ప్ర జ్ఞానమే గమ్యం .....

సనాతన భారతా వని లో గుణము(aptitude), చేసే పని(actions) ,స్వభావం(man's nature) -వీటిని ఆధారం గా చేసుకొని మనుషులను 4 వర్ణాలుగా వర్గీకరించారు . కాని , పుట్టుకతో వర్ణ నిర్ణయం అనేది  తర్వాత కాలం లో మామూలై పోయి, మనుషులను వర్ణాలుగా కాక వర్గాలుగా విడదీసి , మనుస్మ్రితి కాలానికి అది ఒక చట్టం గా మారింది .

సమాజం లో, జన పదాలలో,రాజ్యాలలో  అగ్ర వర్ణాలుగా పేరు పొందిన బ్రాహ్మణ - క్షత్రియ వర్ణాల వారి మధ్య అధికారం కోసం పెనుగులాట ముదిరి  పోట్లాట గా,  ఆ  తర్వాత పెద్ద పెద్ద యుద్దాలకు దారి తీసి భారత సమాజాన్ని రకరకాలుగా మార్చి వేసింది .

 సమాజ చింతన ,సామాజిక కట్టుబాట్లు ,సంస్కృతి , మనిషి ఆలోచించే విధానం ,సుఖ దుఖాలకు అర్ధాలు , తాత్విక చింతన ,దైవానికి అర్ధం, దైవాన్ని చేరే మార్గం , మనిషి ప్ర శాం తతను పొందే విధానం ,పూజలు,యజ్ఞాలు,తపస్సులు,దానాలు  --  -వీటి అర్ధాలు పలు మార్లు మారిపోయాయి .
తమ తమ సిద్దాంతాలకు అనుగుణం గా వాఖ్యానాలు చెప్పు కొన్నారు .

మనం గమనిస్తే,  వైదిక భావాలను,క్రతువులను  బ్రాహ్మణ వర్ణం వారు ఆదరిస్తే, వేదాలను దాటి వేదాంతానికి మరింత పదును పెట్టే నిరీశ్వర   వాదం ,శూన్య వాదం ,గతితార్కిక వాదం - అనే భావ దారలను ప్రచారం చేసిన వారు క్షత్రియులైన బుద్దుడు ,మహా వీరుడు . (బుద్దుడు  ,మహావీరుడు  తాము క్షత్రియులమా కాదా అనేది అస్సలు పట్టించు కోరు. సమాజ చరిత్ర కోసం ఈ ముచ్చట తప్ప, ఆధ్యాత్మికం గా మరెందుకు పనికి రాని  విషయం). 
ముఖ్యం గా బౌద్ధ మతం బాగా వ్యాప్తి చెందిన కాలంలో వర్ణం  అంటే గుణం అని కాక జాతి అనే అర్ధం బాగా పాతుకు పోయి కటిన మైన కుల వ్యవస్థ వచ్చింది .

జ్ఞాన తృష్ణ అనేది భరత వర్ష మేధావి వర్గాలలో బాగా ఉండేది . మహర్షులు నిత్యమూ "సామాన్యుడు -సమాజమూ" ప్రశాంతం గా  ఉండాలని తపించే వారు . అపరా విద్య (భౌతిక జ్ఞానం) తో వచ్చే సుఖాలు తాత్కాలిక మని వాటి వెంటే దుఖాలు కూడా  వస్తాయని, కాబట్టి పరా విద్య లేదా బ్రహ్మ విద్య అనేది మన మనస్సుని(అంతః కరణను ) సమూలంగా మార్చి వేసి చిత్తం లో ఉన్న గుణాలను ,వాసనలను భస్మం చేస్తుందని ప్రతి పా దించారు  .
సత్యాన్వేషణ జ్ఞానానికి, ఆ జ్ఞానం ఆనందం, ప్రశాంతత కి  దారి తీస్తుందని సనాతన మహర్షులు గాడం గా నమ్మారు .

మనం ఉన్నామనే ఎరుక(consciousness) భౌతిక శారీర స్థాయిని దాటి కూడా ఉండగలదని నమ్మారు .
దానినే ఆత్మ స్థితి అని చెప్పారు  (transcendence or metaphysical existence). 
రాళ్ళకు,చెట్లకు,కీటకాలకు ,జంతువులకు తమలో భగవద్ శక్తి ఉందని గానీ,
దైవంలోనే ఇమిడి ఉన్నామనే ఎరుక ఉండదు . ఎందు కంటే వాటికి తార్కిక బుద్ది,ఉహా శక్తి  లేదు . 
వాటికి ఒక కర్మేద్రియమో ,ఒక జ్ఞానేమ్ద్రియమో మనిషి కన్నా బాగా పనిచెయ వచ్చు . 
కానీ అన్ని ఇంద్రియాల కూడలి ఐన మనస్సు, మనిషి లో ఉన్నంత గా అభివృద్ధి చెందలేదు . 
అవి ప్రాణాన్ని,తమ అస్తిత్వాన్ని కాపాడు కోవడానికే సత మవుతూ ఉంటాయి . 
మీరన వచ్చు -మనిషి మాత్రం అంత  కంటే ఏం చేస్తున్నాడు ?అని !
నిజమే . అదే మన దౌర్భాగ్యం . అందుకే మహర్షులు సాధనా చతుష్ట యాన్ని మొత్తు  కొంటూ చెప్పారు .  
అత్యంత గొప్ప నిజం ఏమిటీ అంటే , మనిషి బుద్దికి ఆ ఎరుక కలిగిఉండే  సామర్ధ్యం  ఉంది . 
అయినా మనిషి ఇంకా జంతు వుల మాదిరి బతకటానికి ఆరాట పడుతున్నాడు . 
పురోగ మించ డానికి ఏ  మాత్రం ఇష్ట పడటం లేదు . 
మీరు గమ నించే ఉంటారు , మన థాలమస్  కన్నా సెరేబ్రం చాలా పెద్దది . దానికి ఉన్న ఒకేఒక  కారణం 
మనిషి జంతు స్థాయి సహజాతాలను దాటి మానవ సహజాతాలను అభ్యాసం చేసు కొంటూ విశ్వ చైతన్యపు అంతరాలను అందుకోవా లనే, పరిణామం మనిషికి పెద్ద సెరేబ్రం ని ఇచ్చింది . 
ఎడమ మెదడు తార్కిక జ్ఞానానికి ,కుడి మెదడు ఉహా శక్తికి (ప్రజ్ఞ ) కి మనం ఉపయోగించు కొంటాం . 
ఈ రెండు లక్షణా లే మనిషిని జంతువు నుండి విడ దీశాయి . 
దీనిని నిరూపించ వలసిన బాధ్యత మనందరిదీ . 

Comments

  1. very nice starting of the description rajuji,Thanking you sir.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి