ఏంటి మనిషి గొప్ప ?


కీటక జన్మకి ఏ గమ్యం ఉందో మనిషికీ అంత  కంటే గొప్ప గమ్య మేమీ లేదు .
ఏంటి మనిషి గొప్ప ?
కాస్త దానికి కూస్త దానికి కొంచెం ఎక్కువ మోతాదులో గందరగోళం పడి  పోయే మనస్సు తప్ప .
ప్రతి విషయాన్నీ ముందుగా నే ఉహించు కోవడం ,ప్రతి మాటలో తన దృక్పధానికి అనుగుణ్య మైన అర్ధాన్ని వెతుక్కోవడం , ప్రతి దృశ్యం లో తన అభిరుచి ని మాత్రమే గుర్తించ గలగడం -
ఇవన్నీ మనిషి కి వరాలు -శాపాలు .
నిజాన్ని గ్రహించ నివ్వ కుండా చేసే ఈ మాయ కి కారణం ఎన్నో చిక్కు ముళ్ళు ఉన్న మనస్సే .

మనిషి జాతి ఒక్కటే మహోన్నత మైనది.
 పరిణామం లో మనిషి ఎన్నో మెట్లు ఎత్తున ఉన్నాడు ,
మనిషి జన్మకి లక్ష్యం ఉంది -- ఇలా ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి .
తరచి చూస్తే ఈ సృష్టి లో ప్రతి ప్రాణికీ ప్రాధాన్యత ఉంది . ఏది లేక పోయినా సృష్టి అసంపూర్ణమై ,
ప్రక్రుతి సమ తుల్యత దెబ్బ తింటుంది .
 తనొక్కడి కోసమే ఈ సృష్టి అని, మనిషి విర్ర వీగుతూ ప్రకృతిని, తోటి ప్రాణులను
అతలా కుతలం చేస్తున్నాడు .
అవును చేస్తున్నాడు . ఎందుకు చేస్తున్నాడు ? 
ఏ  ప్రాణి అయినా తన జాతిని విస్తరింప చేసు కొంటుంది . దానిలో తప్పొప్పులు ఉండవు .
పూర్వం ఎన్నో జాతులు భూ మండలాన్ని ఏలాయి . ఉదాహరణకు ,డైనోసార్స్ లక్షలాది ఏళ్ల  పాటు
మిగతా జంతువులని శాసించాయి.
అలాగే , మానవ జాతి మిగతా అన్ని ప్రాణులను తోసివేసి ఈ భూ గోళాన్ని
ఆక్రమించు కుంటుంది . పెరుగుతున్న జనాభా అవసరాలకు ఎన్నో జీవ జాలాలు
సమిధ లవు తున్నాయి .
శక్తి వంత మైన ఇంద్రియాలు లేక పోయినా ,మనిషి  తనకున్న జ్ఞాన సంపద తో
కొత్త కొత్త పరికరాలు  తయారు చేసు కొని శక్తి వంతుడిగా ,ఒక విధం గా ఈ సృష్టి కే
చక్రవర్తి గా భాసిల్లు తున్నాడు .
భూమి ,సముద్రాలు ,అంతరిక్షం అన్నింటినీ అధిగ మిస్తున్నాడు .
ఈ అప్రతిహత మానవ పరిణామానికి అన్నీ -ప్రక్రుతి,జీవజాలం  ఖర్చు అవుతున్నాయి .
ఇది నిత్య పోరాటం .
అలాగే ,  మనిషికీ ప్రకృతికి మధ్య పోరాటం ఎంత సహజమో ,
మనిషికీ మనిషికి మధ్య గొడవలు,యుద్దాలు  అంతే సహజం .

జీవ పరిణామం లో ఒకానొక సమయం లో అత్యంత మౌలిక జన్యు  మార్పు హటాత్తు గా వచ్చిందని ,
ఆ మార్పు కి కారణం దూర గ్రహ బుద్ది జీవులు కావచ్చని ,వారినే ఆదిమ మానవులు దేవతలు గా
పూజించడం చేశారని,పిరమిడ్ లు ,ఇంకా ఎన్నో వింత కట్టడాలు వారి చలవే అని ,
ఈ భూమండలంలో ఎన్నో ఉత్కృష్ట నాగరికత లు పరిడ విల్లి కాలాంతరం లో కనుమరుగు అయ్యాయని ,
ఇదంతా ఓ పెద్ద చర్విత "నాగరికతా చక్రమని",ఇప్పుడు మనం చూస్తున్న భౌగోళిక స్థితి కూడా
నిరంతరం ఎన్నో మార్పులు చెందే ఖండ చలనమని,నేటి సముద్రాలు పూర్వ కాలంలో ఎడారులని ,
అలాగే నేటి ఎడారి ప్రాంతాలు, కొన్ని పర్వత ప్రాంతాలు (శేషాచలం,హిమాలయాలు ) పురాతన
యుగం లో సముద్రాల ని  -శాస్త్రజ్ఞులు, కొన్ని ఆధారాలతో ,మరికొంత ఉహా జనితం గా చెప్పారు .


కనీస అవసరాలు తీర్చు కోవడం , మిత మైన కోరికలు ,మితం గా ఆలోచించడం ,
అందరినీ అభిమానించడం ,ప్రకృతిని సంరక్షించు కోవడం ,పొరుగు వాడికి సాయం చేయడం ,
అన్యాయాన్ని ఎదిరించడం ,బలహీన ప్రాణులను రక్షించడం ,ఆధార పడ్డ వారిని పోషించడం -
ఇవీ సగటు మనిషి చేయ వలసిన విధులు .అంటే ప్రాణుల సహజాతాలు (instincts)ఇవన్నీ .
ఈ ధర్మ సూత్రానికి వ్యతి రేకం గా ప్రవర్తించే వారు శిక్షార్హులు .

మనం సరిగ్గా గమనించడం లేదు గానీ , ప్రతి ప్రాణి పైన చెప్పు కొన్న కనీస బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తు న్నాయి .
"Scientists have increasingly discovered that animals are capable of actions and thoughts once thought to be the preserve of humans, such as the use of tools, showing empathy to another creature and being able to convey complex ideas using sound.
there is now "very good evidence to suggest that crows and a number of other mammals grieve for their dead". 
కానీ,మనిషే ధర్మం తప్పుతున్నాడు .

మన భారత సమాజాన్ని  ఉదాహరణ గా తీసుకొందాం .
యజ్ఞ హోమాలలో మూగ జీవాల బలులు ఒక విధం గా మానవ సమాజ ఆర్ధిక వ్యవస్థ ని
 చిన్నాభిన్నం చేశాయి . ఎందు కంటే ఆ కాలంలో జీవాలే సొమ్ములు .

బౌద్ధం ,జైనం - ఈ మత సిద్దాంతాలు , పెడ దారి పట్టిన యజ్ఞ హోమాలను ,వేదాలకు తప్పుడు అర్ధాలు చెబుతూ బతుకులు వెళ్ళ బుచ్చుతున్న ఆ నాటి బ్రాహ్మణ వర్గాన్ని తీవ్రం గా వ్యతి రే కించి ,సమాజ సమతుల్యత ని కాపాడ టానికి కృషి చేశాయి . కానీ ఈ మతాలు కూడా స్వార్ధ పర శిష్యుల చేతిలో వక్ర మార్గం పట్టి మళ్ళీ ఆదిశంక రుల భాష్యాలతో వైదిక మార్గం పట్టింది సమాజం .
ఏ సిద్దాంత మైనా, మత మైనా ఆ నాటి ప్రజలకు, సమాజానికి పనికోచ్చెంత  వరకే బతికి బట్ట కడతాయ్ .
ఆ తర్వాత కాల గర్భంలో కలిసి పోవలసిందే .

మనిషి తన శరీరం ఆరోగ్యం గా, బలం గా ఉండాలని ,శత్రువులనుండి రక్షణ పొందాలని
ఎన్నో ప్రయత్నాలు చేశాడు . చేస్తున్నాడు . ఆ క్రమం లో ఎన్నోరసాయనాలు,చూర్నాలు,లేహ్యాలు ,
పసర్లు ,చివరికి గోలీలు,గొట్టాలు,సూది మందులు,ఆపరేషన్ లు --ఇలా ఆల్కెమీ నుండి అల్లోపతి వరకు మనిషి చేసిన ప్రయాణం ,మధ్యలో పాదరసాన్ని బంగారం గా మార్చ వచ్చనే దురాశకి ,
అలాగే మనిషి ఆయుర్దాయాన్ని పెంచే రకరకాల గిమ్మక్కులకి కూడా కారణ మయ్యింది .
మనిషి కాంతా -కనకాలకు బానిస. ఆ సంకెళ్ళు తెంచు కోలేక పోతున్నాడు .
వాటి కోసమే ఎన్నో మారణ కాండలకు,నర మేధాలకు  కారణ మయ్యాడు .
పెరిగిపోతున్న కోరికల చిట్టాని ఎలా గైనా తీర్చు కోవాలని ఎవరెం చెబితే అది చేసే స్థితికి వచ్చారు ప్రజలు .

పరిస్థితులు చేయి దాటి నప్పుడు సమాజ మే ఓ మార్పుని తీసుకొచ్చే వ్యక్తులను తయారు చేస్తుంది .
సమాజం అంటే మూకుమ్మడి చైతన్యం (collective consciousness).
ఆ పరిస్థితులలో , కొంత మంది తెలివి గల వారు ఈ అశాంతిని ఎలాగైనా తుడిచేసి
మనిషిని ఒక సక్రమ మైన మార్గం లో పెట్టాలని ఆలోచన చేశారు .
అశాంతికి కారణం ? వ్యామోహం . మితిమీరిన స్వార్ధం .


లోకంలో ఏ  ప్రాణికీ రాని  సందేహం మనిషికి వచ్చింది . ఈ సందేహం మనిషికి కలగడం
ముఖ్య మైన పరిణామం .
(మిగతా ప్రాణులకి ,అలాగే సుదూర గ్రహ వాసులకి కూడా ఈ సందేహం వచ్చిందో లేదో
మనకు ఇదమిత్తం గా తెల్వదు .)

ఈ సృష్టి కి ఏదైనా అర్ధం ఉందా ?
సృష్టి దానంత ట దే నడుస్తుందా ? లేక ఇదంతా ఎవరైనా నడిపిస్తున్నారా ?
ఈ సృష్టిని ఒకరు నడిపించ వలసిన అవకాశం ,అవసరం ఉందా ?
ఈ సృష్టి లో మనిషికి ఏదైనా ప్రత్యేక పాత్ర ఉందా ?
ఈ ప్రశ్నలకు సమాధాన మే దైవం అనే భావన .
 ఈ భావానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వని వారి నే నాస్తిక వాదు లంటారు .
సృష్టి కర్త ,పోషకుడు, రక్షకుడు ,ప్రళయ కారకుడు - దైవం అనే భావన మనిషి మానసం లో
పొట మ రించ డం,మానవ పరిణామం లో   అత్యంత కీలక మైన మలుపు.
ఒక భావనని సిద్దాంతం గా వ్రాసుకొని ,దానిని నిరూ పణ చేయడానికి అటు మహర్షులు ,
ఇటు శాస్త్ర వేత్తలు నడుం కట్టి ఎన్నో ఆవిష్కరణలు చేశారు .
ఒకరు బాహ్య ప్రపంచాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ,టెలిస్కోప్ ల ద్వారా జల్లెడ పట్టి నేబ్యులాల నుండి క్వాంటం మూల కణాలను ఆవిష్కరిస్తే  ,
కొందరు మహర్షులు అంతర్యానం చేస్తూ మనస్సుని ,బుద్దిని ,చివరకి ఆది మూల సత్యమైన ఆత్మని సాక్షాత్కరింప చేసు కొన్నారు .
Science ends in philosophy & vice versa.
బయట ఉన్నదే లోనున్నది .
పైన ఉన్నదే కింద ఉన్నది .
విత్తులో ఏముందో చెట్టులో అదే ఉంది .
బ్రహ్మాండం లో ఏముందో అండాం డం లో కూడా అదే ఉంది. - ఇది సత్యం . ఇదే సత్యం . 

Comments

Post a Comment

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి