇచ్చి తొలుత గణేశు ని తలచి , నా కధ చెబుతున్నా .
నా స్థితి , అనంత మైన శక్తి తో అనంత మైన ప్రజ్ఞ తో, దేశ కాలా లకు అతీత మైన ఎలాంటి గుణములు లేని స్థితి.
అనంత  చైతన్యంతో, కేవలం ఎరుకతో ఉన్న "నేను"  ఓ సంకల్పం తో శక్తిని ఉద్భవింప చేశాను .
ఈ శక్తి సంచయాన్ని జగన్మాత అని మీరు పిలుస్తారు .
శక్తి ఒక్క సారిగా విస్ఫోటనం చెంది క్రమం గా పదార్ధం గా మారడం మొదలు పెట్టింది .
శక్తి తునకలు పర పరమాణు వులుగా(sub atomic particles &waves) ,
తర్వాత పరమాణువులు గా(atoms) , ఆ తర్వాత  అణువులు గా(molecules) ,
పెద్ద పెద్ద అణు  సముదాయాలుగా(crystal,mineral aggregations),
విస్తరిల్లుతూ అంతరిక్ష ప్లాస్మా గా, ఖగోళ ,నక్షత్ర గ్రహ మండలాలను ,
వాయు ధూళి ధూసరిత నెబ్యూలాలు గాను ,క్వాజర్ లు గా విస్తరిల్లుతూ
దానితో పాటు ప్రదేశము -కాలము అనే దానిని  కూడా విస్తరింప చేసు కొంటూ ఉన్న
 సమయం లో "నాకు" ఓ ఆలోచన కలిగింది .

ప్రాణుల పుట్టుక :
ఆ ఆలోచన తో  శక్తిని ప్రాణ శక్తి గా మార్చి దానిచుట్టూ పదార్ధా న్ని చుట్టేశాను .
( Soul  infusing the pranic energy with intracellular organelles,cells,organs,
organ systems,mind complex). వాటినే  జీవులు(ప్రాణులు ) అని పిలుస్తున్నారు .

అంటే , నిర్జీవులు- జీవులు -వీటన్నిం టి లో "నా చైతన్యం-నా ఆలోచన - నా శక్తి " నిబిడీకృత మై ఉంటాయి . దీనినే తత్వ వేత్తలు పదార్ధ చైతన్యం లేదా ఆత్మ అని అంటారు .

నేనెలా ఉంటాను ? 
నా సృష్టి లో ప్రతిదీ , ఒకే  రక మైన నిర్మాణం తో  -నమూనా(fractal) తో ఉండ మే గాక ,అదే నమూనా మరల మరల(repetition of fractal structure) సృజింప బడి పరిమాణం లో పెద్ద వి అవుతూ ఉంటాయి .
నేను సృష్టించిన విశ్వం నాలోనే ఉంటుంది . ఆ విశ్వం చుట్టూ నేను పరివేష్టింప బడి ఉన్నాను .
తల్లి నుండి బొడ్డు త్రాడు ద్వారా ఎలా గై తే సర్వ రక్షణ, సర్వ పోషణ బిడ్డకి జరుగుతుందో ,
అదే మాదిరిగా నా నుండి వ్యక్త ప్రపంచం లోని ప్రతి దానికీ రక్షణ, పోషణ జరుగుతుంది .

అవ్యక్తం గురించి కాసేపు మరిచి పొండి . నా వ్యక్త రూపం గురించి చెబుతాను .
నా  వ్యక్త స్వరూపం నా అవ్యక్తం లోనే ఇమిడి ఉంటుంది . పాలపుంత ,సూర్య కుటుంబం ,భూమి ,
84 లక్షల  రకాల జీవులు ,మనిషి - వీటన్నింటిలో  పదార్ధ చైతన్యం లేదా ఆత్మ ఉంటుంది .

ఎన్నో ఆత్మలు - అన్నీ నేనే :
ఆయా ఆత్మ ల ని ఆవరించి కారణ కోశం ( ఆనంద శక్తి స్పందనలు) సంస్కారాలతో నిండి ఉంటుంది .
ఆ తర్వాత బుద్ది -మానసం ,చివరికి భౌతిక శరీర కోశం ,వీటన్నింటినీ కలుపుతూ ప్రాణ శక్తి సూత్రం---
ఇలా మనిషి రూపు దిద్దు కొన్నాడు .

అంటే మానవుని ఆత్మ - పంచ కోశాలు అన్నీ  కూడా  నేనే .
కాబోతే  ఇవన్నీ వివిధ రకాల స్థాయి గల స్పందనలు.
కానీ అమాయకత్వం , మాయా ప్రేరేపితం ఐన మనిషి ఆత్మ, సంసారం లో పడి
స్వ ధర్మ మైన నిత్య సచిదానంద  స్థితిని మరిచి పోతుంది .
నాకు కొన్ని నియమాలు ఉన్నాయి . ఆ నియమాల ప్రకారమే  అవ్యక్త -వ్యక్త స్థితులు ,దానిలోని స్థావర జంగామాలు నడచుకోవాలి .
మనిషి తన మనస్సు చేసే మాయలో /మాయా మోహిత మైన మనస్సుతో ఆ నియమాలకు వ్యతిరేక దిశలో
పయనిస్తున్నాడు .
అవిచ్చిన్న మైన  జనన -మరణ  చక్రం అనే సంసారం లో, చర్య -ప్రతి చర్య అనే కర్మ చక్రం లో  తగులు కొని స్వ ధర్మాన్ని మరిచి పోయాడు .

సంస్కారాల ముసుగులో ఉన్న ఆత్మ రూపాన్ని(imaginary diagram) చూడండి .
Samskara is traditionally defined in Yogic philosophy as the habitual thought patterns collected by the ego that interfere with soul consciousness. 
కారణ కోశం లోని సంస్కారాలు(traits) అన్నీ భస్మ మైతే సంసారం అనేది లేదు .
సంస్కారం వలనే కోరికలు .కోరికల వలనే ఆలోచనలు . ఈ ఆలోచనల వలనే మళ్ళీ సంస్కారం .
//సంస్కారం ----> కోరిక ----> ఆలోచన ----అనుభవానుభూతి --->సంస్కారం// .

ఈ సంస్కారాలను బ ట్టే ,  ఆ మనిషి స్పందన ఉంటుంది . 
అనగా మనిషి ఆలోచనా విధానం పైన సంస్కారాల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది . 
అనగా ఒక విధం గా మనిషి తన పూర్వ సంస్కారాలకు  బందీ . -  
  • విషయాల ను ఎలా చూస్తాడు ?
  •  సమస్యలకు ఎలా స్పందిస్తాడు ? ఎలా పరిష్కారం చేస్తాడు ?
  •  గ్రహించే సమాచారా న్ని ఎలా అర్ధం చేసు కొంటాడు ? ఏ దృక్కోణం లో చూస్తాడు ?
  •  మిగతా వారితో ఎలా ప్రవర్తిస్తాడు ?  ---- ఇవన్నీ ఆత్మని చుట్టి ఉన్న కారణ కోశం లోని  వాసనలు - సంస్కారాల పై ఆధారపడి ఉంటాయి . 
  • నేను ప్రాణు లన్నింటి కీ  తమ ఉనికిని కాపాడు కొనే తెలివి ఇచ్చాను . కానీ మనిషికి తార్కిక జ్ఞానం ,ఉహా శక్తి కూడా ఇచ్చాను. అనగా మనిషికి "సంకల్పం -ఆలోచన -ఆచరణ  (ఇచ్చా -జ్ఞాన -క్రియా ) శక్తి "పుష్కలం గా ఇచ్చాను . 
  • మనిషికి అహం ఉండవచ్చు . అహంకారం,గర్వం ఉండకూడదు . 
  • మనిషికి ఆలోచన ఉండవచ్చు . కానీ ఆలోచనలకు  అతుక్కొని ఉండి పోకూడదు . ఆలోచనా శక్తి మనిషికి నేనిచ్చిన వరం . దానిని శాపం గా మార్చు కొంటున్న మనిషిని చూస్తే జాలి వేస్తుంది . 
  • మనిషికి ఇచ్చా శక్తి (free will or choice ) ఇచ్చాను . కానీ 99% మనుషులు విధి కే తల వంచి పశువులు గా మిగిలి పోతున్నారు . 
  • మనిషిలో ప్రాణ మున్నంత వరకు ఆలోచనా సామర్ధ్యం ఉంటుంది . 
  • సృష్టి నియమాలను (వాటినే సనాతన ధర్మాలని  మహర్షులు అంటారు) ఖచ్చితం గా పాటించే బాధ్యత ఈ సృష్టి లో ఉన్న అందరిదీ . 
నా  వ్యక్త విరాట్ రూపమైన  బ్రహ్మాండ విశ్వం, దాని సూక్ష్మాతి సూక్ష్మ రూపమైన క్వాంటం మేఘం(tiny quantum clouds) నమూనా   మీరు తినే  ఆపిల్  రూపం లో(Torus shape) ఉంటుంది . 
(imaginary diagram).
ఒక విధం గా చెప్పా లంటే ఈ సృష్టి లో అన్నింటి లోను - పండ్లు ,విత్తనాలు ,చెట్లు,జీవులు -వీటన్నింటి అంతర్ నిర్మాణం నకు పునాది టోరస్ రూపమే . అంటే ఆపిల్ లాగా నే ఉంటాయి .
వీటి  అక్షం నే మేరువు అని సనాతన భాషలో చెబుతారు . (మేరు పర్వతం కాదు ). ఈ రూపాన్ని పై నుండి చూస్తే సహస్ర దళ పద్మం (సహస్రార చక్రం ) వలె ఉంటుంది . ఒక విధం గా నా వ్యక్త రూపానికి మంచి నమూనా - సనాతన రుషులు ప్రతి పాదించిన శ్రీ యంత్రం. నా అవ్యక్త మునకు స్థితే గానీ రూపం ఉండదు .
మనిషిలోని నాడీ చక్రాలు కూడా ఒకే అక్షం లో ఉంటాయి . ఈ అక్షం ,సకల చరాచర విశ్వపు అక్షానికి అనుసంధాన మై ఉంటుంది .
మనిషి మూలాధారానికి ,భూమి మూలాధారానికి లింకు ఉంటుంది . భూమి మూలాధారానికి సౌర కుటుంబ పు మూలాధారానికి లింకు ఉంటుంది .
ఈ సౌర కుటుంబ పు మూలాధారానికి ,విశ్వపు  మూలాధారానికి లింకు ఉంటుంది .
మూలాధారం నుండి శక్తి ని  మనిషికి ఎల్లప్పుడూ ఇస్తూ నే ఉంటాను . ఆ శక్తిని అన్ని చక్రాల ద్వారా పైకి పంపితే మనిషి చైతన్యం పెరిగి చివరికి నన్ను చేరే విధంగా ఏర్పాటు చేశాను .
నన్ను చేర డానికి ఎన్నో మార్గాలు ప్రతిపాదించారు మహర్షులు .
వాటిలో కనీసం ఒక్క మార్గాన్ని అయినా మనిషి ఎన్నుకొని,
 నన్ను
చేరు కొంటా డని  ఎదురు చూస్తూ ----
మీ దేవుడు .
(నా కధ చెబుతానని ,ఎక్కువ భాగం మనిషి కదే చెప్పాను . ఎందు కంటే ప్రతి మనిషిలో నేనున్నాను .)

Comments

Post a Comment