పరివర్తన

వడియం చాలా ఆందోళనగా ఉన్నాడు . దగ్గర లోనే ఉన్న డాక్టర్ ని సంప్రదిస్తే మందులిచ్చి మళ్ళీ వారానికి రమ్మని సలహా ఇచ్చాడు . అలా చాలా వారాలు గడిచినాక ,ఆందోళన తగ్గక పోయేసరికి,ఏదో గాలో ధూళో ఐ ఉండొచ్చు భూత వైద్యుణ్ణి కలవ రాదా అని  ఎవరో చెబితే భూత నాధ్ ని కలిసి సమస్య వివరించాడు .
భయం పోయే విధం గా నాలుగు మాటలు చెప్పి ,నమ్మకం కలిగే విధం గా  తాయెత్తు కట్టి, అవసర మైతే పెద్ద పూజ చేయాలని చెప్పాడు .
అలా కొన్ని రోజులు గడిచాయి . ఆందోళన కొన్నిరోజులు తగ్గుతుంది . కానీ మళ్ళీ వస్తుంది .
ఈ లోపల  ఎవరో స్వామి గుళ్ళోకి వచ్చారని చెబితే వెళ్లి ఆయనను కలిసాడు .
స్వామీ అడిగాడు,దేని వలన ఆందోళన పడుతున్నావు?దేని కోసం ఆందోళన పడుతున్నావు ? అని .
 ప్రతి విషయానికి ఆందోళన వస్తుంది . అనుకొన్నది జరగక పోయినా, కొత్త వారితో కలవాలన్నా ,
ఎవరే మన్నా  ఆందోళన గా  ఉంటుంది . రేపెలా ఉంట దో అనే బెంగ గా ఉంటుంది -చెప్పాడు వడియం .

జరిగి పోయిందీ  ,జరగ బోయే దానిని గురించి ఆలోచన మానేయ్.
ఇవ్వాళ ,ముఖ్యం గా ఇప్పుడు ఈ క్షణం గురించి మాత్ర మే ఆలోచన చెయ్ .
ఆలోచన అంటే రెండు విధాలు గా ఉంటుంది .
సమస్య ని ఎలా సాధించాలి ? అని చేసే ఆలోచనను మేదో మధనం అంటాం .
ఇక్కడ ఆలోచన  సమస్య సాధన పై ఉంటుంది .
సమస్య పరిష్కారం అవ్వ దేమో ,అవ్వక పోతే ఎలా అని ఆలోచించ డమే  వత్తిడి లేదా ఆందోళన అంటాం .
ఇక్కడ ఆలోచన సమస్య ఫలితం గురించి ఉంటుంది .
మహర్షులు చెప్పింది ,గీతా కారుడు బోధించిం దీ ఇదే . ఫలితం గురించి పట్టించు కోకు . పని చెయ్ .
శక్తి కొద్దీ ,మనస్సు పెట్టి , నైపుణ్యం తో హుషారుగా పని చెయ్ .
పని..  పని...  పని చేయడమే మనిషి బాధ్యత .
చేతిలో పనిలేని వాడికి మనస్సులో ఆలోచనలు ఎక్కువైతాయ్ .
నీ అవసరాలు తీరి నువ్వు ప్రశాంతం గా ఉండా లన్నా , కొంత మందికి
ప్రశాంతతను ఇవ్వా లన్నా  నువ్వు పని చేయాలి .
వడియం కి స్వామి చెప్పింది నచ్చింది .
వడియం సామాన్య రైతు . విత్తనం వేస్తే పిట్టలు తినేస్తాయని ,వరి కోసి కుప్పేస్తే , కుప్పలు తగలడి పోతాయని ,
పంట చేలో నే ఉంది -వర్షం వచ్చి మునిగి పోతాయని , వచ్చే ఋతువులో వర్షాలు పడక పోతే ,
ఈ కరెంటు కోతల కాలం లో పడే బాధలు తలచుకొని ,అలాగే బాంక్ వాళ్ళు
అప్పు కట్టక పోతే పొలం వేలం వేస్తారని ,కొత్తగా అప్పులు ఇవ్వరని ,
పురుగు మందులు , ఎరువులు పక్క రైతులు బాగా వాడుతున్నారు ,నేను వేయ లేక పోతున్నానని--
ఇలా ఎన్నో సమస్యలు ,ఈతి బాధలతో సత మత మయ్యె వడియం,
"ఈ క్షణం లోనే బతుకు " అని  స్వామి చెప్పి నట్లుగా నడచు కోవా డానికి ప్రయత్నం మొదలెట్టాడు .
ఫలితాలు వెంటనే రాలేదు . అయినా వడియం ఈ దఫా పట్టుదలగా ఉన్నాడు .
"క్షణ క్షణం బతుకు"  అనే విధానాన్ని  ఎంతో ప్రయత్నం తో అభ్యాసం చేశాడు .
ఎప్పుడైతే ఇలా తన ఆలోచనా విధానాన్ని మార్చు కొన్నాడో ,వడియం మెదడు సక్రమ పంధా లో ఆలోచించడం మొద లెట్టి సమస్యల పరిష్కారానికి కొత్త దారులు వెదకడం నేర్చు కొంది .
ఎందుకంటే మనం చేసేవి అత్యధిక శాతం వ్యతిరేక ఫలితాల గురించిన   ఆలోచనలే .
అలాగే ఎక్కువ శాతం సమస్యలు మన ఉహ లే . నిజ మైనవి కాదు .
ఇలా జరిగితే ఎలా ? అలా జరగక పోతే ఎలా ? (if &buts).
అంటే ఊహ లవలన , వ్యతిరేక ఫలితపు ఆలోచనల వలన మనం నీరసించి పోతాము .
 చేస్తున్నామని అనుకొంటాం గానీ  సమస్య పరిష్కారానికి మేధోమధనం చేయం .

భయంకర్ కూడా ఎప్పుడూ భయ పడుతూ నే ఉంటాడు . తన అన్న వడియం చెబితే ,భయంకర్ కూడా
స్వామి దగ్గరకు వెళ్లి తన గోడు వెళ్ళ బోసుకొన్నాడు .
స్వామి వడియం కి చెప్పిందే చెప్పాడు . భయ మనేది బయట ఉండదు .
నీ మనస్సులో నే ఉంది . నీ ఆలోచన లే నిన్ను భయ పెడు తున్నాయ్ .
కాబట్టి ఆలోచనలను అదుపులో పెట్టుకో .
ఆసరా కోసం నువ్వు ఎన్ని పూజలు ,తాయెత్తులు ,హోమాలు చేసినా
నీ ఆలోచనలను అదుపులో పెట్టు కోక పోతే అవన్నీ తాత్కాలికపు అలంకరణ లే అవుతాయ్ .
లోపల రక్తం లేనప్పుడు మొగానికి ఎంత మేకప్ వేస్తే లాభం ఏంటి ? ఒంటికి రక్తం పట్టాలీ అంటే మంచి పోషకాహారం బాగా తినాలి . దానికి రెండో దగ్గర మార్గం లేదు .
ఆలోచనలే నీకు విషం గా మారుతుంటే వాటిని...  ఆ విషాన్ని ఆప వలసిందే .

ఆలోచనలు ,అప్రయత్నం గా వచ్చేస్తు న్నాయి .
వాటిని నేను అదుపు చేయ లేక పోతున్నా' అన్నాడు భయంకర్ .

స్వామి చెప్పాడు -
మన గుణా  న్ని బట్టి మనలో భావాలు పుడతాయి . మన వాసనలు పుట్టుకతో వస్తాయ్ నిజ మే .
అదే వాసనలతో మనం బతక నక్కర్లేదు .
ఆ వాసనల నుండి అనగా ఆ గుణాల నుండి తప్పించు కోవడానికి మనకి 'బుద్ది' నిచ్చాడు దేవుడు .
ఎందు  కిచ్చాడు ? పుట్టిన ప్రతి భావాన్ని మనం విచారణ చేయాలి .
అది అక్రమ మైతే దానిని మొగ్గలోనే తుంచి వేయాలి .
వ్యతిరేక భావాలు ప్రతి మనిషికీ పుడతాయి . వాటిని  సక్రమైన పంధాలో విచారణ చేసే బుద్ది ని
 గట్టి చేసు కొంటే కొంత వరకు ఫలితం వస్తుంది . బుద్ది బాగా వ్వా లంటే విచారణా శక్తి పెంపొం దాలి .
దేని కోసం ఏడవాలి ? దేని కోసం భయ పడాలి ?నిత్యా అనిత్య విచారణ ,ఏది సుఖం?ఏది దుఖం?
ఏది మన కి ఆరోగ్య కరం ? ఏది అక్రమం ? - అనే జ్ఞానాన్ని నేర్చు కోవాలి .
అలా నేర్పే వే మన ఇతిహాస పురాణాలు .
వాటిలో ఉన్న వివేక విచక్షణ లను మన బతుక్కి అన్వయ యించు కోవడం అభ్యాసం చేయాలి .
అదే శ్రవణం - మననం -స్మరణం .
సామాన్యులను  కూడా మాన్యులను చేసే జ్ఞానం మహర్షులు మన కిచ్చారు .
ప్రార్ధనా లయాలలో ,  గుళ్ళలో ఎప్పుడే ప్రవచనం చెప్పినా మరిచి పోకుండా ,చులకన భావం లేకుండా వెళ్లి విను .
నీ భయాలు అన్నీ పటా పంచ లవుతాయ్ .

భయంకర్ కి ప్రతి  దానినీ తర్కిమ్చ డం అలవాటు అయింది .
మనస్సు లోనే ప్రశ్న వేసుకొని సందేహాన్ని తీర్చు కోవడం  అలవాటు అయింది.
మనస్సులో పుట్టిన భయాలను బేరీజు వేసుకొని ఏవి  నిజ మైన భయాలు ,ఏది ఉహా జనితం అనే విచక్షణ చేయడం అలవాటు అయింది.
భావాలు వేరు - సమస్యలు వేరు . 
చెడు భావాలను వీలైతే సాక్షిగా చూడటం అలవాటు చేసు కోవాలి .
దాని పై  అదే పనిగా ఆలోచించ కూడదు .
సమస్య ని చూడటం లేదా వీక్షించ డం అంటే వివేకం తో ఆ సమస్యను
కూలంక షం గా మనస్సు లోనే చర్చించి తర్కిం చు కోవడం .
సమస్య ని చూసి భయ పడటం కన్నా , ఆ సమస్య తెచ్చే ఫలితం పై భయం ఎక్కువ ఉంటుంది .
కాబట్టి సమస్యని బేరీజు వేయడం , సమస్య ఉహా జనితమా  లేక నిజ మైనదా ?,
సమస్య కి మూల కారణం , ఆ సమస్యని తొలగించు కోవడానికి చేయ వలసిన పని ,
ఆ పని ఎలా చేస్తే త్వరగా ఆ సమస్య మాసి పోతుంది --- ఆలోచన ఈ పంధాలో నడవాలి అని స్వామి చెప్పింది తు.చ. తప్పక పాటించాడు భయంకర్ . .
కొంత కాలానికి భయంకర్ కి భయం పోయింది .

మోహిని అప్పటికే స్వామి గురించి సోదరు లిద్దరూ చెప్పగా వింది . కానీ వెళ్ళ  లేదు .
మోహిని భర్త విసుగుల య్య భార్య కోరే వస్తువులు కొనలేక ,పొరుగు వాళ్ళతో పోల్చు కొని చేసే గొడవ
లతో  అప్పటికే విసుగెత్తి ఉన్నాడు . అది చాల దన్నట్లు వాళ్ళ అబ్బాయి అసూర్య  బళ్ళో పిల్ల లపై
 అసూయ తో చేసే దాష్టీకం ,అల్లరి - ఇవన్నీ భరించ లేక కుటుంబ సమేతం గా వెళ్లి స్వామిని కలిశాడు .
స్వామి చెప్పాడు - చెప్పే విషయం చిన్న వయస్సు లోనే చెబితే అది మనలో బాగా నాటుకొని మంచి ఫలితాలు వస్తాయి . సహజాతాలు అనగా పుట్టుకతో వచ్చే గుణాలు పిల్ల వయస్సులో ఎక్కువ ప్రభావం చూపుతాయి . దానికి కారణం వారిలో బుద్ది అనేది అప్పటికి బల పడదు . ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ విక సించ దు .
పైగా  పిల్లల్లో తమ ఉనికి ని కాపాడు కొనే సహజాతం ఎక్కువగా ఉంటుంది .
 ఆ ఉనికికి భంగం కలిగించే ది  ఏదైనా వాళ్ళు సహించ లేరు .
దానిలో భాగ మే అసూయ , గర్వం ,కోపం ,కోరికలు .
ఉనికి అంటే తనని అందరూ గుర్తించాలి. మెచ్చుకోవాలి . తనని కాక వేరే వారిని మెచ్చు కొన్నా ,
పొగిడినా ఉనికిని కోల్పో తామే మో అనే భయం వేసి  అవతలి వారి పై కలిగే భావ మే అసూయ .
అసూయ కార్పణ్యా నికి దారి తీస్తుంది.
పోటీ పడటం వేరు . అసూయ తో రగిలి పోవడం వేరు .
పోటీ అనేది మనలోని విద్వత్తు ని సాన పెట్టి నైపుణ్యాన్ని పెంచుతుంది .
అసూయ అనేది అవతలి వాడిని అసహ్యించు కొనే టట్లు చేసి మనం దిగజారి పోయే టట్లు చేస్తుంది .
పోటీ అనేది నిర్మాణాత్మక సక్రియ . అసూయ అనేది వినాశన కర దుష్క్రియ .
చేత కాని వాళ్ళు అసూయ పడతారు .
చేవ ఉన్న వాళ్ళు పోటీ పడతారు .
కాబట్టి మీ అబ్బాయి అసూర్య నీతి శతకాలు బాగా చదివి, అర్ధం చేసు కొని రోజు వారీ దిన చర్య లో
ఆ నీతిని అమలు చేసే టట్లు చేయ వలసిన బాధ్యత మీదే . 
ముఖ్యం గా విద్య తో నే విలువలు(morals) నేర్పాలి . అదే అలవాటు గా మారి వ్యక్తిత్వం (character)
అభివృద్ధి చెంది విద్యార్ధి సంఘ జీవ నానికి అర్హత సంపాదించు టాడు . వ్యక్తిత్వం లేని వారు తల్లితండ్రుల అదుపు లోనే ఉండాలి . వారికి తమంత తామే జీవనం సాగించే స్వేచ్చ ఇవ్వకూడదు .   

ఈ లేత  వయస్సు లోనే మనం "బుద్దిని" కలగచేయ క పోతే ఏమవుతుందో
నీ భార్య మోహిని ని చూస్తే అర్ధం అవుతుంది . 
మోహం - చూసిన ప్రతి వస్తువు పై వ్యామోహం . చూడటం తో ఆగరు . దానిని పొందే వరకు తపన పడతారు .
పొంది నాక దానిని మరిచి పోయి మళ్ళీ వేరే కొత్తది దేని నైనా కోరు కొంటారు .

కోరికలు తీర్చు కోవడానికి మనకు కావలసింది ఆరోగ్యం -డబ్బు .
ఇంకో విధం గా చెప్పా లంటే ,  ఆరోగ్యం -డబ్బు ని ఎర  వేస్తే నే నీ కోరికలు తీరతాయి .
కోరికలు పెరిగిన కొద్దీ ఆరోగ్యం - డబ్బు తరుగుతూ ఉంటాయి . అంటే కోరికలకు కూడా హద్దు ఉన్నట్లే .
అలాగే మనం కోరికలు తీర్చు కొనే క్రమంలో  కుటుంబ సభ్యులకు , పక్క వాడికి,ప్రకృతిలో ఉన్న చెట్టూ చేమకు హాని కలగకూడదు .
అలా హాని జరుగు తుంటే ,వెంట నే నువ్వు అడవు ల్లోకి పోవాలి . సంఘం లో ఉండే అర్హత కోల్పోయి నట్లే .
పూర్వ కాలం లో సంఘ వ్యతి రేకులను అడవు ల్లోకి పంపే వారు . రాక్షసులు అంటే సంఘానికి వ్యతి రేకం చేసే వారు .

మనిషి- వేట ,కొండ గుహ వాసం నుండి వ్యవసాయం, చేతి వృత్తులకి ఎదిగే పరిణామం లో  భాష ,దానితో సమాచార మార్పిడి ,దీనితో తార్కిక శక్తి ,ఉహా శక్తి మనిషికి పెంపొం దాయి .
నాగరికత కు అక్షరం చేసినం త మేలు ఎవరూ చేయ లేదు . 
ఆ శక్తిని మన అస్తిత్వాన్ని కాపాడు కోవడానికి ఉపయోగించాలి .
మనస్సులో అదే పనిగా పుట్టే  కోరికలను తీర్చు కోవడానికి వినియోగిస్తే మనిషికి ప్రశాంతత ఉండదు .

 కోరికలను మితం చేసుకొని సంఘం లో ఉండాలా ? లేక అడవుల దారి పట్టా లా ? అనేది నీ భార్య
 మోహిని నిర్ణ యించు కోవాలి .
చూడు ,విసుగు లయ్యా , మనం చేసే పని లో ఇష్టం లేక పోయినా, మన జీవితం లో దుఖం ఎక్కువై నా ,
మనస్సుకి శాంతత లేక పోయినా జీవితం పై విసుగు కలుగు తుంది .
నీ విసుగు కి కారణం నీకు తెలుసు. అది నీ కుటుంబ సభ్యులే . కొంత వరకు నయం .
మన విసుగుకి , దేశ పరిస్తితు లో, క్షామమో,యుద్ధమో అనుకో...  అప్పుడు మనకి ఎంతో ఓర్పు ఉండాలి .

కాలం   తిరు గు తుంది .
అసూర్య  కి ఇప్పుడు నీతి శతకాలు కంట తా రావడ మే కాదు ,తల్లికి కూడా నేర్పేస్తున్నాడు .
బళ్ళో బుద్ది మంతుడు గా పేరు తెచ్చు కొన్నాడు .
మోహిని లో  కూడా మార్పు కనీ పిస్తుంది . ఇది వరకు లా ఇతరులతో పోల్చు కోవడం ,అవీ ఇవీ కొనమని సతాయించడం లేదు .
విసుగు లయ్య కి విసుగు ముసు గేసుకు పోయింది .

అదే ఊరిలో రాగ ద్వేషిణి  అనే ఒక నర్తకి ఉంది .
ఆ ఊరు ఈ మధ్య నే కొత్త రాజ దానిగా మారే అవకాశం ఉందని మీడియా లో భోగట్టా .
పొలాలు ,స్థలాల కోసం వచ్చే పోయే వారితో ఆ ఊరు కళ కళ లాడుతుంది .
నర్తకి కి చేతి నిండా పనే . ధనం ముడితే ఇష్టం -ఎప్పుడు డబ్బు రాలడం లేదో  అయిష్టం .
 ఈ ఇష్టాయిష్టాలు పరిస్తితు ల పైనే గానీ వ్యక్తుల పై కాదు .
చేసే వృత్తికి, డబ్బు కి  ఎవ రైతే లంకె వేస్తారో వారికి ధన మే లోకం .
ఆ వ్రుత్తి లో కూడా సుఖం ఉండదు వారికి .
అది చివరకు తీవ్ర నిరాశకు దారి తీసి స్తబ్దు గా ఉండి , మాంద్యం లోకి పోతారు .
అంతటి మాంద్య స్థితి లో  రాగ ద్వేషిణి స్వామిని కలుసు కొంది .

స్వామి ఇలా అనునయించాడు -
మనిషి  వ్రుత్తి - ప్రవ్రుత్తి ని వేరు గా చూడాలి .
 వ్రుత్తి పై పూజ్య భావం ఉండాలి . ప్రవ్రుత్తి సంతోషబరితం  గా ఉండాలి .
కోరికలు వేరు . అవసరాలు వేరు .
శరీరం నిలబడ టానికి కావలసినవి అవసరాలు .
కోతి లాంటి మనస్సు తృప్తి పడటానికి కావలసినవి కోరికలు తీరడం .
అవసరాలు తీరక పోతే సమస్య అని అనుకోవాలి గానీ , కోరికలు తీరక పోతే సమస్య కాదు .
ఈ సంఘం లో డబ్బే బలం . అయినా ధనానికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వాలి .
 లోకం లో 90శాతం కోరికలు , సమస్యలు డబ్బుతో తీరతాయి .
కానీ ఒక్కటి గుర్తు పెట్టు కోవాలి . డబ్బుతో తీరేవి, ఎప్పటికీ తీరని కోరికలే . 
బుద్దుడు చెప్పింది అదే - అవసరాలు తీర్చు కోవాలి . అనగా కోరికలు మితం గా ఉండాలి .
వాక్కు, ఆలోచన మితం గా ఉండాలి .

ఆ తర్వాత రాగ ద్వే షిణి ద్వంద ద్వే షిణి గా పేరు మార్చు కొని వ్రుత్తి లో ,ప్రవ్రుత్తి లో "మితం "
అనే మంత్రం పాటించింది .
మనిషి ఆనందం కోసం అన్వేషణ మానడు . ప్రతి జీవి అంతే .
కానీ నిజమైన ఆనందం అంటే ఏమిటో తెలుసు కొన్న నాడు ,
ఇవన్నీ ఏదో లుల్లాబీ ల లాగా ఉంటాయి .
                                                                    స్వస్తి . 

Comments

Post a Comment

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి