వేదం సత్యం ...

Divinity lies within us all రధికుడు ఎలాగైతే పగ్గాలు పట్టుకొని గుర్రాలను నడిపిస్తాడో , అదే విధం గా సూర్యుడు తన ఆకర్షణ శక్తితో , తన చుట్టూ గ్రహాలను ఒక నియమిత కక్ష్య లో తిరిగే విధం గా  చేస్తు న్నాడు . (ఋగ్వేద 10.149.1)-
that planets move around sun due to attractive power of the sun.
ఈ సత్యాన్ని కనిపెట్టింది న్యూటన్ అని మనం చదువు కొంటున్నాం . కానీ, ఈ వేద రుక్ ని చదివితే,సుమారు 10000 ఏళ్ళకి పూర్వమే సనాతన భారతీయులు మానవ శరీరం,మానసిక రహస్యా లు , అంతరిక్ష జ్ఞానం,
ఇవే కాక "అవిచ్చిన్న చైతన్యానికి " సంబంధించిన  జ్ఞానం లో  మేటి అని తెలుస్తుంది . 
అందుకే వేదం ఇలా అంటుంది - " ఏకం సత్ బహుదా వదంతి " (there is only one truth, only men describe it in different ways.). 
టెలిస్కోప్ లు లేవు . ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శిని లు లేవు . 
ఎదురుగా లేదా దూరం గా ఉన్న   ఒక వస్తువు ని  చూసి  లేదా ఆ వస్తువు చేస్తున్న శబ్దాన్ని విని లేదా ఆ వస్తువు వెలువ రిస్తున్న స్పందనలను  గ్రహించే పరిజ్ఞానం ఎలా అబ్బింది ? 

ఆయా పదార్ధాల వెనుక ఉన్న అవిచ్చిన్న చైతన్యం లోకి యోగి వెళ్ళినప్పుడు సృష్టి లో సమస్తం  గురించి అవగాహన కలుగుతుంది . అలాగే ఆ అవిచ్చిన్న చైతన్యం, దేశ కాలాల కు అతీతం గా ఉండటం వల్ల 
ఆత్మ యోగి కి వర్త మాన,భూత,భవిష్యత్ అనే తేడా ఉండదు .
మనిషి  లో దైవత్వం ఉంది . అది మనిషి మరిచాడు . మళ్ళీ దానిని గుర్తుకు తెచ్చుకొని సుస్థిర మవ్వడమే మనిషి గమ్యం -అని వేదం . 
లేసర్ అంటే కెంద్రీకరిత మైన(focused) పొందికైన (coherent)కాంతి కిరణం . 
దాని శక్తి మనందరికీ తెలిసిందే .  
అలాగే మనస్సు కూడా ఒక పొంది కైన మార్గం లో కెంద్రీకరిత మైతే  విశ్వ చైతన్యపు స్పందనకి సాధకుడి మనస్సు ప్రతిధ్వనించి లేదా అనుకంపిం చి(resonance), సమాచారం అప్రతిహతం గా ప్రసార మవుతుంది . 
ఈ విధం గా నే మహర్షులు విశ్వ రహస్యాలను దర్శించి ప్రజా బాహుళ్యానికి ,లోక కల్యాణానికి ఉపయోగించారు . 
వేద ఋషుల అత్యంత ముఖ్య మైన మంత్రం గాయత్రి . 
అన్ని దిక్కులా వ్యాపించి ఉన్న విశ్వ చైతన్యం నుండి సమాచారం సదా నాలోకి ప్రవహించు గాక . 
 సమస్తమూ ఒకే సత్యం నుండి వచ్చినదే కాబట్టి, అంతా ఒక్కటే ,జనులంతా ఒక్కటే , వసుధైక కుటుంబమే --- అనే ఉత్కృష్ట భావన భారతీయులలో స్థిర పడి  పోయింది . 
వేదాలను తేలికగా చూడ వద్దు . 
90% ఋక్ లు క్రతువుల గురించి వివరించి నట్లు గా పైకి కనిపించినా అంతర్యానం చేస్తూ అంతరార్ధం తెలుసు కోవలసిన కనీస బాధ్యత మనందరిదీ . 

Comments

  1. so vivid rajuji plz elaborate if you want sir, thanks.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి